గురుపౌర్ణమి
- Yasoda Gottiparthi
- Jul 10
- 2 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #గురుపౌర్ణమి, #GuruPournami

Guru Pournami - New Telugu Poem Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 10/07/2025
గురుపౌర్ణమి - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
🙏గురుపౌర్ణమి🙏
భారత దేశం వేద భూమి, పుణ్యభూమి.
అతి పవిత్ర మైన సవిత్రి
యోగులు నడయాడి
పునీతం చేసిన యోగభూమి. ప్రపంచదేశాలన్నిటికీ
గురు స్థానం భారతదేశమే!
ఈ దేశంలో సద్గురువులు సమ భావం కలిగిన వారు.
తామెన్నైనా శ్రమల కోర్చి,
తమ శిష్యులను సమున్నత స్థితి యందు నిలిపి గురువులుగా తీర్చిదిద్దుటలో సిద్ధ సంకల్పులు.
ఒక జ్యోతి అనేక జ్యోతులను వెలిగించుటకు కారణమైనట్లు
ఒక జ్ఞాని తన జ్ఞానమును
అనేక మందికి బోధించేవారు
కూడా జ్ఞానులు సద్గురువులు, యోగీశ్వరులు
సర్వ దేవతా స్వరూపుల
ఆత్మ స్వరూపి, పర బ్రహ్మ స్వరూపి దైవాంశ సంభూతి. సద్గురు మాత
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపులు
ఆత్మ సాక్షాత్కారం కొరకు
మరుజన్మ లేకుండా దైవం
పంపిన ప్రతినిధులు
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ
చిన జీయర్ స్వామి..
ప్రపంచదేశాల్లో గురుస్థానం
భారత దేశం
యోగులు నడయాడి పునీతం
సద్గురువుల సమభావం
సర్వ దేవతా స్వరూపం
శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి
అగ్నివంటి శుచిత్వం, చంద్రుని వంటి ప్రహ్లాదం, భానుని వంటి తేజస్విత్వం
లోకంలో పర హితమే పరమార్థం
శీతలస్వభావులు, దయార్ద్ర
హృదయులు 1956 నవంబర్ 3 జననం అలివేలు మంగతాయారు కృష్ణమాచార్యుల ఆధ్యాత్మిక పుత్రుడు
ఆర్థమూరులోదీపావళి రోజున జననo వేద గురువు, ఉపదేశికుడు
23వ ఏట సన్యసిoచే
గీతా జ్యోతి ఉద్యమం భగవద్గీత ప్రాచుర్యం
మానవుల సోమరితనం పోగొ ట్టి వేదవిద్య సమాజానికి అందింప
నేత్రాలు కరువైన వారికి పాఠశాలలు స్ధాపించి
కంప్యూటర్ విద్య ప్రావీణ్యులను చేసె పండ్రెండు రోజుల్లో రోజుకోభాష నేర్చిన ఘనాపాఠి స్వామీజీ
విశిష్టాద్వైత మత స్థాపకుడు
సర్వ ప్రాణి సేవకుఁడు
నిరంతర సేవా తత్పరుండు -వృద్దులు, విక లాంగులకు
చేయూత నిచ్చెను స్వామి
త్రిదండము ధరించి
త్రిగుణాలకు అతీత మైన వాడు
హైన్దవ తత్వం విశ్వ వ్యాప్తం
చేసి భక్తులహృదయాలలో
చిరస్మరణీయుడు
దేశ వ్యాప్తముగా
మూతపడిన ఎన్నో
దేవళములు పునః ప్రతిష్ట
చేసినవాడు
పద్మశ్రీ అవార్డు గ్రహీత,
ఆద్యాత్మిక గురువు,
చతుర్వేద ఙ్ఞాన పండితుఁడు.
విశ్వానికి విజ్ఞాన ప్రదాత
వేద విద్యాలయాల స్థాపన
శ్రీరామ నగర్, శంషాబాద్
జిమ్స్ అనే ఆసుపత్రిలో వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి సామాజిక సాoస్కృతిక రంగాల నిర్వహణ
హిందూ గ్రంధాల్లో ప్రావీణ్యం
ప్రపంచ వ్యాప్తం
యజ్ఞ యాగాదుల సత్కార్యం
దేశభక్తి భారతీయ సంస్కృతి,
ఏబీవీపీ విద్యార్థి సంస్థను
సమతా మూర్తి నెలకొల్పి
ఒక జ్ఞాని అనేకమంది జ్ఞానవంతుల చేయుటకు కారణం ఉంది
మనిషి ఆత్మ స్వరూపమని తెలుసుకోక ఆధ్యాత్మిక చింతన
లేక పరమాత్మ జ్ఞానం శూన్యo
స్వామి శ్రీ స్వామివారి మంగళ శాసనముతో ప్రారంభమైన" మహిళా ఆరోగ్య వికాస్ "ఎంతోమంది మహిళలకు అనేక ప్రాంతాల్లో
సేవలను అందిస్తుంది
అక్షరజ్ఞానం, అన్యాయాల
సమస్యలపరిష్కారం, మంచి కార్యం నిర్వహించాలంటే ఎంతో కృషి పట్టుదల, సేవా భావం చాలా అవసరం అందున సమాజంలో మన ముందుకు సాగాలి అంటే ఎన్ని అవరోధాలు అడ్డంకులు ప్రతిబందకాలు ఎదురవుతుంటాయి
వీటన్నిటిని ఎంతో ఓపికగా ఎదుర్కొంటూ సేవలు అందిస్తున్నారు
సంసార బంధనా విముక్తికి భగవంతునితో బంధమే భాగ్యం పరలోకమునకు సన్మార్గం
ఆయుషు తీరిన వెంటరాదు
పడిన కష్టం జారిపోవు
నవవిధభక్తి మార్గాలు మాత్రమే భగవంతుని చేరుట సులభం
బోధనలతో భక్తి మార్గం భావ్యం
***

-యశోద గొట్టిపర్తి
Comments