గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
- Neeraja Prabhala

- Jul 10
- 1 min read
#TeluguArticle, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #GururbrahmaGuruvishnu, #గురుర్బ్రహ్మగురుర్విష్ణుః

గురుపౌర్ణమి సందర్భంగా...
Gururbrahma Guruvishnu - New Telugu Article Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 10/07/2025
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః - తెలుగు వ్యాసం
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః🙏🙏
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మ నిధయే వాసిష్టాయ నమోనమః
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుః స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గురవే సర్వ లోకానామ్ భిషజే భవ రోగిణామ్ !
నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః
శివుని అంశ దక్షిణామూర్తి కాగా, ఆ దక్షిణామూర్తి ప్రతిరూపమే గురువులు.
అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించి దారి చూపే సద్గురువులు.
జననీ జనకుల అవ్యాజప్రేమకు మరో రూపం గురువు.
పామరులను సైతం పండితులను చేసి, నిర్మలమైన, స్వఛ్ఛమైన ప్రేమాప్యాయతలు చూపే దైవం గురువు.
నిస్వార్థంగా విద్యాదానం చేసి కన్న వారి ప్రేమను మరిపించేది గురువే .
ఉన్నత స్థాయిలో శిష్యులు ఉండాలని వాళ్ళ ప్రగతికి పాటుపడి దారి చూపే జ్ణానజ్యోతి గురువు.
వట వ్రృక్షంలా ఎంత ఉన్నతికి ఎదిగినా ఆ వ్రృక్షంబు తొలి బీజం గురువే.
వేయేల పలుకులు ? ఆ దేవుని ప్రతిరూపమే గురువు.
పత్రం- ఫలం - తోయం ఇచ్చినా తీర్చ లేని మీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలము?
ఏ సేవలతో మిమ్మల్ని సంత్రృప్తి పరచగలము?
ఆమూలాగ్రము విద్యనభ్యసించి అపూర్వమైన ప్రజ్ణ చూపటం తప్ప.
ఎన్ని సత్కార్యాలు చేసినా మీకు చేసే సన్మానము లోనే సంత్రృప్తి, ఆనందము కలుగును మిన్న.

-నీరజ హరి ప్రభల




Comments