#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #హాస్పిటల్అంటేనేభయం, #HospitalAnteneBhayam, #TeluguSpecialArticle, #AnnapurnaArticles, #సామాజికసమస్యలు
Hospital Antene Bhayam - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 07/01/2025
హాస్పిటల్ అంటేనే భయం - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
కోవిడ్ వచ్చినప్పటినుంచి హాస్పిటల్ అంటేనే భయం పట్టుకుంది. అవేర్నెస్ ప్రివెంటి కేర్ హెల్త్ చెకప్ కోసం ముందు జాగ్రత్తగా 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గిరకు వెళ్లేవారు సైతం మానుకుంటున్నారు. ఎందుకో అంటే చాలామందికి అనుభవం అయ్యివుండవచ్చు. డాక్టర్లు తెలిసినవారు ఐతే అనారోగ్యం లక్షణాలు ఫోనులో మనం చెప్పినపుడు అవసరం ఐతేనే హాస్పిటల్కి రమ్మని సలహా ఇస్తారు.. లేదంటే మనం చిక్కుకుని విల విల లాడుతాము.
ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే 'కోవిద్ వల్లనే.. !. అని చెప్పేసి సుదీర్ఘమైన ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ పూర్తిగా దోచుకుంటున్నారు. పేరుకే అప్పోయింట్మెంట్. ఉదయం వెడితే రాత్రికే ఇంటికి రావడం. ఇక సీనియర్ సిటిజన్స్ డయాబెటిక్ పేషేంట్స్ అయితే కాఫీలు టీలు ఏదోఒక ఫుడ్ తినాల్సిరావడం..
లంచ్ అక్కడే. అంటే హాస్పిటల్కి ఆదాయం అనుకోవాలా.. పేషేంట్కి సదుపాయం అనుకోవాలో ఎవరి ఇష్టం వాళ్ళది.
ఈ మధ్య మా బంధువులు నలుగురు వేరు వేరు సమస్యలతో హాస్పిటల్కి వెడితే ట్రీట్మెంట్ మాత్రం ఒకటే చేయడం చూసి తెలిసివచ్చింది. మొదట టెస్టులు మొదలుపెడతారు. ఆ రిపోర్ట్స్ ఒక నవల అంత.. మూడువందల పేజీలు ఉంటాయి. అవి చదువులో ఎన్ని డిగ్రీలు ఉన్నవారికీ అర్ధం కావు. ఎదో చెబుతారు.
ICCU లో కి తీసుకుపోతారు. అంతే! అక్కడ ట్రీట్మెంట్ ఏమి జరుగుతుందో ఎవ్వడికి తెలియదు. అడిగినా చెప్పరు. గట్టిగా అడిగితే డాక్టర్ మీద నమ్మకంలేదు మీకు.. అంటారు. లేదా ఆ పేషేంట్ మీద ఇంట్రస్ట్ లేదా? అని మీ సెంటిమెంటు మీద దెబ్బకొడతారు.
నెలరోజులు గడిచిపోతుంది. 'ఇదేమిటి? ఇంప్రూవ్మెంట్ కనిపించడంలేదు? మేము ఇంటికి తీసుకువెడతాము' అని ఫోర్స్ చేస్తే మరో వారం అదిగో ఇదిగో అని గడిపేసి మొత్తం మీద డిశ్చార్జ్ చేశారు. ఇంటి దగ్గిర పేషేంట్కి తీసుకోవలసిన జాగ్రత్తలతో భాగంగా ఒక లిస్ట్ ఇచ్చారు.
అవి ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్, ఈసీజీ మానిటర్, (ఇది లీటర్ నుంచి కెపాసిటీ ఉంటుంది. ) ఫుడ్ ఫీడింగ్ ట్యూబ్, గాస్ట్రోస్టమై ఫీడింగ్ ట్యూబ్ (దీన్ని వారానికి ఒకసారి మార్చాలి. ), యూరినరీ బాగ్, స్టూల్ బాగ్, రోజూ ఇంజెక్టన్స్ (బలానికిట), బెడ్ షొరెస్ రాకుండా బెడ్ హీటింగ్ మెషిన్, ఫిజియో థెరపిస్ట్, మేల్ నర్సు (ఇరవై నాలుగు గంటలు కేర్ ), వాడికోరూము.. ఇవన్నిటికి పవర్ సప్లై ఉండటానికే జనరేటర్, వారానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ మరో పది టెస్టులు చేసే ల్యాబ్ ఎక్సపర్ట్, డైటీషియన్.. ఇన్ని చెప్పేరు.
వీటి ఖరీదు 5 లక్షలు. డబ్బు వున్నవారు అమర్చుకున్నారు. లేనివాళ్లు ఎలాగా బతకాదు. వున్నంతకాలం హాపీగా ఫ్రీగా ఉండనీ.. అని ఊరుకున్నారు.
మర్చిపోయాను.. ఇవన్నీ వద్దు అనుకుంటే రిహాబ్ సెంటర్ కి రోగిని షిఫ్ట్ చేయచ్చు. ఖర్చు రూము ఫెసిలిటీస్ ను బట్టి ఉంటుంది. ఇదీ సంగతి.
ఇవన్నీ అమెరికాలోకుడా వున్నాయి. మాకువద్దు. ఆయువు వున్నంతకాలం ఉంటాము పొతే పోతాము. ఎలాగా తప్పదు.. అని తిరస్కరించే హక్కు ఉంటుంది. కనుక ఎవరికి వారు ముందుగానే రాసి ఇవ్వచ్చు.
కానీ మన పవిత్ర భారతదేశంలో ప్రజలు సెంటి మెంట్లకి, మూఢనమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడం రోగికి నరకం అవుతోంది. జీవచ్ఛవంలా బెడ్మీద ఉండేలా చేయడం సరికాదు అని నా అభిప్రాయం.
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments