top of page

హనీ ట్రాప్


'Honey Trap' New Telugu Story Written By Sirisha Sadhanala

'హనీ ట్రాప్' తెలుగు కథ

రచన: శిరీష సాధనాల

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“నాన్నా! నాకు ఒక మంచి ఫోన్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర మంచి మంచి ఫోన్స్ ఉన్నాయ్. నా 10th క్లాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటర్ కి వచ్చేసా. ప్లీజ్ నాన్నా.. అమ్మ కి చేప్తుంటే అమ్మ ఏమో అప్పుడే ఫోన్ ఏంటి అని తిడుతోంది. నువ్వే అమ్మ ని ఒప్పించి నాకు ఒక మంచి ఫోన్ కొని ఇవ్వు నాన్నా!” అని చాలా గారం గా తన తండ్రిని అడుగుతుంది ఆద్య.


“అది కాదు రా చిట్టి తల్లీ! అమ్మ చెప్పేది కూడా నీకోసమే కదా. నీకు ఇంటర్ అయిపోయి బీటెక్లో జాయిన్ అవుతావు కదా.. అప్పుడు నీకు నువ్వు అడిగిన దాని కంటే మంచి ఫోన్ కొని ఇస్తా” అని బుజ్జగించే ధోరణిలో చెపుతారు ఆద్య వాళ్ళ నాన్న గారు శేఖర్ గారు.


“మీరు అంత సాఫ్ట్ గా చేప్తే వినే కూతురు ఏం కాదు మీ కూతురు.. అది ఎన్ని వేషాలు వేసినా దానికి అప్పుడే సెపరేట్ ఫోన్ కొని ఇవ్వడానికి నేను ఒప్పుకోను. దాని వయసు కి అప్పుడే ఫోన్ అక్కర్లేదు. అంతగా కావాలి అంటే మన ఇద్దరి దగ్గర ఫోన్స్ ఉన్నాయ్ కదా.. అవి వాడుకోమనండి” అని సీరియస్ గా అంటారు జ్యోతి గారు


“అమ్మా! నువ్వు, నాన్న పొద్దున్నే వెళ్ళిపోతారు ఆఫీస్కి. మళ్ళీ రాత్రి ఎప్పటికో వస్తారు. ఇంకా మీ ఫోన్స్ నేను ఎలా వాడుకుంటా అమ్మా.. మీ ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిపోతే బోర్ కదా అమ్మా. పోనీ అమ్మమ్మ దగ్గరకి లేదా నాన్నమ్మ దగ్గరకి వెళ్దాం అంటే అక్కడ ఏమో సిగ్నల్ సరిగా ఉండదు..


ప్లీజ్ అమ్మా.. మా ఫ్రెండ్స్ అందరూ కొనిపించు కుంటున్నారు.. పోనీ మనం ఏమైనా ఫైనాన్సియల్ గా సరిగా లేమా అంటే నువ్వు నాన్న ఎక్కువే సంపాదిస్తారు కదా.. ఎందుకమ్మా చిన్న చిన్న వాటికీ కూడా ఇంత ఇష్యూ చేస్తావ్? అసలు నేను అంటే ఇష్టమే ఉండదు నీకు. అందుకే నేను ఏం అడిగినా నాకేమీ కొనివ్వవు.. నాన్నని కూడా ఏమీ కొననివ్వవు. అందుకే ఐ హేట్ యు అమ్మా.. మీరు నాకు ఫోన్ కొనిస్తా అని చెప్పే వరుకు నేను అసలు మీ ఎవరితో మాట్లాడాను. భోజనం కూడా చేయను”అని గది లోపలి వెళ్లి డబ్ అని సౌండ్ వచ్చేలా డోర్ వేసింది ఆద్య


ఆద్య మొండి తనానికి, ఆద్య ప్రవర్తనకి తల పట్టుకుని కూర్చున్నారు తల్లితండ్రులు.


శేఖర్, జ్యోతి ఇద్దరూ పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉద్యోగం చేస్తున్నారు.. వాళ్ళకి వచ్చే నెల జీతం కూడా లక్షల్లో ఉంటుంది. బయట పెరుగుతున్న ఖర్చులకు ఇద్దరు పిల్లలు ఐతే కష్టమని ఆద్య ఒక్కటే చాలు అని అనుకుంటారు.. ఆద్యని ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించారు. ఇద్దరూ జాబ్ చేయడం వాళ్ళ ఆద్య తో టైం స్పెండ్ చేయడం కుదరట్లేదు అని సాటర్డే, సండే ఆద్య ఎక్కడికి అంటే అక్కడికి తీసుకుని వెళ్లడం, తనకి నచ్చినవి కొని ఇవ్వడం.. అవి చేయడం వల్ల చిన్నప్పటి నుండి మొండితనం పెంకి తనం వచ్చేసాయి ఆద్యకి.


ఇప్పుడు అదే వీళ్ళకి పెద్ద సమస్య గా తయారైంది.


“పోనిలే జ్యోతీ! ఇప్పుడు చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ వుంటున్నాయి. మన ఆద్య కూడా మరీ చిన్న పిల్ల ఏం కాదు కదా.. జనరేషన్ చేంజ్ అవుతోంది. మనం కూడా చేంజ్ అవ్వాలి. అది అడిగిన ఫోన్ కొని ఇచ్చేద్దాం” అని జ్యోతి గారితో అంటారు శేఖర్ గారు, కూతురు నిజం గానే ఆకలితో పడుకుంటుంది ఏమో అనే బాధ తో..


“ఇద్దరూ గారాబం చేస్తే అది ఎక్కడ ఇంకా మొండిగా తయారైపోతుందో అనే భయంతో నేను స్ట్రిక్ట్ గా ఉంటే అది ఏమో నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తుంది అండి.. చూసారా.. ఐ హేట్ యు అమ్మ అని ఎలా డోర్ వేసేసుకుందో.. నేను ఏం చేసినా దాని మంచి గురించే అని దానికి ఎప్పటికి అర్ధం అవుతుందో” అని బాధ పడతారు జ్యోతి గారు.


శేఖర్ గారు జ్యోతిగారి భుజం చుట్టూ చేయి వేసి ఆమెని దగ్గరకి తీసుకుని “నీ జాగ్రత్త వెనుక ఉన్న ప్రేమని అర్ధం చేసుకునే అంత మెచూరిటీ దానికి ఇంకా రాలేదు జ్యోతీ! నువ్వు బాధ పడకు.. నీ ప్రేమ అర్ధం అయినపుడు అదే అమ్మా.. అమ్మా.. అంటూ నీ వెనుక తిరుగుతుంది” అని ఓదారుస్తారు..


“సరే అండి.. నాకు ఆకలి వేయట్లేదు. ఆద్య ఆకలితో ఉండలేదు. అది అడిగిన ఫోన్ ఎదో కొనిపెడతా అని చెప్పి భోజనానికి పిలవండి” అని చెప్పి లోపలికి వెళ్లి పోతారు జ్యోతి గారు.


‘ఫోన్ కొనిపెడతా’ అని తండ్రి చెప్పడం తో ఫుల్ గా తినేసి హాయి గా పడుకుంటుంది ఆద్య. మరుసటి రోజు తండ్రి తో తనకి నచ్చిన ఫోన్ కొనిపించుకుని సంతోషం గా ఇంటికి వస్తుంది ఆద్య.


“ఫోన్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తె తోలు తీసేస్తా” అని తల్లి స్ట్రాంగ్ గా ఇచ్చిన వార్నింగ్ ని, ఫోన్ చూసి మురిసిపోతూ పెడచెవిన పెడుతుంది ఆద్య.


మరుసటి రోజు తల్లి, తండ్రి ఆఫీస్ కి వెళ్ళిపోయాక వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ అప్స్ ఇన్స్టాల్ చేసి ఫ్రెండ్స్ అందరికి నెంబర్ ఇచ్చి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుంటుంది.


తరువాతి రోజు నుండి ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ యూస్ చేయడం మొదలు పెడుతుంది.. ఇంస్టాగ్రామ్ లో ఎవరు ఎవరో ఫాలో అవుతున్న చాటింగ్ లో ఏం కాదులే అనే మొండి ధైర్యంతో తెలియని వాళ్ళతో చాట్ చేసి కొత్త పరిచయాలు పెంచుకుని అవి అన్ని ఫ్రెండ్స్ కి చెపుతూ రోజు అంతా గడిపేసేది.


ఒక రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా “నువ్వు చాలా అందం గా ఉంటావ్ కదా ఆద్య.. నువ్వు కూడా అందరిలా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తే నువ్వు చాలా ఫేమస్ అయిపోతావ్” అని చెప్తే అసలే టీనేజ్ లో ఉన్న ఆద్య ఆ మాటలకు చాలా అట్ట్రాక్ట్ అయిపోయి అప్పటి నుండి రీల్స్ చేయడం మొదలు పెట్టింది.. ఆ రీల్స్ కింద వచ్చే కామెంట్స్ కి వయసు తో వచ్చిన చెంచల స్వభావం తో ఆ కామెంట్స్ కి మురిసిపోయి అబ్బాయిలు తన అందాన్ని పొగుడుతుంటే గొప్ప గా ఫీల్ అయ్యి అబ్బాయిలతో చాట్ చేయడం లేదా రీల్స్ చేయడం తో రోజు అంతా గడిపేసేది..


జ్యోతి, శేఖర్ గార్లకు వాళ్ళ ఆఫీస్ వర్కులో పడిపోయి ఇవి అన్ని పట్టించుకునే సమయం ఉండేది కాదు. ఆద్య కూడా వాళ్ళు ఉన్నపుడు అసలు ఫోన్ యూస్ చేయకుండా ఎదో అవసరానికి మాత్రమే ఫోన్ వాడుతున్నట్టు వాళ్ళ ముందు నటించేది.


ఇంతే కాకుండా ఎవరైనా అబ్బాయిలు తనతో మంచి గా మాట్లాడి తనని పొగిడితే వాళ్ళకి తన ఫోన్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళతో మాములు ఫోన్ కాల్ కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడేది. కానీ ఇలా అబ్బాయిలతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పలేదు. దానికి గల కారణం ఎక్కడ తన ఫ్రెండ్స్ తన ఫాలోయింగ్ ని చూసి కుళ్ళుకుంటారో అని ఆద్య అనుకోవడమే.


ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు ఎప్పట్లానే ఆద్య కి తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తుంది. ఆద్య కూడా తనకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు కదా.. వాళ్లలో ఎవరైనా అయ్యి ఉంటారులే అని ఆన్సర్ చేస్తుంది.. ఆద్య ఆన్సర్ చేసిన కొన్ని సెకండ్స్ కి ఆ కాల్ కట్ అయ్యి పోతుంది..


ఎవరో అనుకుని మళ్ళీ ఆద్య వాళ్ళకి వీడియో కాల్ చేస్తుంది. కానీ అవతల వాళ్ళు ఎవరు కూడా లిఫ్ట్ చేయరు. ఈ ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజులకి ఆద్య ఫోన్ కి ఆద్య న్యూడ్ ఫొటోస్ వస్తాయి. ఆ న్యూడ్ ఫొటోస్ తో పాటు ఒక నెంబర్ పెట్టి ఆ నెంబర్ కు వాళ్ళకి 5 లక్షలు పంపాలి అని లేదా ఆద్య న్యూడ్ ఫొటోస్ తన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళ అందరికి పంపుతాం అని ఆ మెసేజ్ సారాంశం.


ఆద్య తన న్యూడ్ ఫొటోస్, ఇంకా ఆ మెసేజెస్ చదివి భయంతో వణికిపోయింది. అసలు తన న్యూడ్ పిక్స్ వాళ్ళ దగ్గరకి ఎలా వెళ్ళాయో అర్ధం కాలేదు ఆద్యకి.


ఒక్క సారిగా మైండ్ పనిచేయడం ఆగిపోయింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు ఆమెకి. తండ్రికి చెప్పుకోలేదు. తల్లి కి చెప్పాలి అంటే తల్లి చంపేస్తుందేమో అని భయం.


ఆ భయం తో ఏం చేయాలో అర్ధం అవ్వక కిచెన్ లోకి వెళ్లి చాకు తో చెయ్యి కోసేస్కుని సూసైడ్ అట్టెంప్ట్ చేసింది.

ఆఫీస్ నుండి వచ్చి చేతి నుండి రక్తం కారుతూ మంచం మీద అచేతనం గా పడి ఉన్న ఆద్య ని చూసిన జ్యోతి గారు హడలిపోయారు.. జరిగింది చూసింది అర్ధం చేసుకోవడానికి జ్యోతి గారికి రెండు నిముషాలు పట్టింది. తరువాత వెంటనే తేరుకున్న జ్యోతి గారు శేఖర్ గారికి విషయం చెప్పి ఆద్య ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు.


కాసేపటికి శేఖర్ గారు హాస్పిటల్ కి చేరుకున్నారు.. ఎంత ఆలోచించినా ఇద్దరికీ ఆద్య సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అనేది అర్ధం కాలేదు.


ఈ లోపు డాక్టర్ గారు వచ్చి బ్లడ్ ఎక్కువ గా పోయింది అని, కాసేపటికి సృహ లోకి వస్తుంది అని చెప్పి ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు.


సృహ వచ్చిన ఆద్య ఎదురుగా ఉన్న తల్లితండ్రుల్ని చూసి భయపడి పోతుంది. కూతురి భయాన్ని అర్ధం చేసుకున్న జ్యోతి గారు “ఏం జరిగిందో చెప్పు తల్లి.. నిన్ను నేను, నాన్న ఒక్క మాట కూడా అనం. ఏం జరిగిందో తెలుసుకుని నీకు సపోర్ట్ ఇస్తాం” అని లాలన గా అడుగుతారు.


అప్పుడు ఆద్య ఏడుస్తూ “నేను ఏ తప్పూ చేయలేదమ్మా” అని జరిగిన విషయం మొత్తం చెపుతుంది.


విషయం విన్న జ్యోతి గారు “ఏం కాదు. నువేం భయపడకు తల్లి.. నేను నాన్న చూసుకుంటాం” అని నుదిటి మీద ప్రేమ గా ముద్దు పెట్టి “రెస్ట్ తీసుకో” అని చెప్పి బయటకి వచ్చేస్తారు.


సూసైడ్ కేసు కాబట్టి ఎం జరిగిందో తెలుసుకుని FIR రాసుకుందాం అని బయట ఉన్న పోలీస్ కి జరిగిన విషయం చెపుతారు జ్యోతి, శేఖర్ గారు.


విషయం మొత్తం విన్న ఇన్స్పెక్టర్ గారు “ఇప్పుడు మీ అమ్మాయి కి జరిగిన ఇన్సిడెంట్ ని హనీ ట్రాప్ అంటారు.. ఇప్పుడు ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ గా జరుగుతున్నాయి. కొంత మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళు ఆన్సర్ చేయగానే వాళ్ళని ఫొటోస్ తీసి అవి న్యూడ్ ఫొటోస్ ఇంకా వీడియోస్ గా మార్చి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలానే కాకుండా ఫేక్ అకౌంట్స్ తో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ నుండి డబ్బు దోచేయడం లాంటివి జరుగుతున్నాయి.


భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ పాప కి ఏం కాదు. మేము చుసుకుంటాం. ఇదే కాకుండా మీరు కూడా cybercrime. gov. in లో కంప్లైంట్ చేయండి” అని చెప్పి వెళ్ళిపోతారు.


జరిగిన విషయం అంతా ఆద్యకి చెప్పి దైర్యం గా ఉండమని చెపుతారు.


ఆద్య జ్యోతి గారి పట్ల తాను ప్రవర్తించిన తీరుకి సారీ చెప్పి ఫోన్ జ్యోతిగారికి ఇచ్చేసి ఇంటర్ కంప్లీట్ అయ్యాక తీసుకుంటాను అని, ఈ లోపు అవసరం ఐతే వాళ్ళ ఫోన్ తీసుకుంటాను అని చెపుతుంది.


ఆద్యలో వచ్చిన మార్పుకు ఎంతగానో సంతోషిస్తారు ఆద్య తల్లితండ్రులు.


***

శిరీష సాధనాల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు శిరీష.

నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను.

నాకు స్టోరీస్ చదవడం రాయడం అంటే చాల ఇష్టం.

నా ప్రతి కధ ఒక చక్కటి అర్థాన్ని ఇచ్చేలా చూసుకుంటాను.

నాకు సాడ్ ఎండింగ్స్ అంటే అసలు నచ్చవు.

అందుకే నా ప్రతి కథ ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చేలా రాస్తాను..


110 views0 comments

Comentários


bottom of page