హాస్య అనుభవాలు
- Peddada Sathyanarayana
- Sep 26
- 2 min read
#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #HasyaAnubhavalu, #హాస్యఅనుభవాలు, #TeluguArticleoncomedy

Hasya Anubhavalu - New Telugu Article Written By - Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 26/09/2025
హాస్య అనుభవాలు - తెలుగు వ్యాసం
రచన: పెద్దాడ సత్యనారాయణ
సాహితి ప్రియులు వార్తాపత్రికలు బజారులో కొనుక్కొని ఇంటికి తెచ్చిన వెంటనే, కుటుంబసభ్యులు పోటీపడి ప్రథమముగా హాస్యానికి పునాది రాళ్ల యిన కార్టూన్లు చదివి హాయిగా నవ్వుకుంటారు. తదుపరి హాస్య కథ ప్రచురించిన పేజీ లో నిమగ్నమయి ఆనందముగా ఆస్వాదిస్తారు అనేది పాఠకులెరిగిన సత్యము. ఈసందర్భముగా హాస్య కథలు చదివిన తర్వాత సీరియల్ కథలు చదివే పాఠకులు కూడా హాస్యప్రియాలే.
ముఖ్యముగా హాస్య కథ రచనలో బహు భాషా ప్రయోగము సహజమని గమనించవచ్చు. సాదారణముగా ఆంగ్లపదాలు, హిందీ పదాలు, ఇతరభాష వాడుక పదాలు హాస్యానికి వన్నె తెస్తుందని పేర్కొన వచ్చు. అదేవిధముగా ప్రాంతానుసారముగా మాండలిక పదాలు కూడా ప్రయోగించే హాస్య రచయితలు హాస్యానికి రక్తి కట్టించడము ప్రత్యేకత అని భావించవచ్చు.
సహజముగా హాస్య కథల విషయములో పాఠకులకి తేలికగా అర్ధమయ్యే సరళ రీతిలో పదాలు ప్రయోగించడము గమనించవచ్చు. హాస్యకథలు, వృద్దులు, గృహిణులు, విద్యార్థులు మొదలగు వారు చదివి రోజంతా ఉత్సాహము గా గడుపుతారనేదుకు సందేహము లేదు అనారోగ్యులకు హాస్యకథలు ఆరోగ్యాన్ని ప్రసాదించే టానిక్ అని పేర్కొనవచ్చు. హాస్యకథలు చదివే సందర్భములో పాఠకులు తమ ఉనికిని మర్చిపోయి ఆనందించే సంఘటనలు గమనించవచ్చు.
‘ఏరా నీలో నీవు నవ్వుకుంటున్నావు మాకు కూడా చెప్తే మేము నవ్వుకుంటాము’ అనే మాటలు తరచు నలుగురు ఉన్నచోటు హాస్యానికి ఉన్న విలువ గమనించవచ్చు.
ఈ సందర్భముగా ఒకసారి దివంగత హాస్య నటుడు రేలంగిగారు, నిజ జీవితములో జరిగిన ఘటన హాస్యానికి ఉన్న ప్రత్యేక తెలుపుతుంది. ఒకసారి రేలంగిగారు పరామర్శించేందుకు చనిపోయిన వారింటికి వెళ్తే అక్కడ ఉన్న జనాలు ఏడుపు మానేసి రేలంగి గారితో సంభాషించడము జరిగింది.
హాస్య రచయితలు పండించిన హాస్య పదాలు నేటివరకు సందర్భానుసారంగా ప్రజలు ప్రయోగిస్తున్న విషయము హాస్య సత్యము అని గమనించవచ్చు. ఉదాహరణకి " టికెట్ లేనివాడు ఓడ ముందర ఎక్కినట్టు ", "అంతేగదా" మరియు "బ్రో" అనేపదము వాడుక ఆత్యధికము గా వాడుకలో ఉందని వెల్లడయింది. ఈ మధ్య ప్రేయసి, ప్రియురాలు అను వాడుక పదము కను(విన ) మరుగయ్యి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గా ప్రాచుర్యము పొందాయి.
తెనాలి రామ కృష్ణ హాస్య కవి యొక్క కథలు ఈ రోజు వరకు తరాలు మారినా ప్రజలు ఆదరిస్తున్నారనేది జగమెరిగిన సత్యము. తెనాలి రామకృష్ణ కవి హాస్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధముగా బాపు రమణల గారి హాస్య కథలు, కార్టూన్లు నేటివరకు ప్రజా ఆదరణ పొందుతున్నాయి.
హాస్యకథలు ప్రజానీకానికి ఆనందము కలిగిస్తున్న విషయము సహజమే. హాస్య రచనలు పాఠకులు తమ నిజజీవితములో చేస్తున్న తప్పులవలన ఇతరులకు కలిగే మనస్తాపము కూడా తెలుపుతుంది.
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Comments