ఇదేం విధానం!
- Kasivarapu Venkatasubbaiah

- 2 hours ago
- 2 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #IdemVidhanam, #ఇదేంవిధానం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Idem Vidhanam - New Telugu Poem Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 08/12/2025
ఇదేం విధానం! - తెలుగు కవిత
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
ఇందరిలో నిన్నే ప్రాధాన్యకరించి
మన ఊరిలో పెద్దమనిషిని చేశాను.
అదే పంచాయతీకి జనాధ్యక్షునిగా
నికరంగా నిన్నే నిలబెట్టాను.
సదరు మండలానికి మండలాదీశునిగా
ఆదరంగా నిన్నే ఎన్నుకున్నాను.
జిల్లా నాయకత్వానికి ప్రతిపాదించి ఖుషీ అయ్యాను.
ఎమ్మెల్యేగా ఎంపిగా నా భుజస్కంధాలపై నుంచి
నిన్ను ఎగదోసి మైమరచిపోయాను.
రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రతిష్టించి
సంబరంలో పడి మునిగితేలాను.
నిన్ను గవర్నరుగా చివరికి దేశ ప్రధమ పౌరుడు
రాష్ట్రపతిగా అధిష్టింపజేసి
ఆనందంలో పిల్లిమొగ్గలేశాను.
నీ చంద్రకేతనాన్ని భక్తిప్రపత్తులతో
నా భుజాలపై మోశాను.
నీ సమాధులు చుట్టూ నిష్టానురక్తులతో
ప్రదక్షిణలు చేశాను.
నీవు సృష్టాధిష్టాన దేవతకు నివేదించిన
నైవేద్యాన్ని ప్రసాదంగా అందుకొని
కండ్లకద్దుకొని ఆరగించాను.
నీవు నిర్వహించే ఉత్సవాలలో
అత్యుత్సాహంతో హల్ చల్ చేశాను.
నీవు నిర్మించే పవిత్ర నిర్మాణాలకు
ప్రధమ ప్రాధాన్యతనిచ్చి భూరీ విరాళాలు ఇచ్చి ప్రోత్సాహించాను.
నీవు పేర్చిన నిప్పుల గుండంలో విశ్వాసపాత్రుడనై శ్రద్ధాభక్తులతో నిర్భీతిగా నడిచాను.
నీవు నిర్వర్తించే క్రతువులకు నేనూ నా పరివారం హాజరై నిండుదనం తెచ్చాను.
నీవు ఆపదలో ఉన్నపళంగా పడ్డప్పుడు
నీ రక్షణకు నా గుండెను ఎదురొడ్డి నిలిచాను.
నీవు గరిమనాభి తప్పి చరించినప్పుడు
నీ వైపే వకాల్తా పుచ్చుకుని వాదించాను.
నీ నాలుక విచక్షణను విసర్జించి
అవాకులు చవాకులు చప్పరించి నప్పుడు కూడా
నీ ప్రక్కనే వెన్నుదన్నుగా నిలబడ్డాను.
నిన్నేప్పుడైనా నా దారిలోకి రమ్మని
కేవలం మాటమాత్రంగానైనా పిలిచానా?
నా తత్వాన్ని ఒంటపట్టించుకోమని
బలవంతంగానైనా ప్రలోభంగానైనా ప్రయత్నించానా?
మార్పిల్ల విధానం మొదలంటూ వెదికినా
నాలో అగుపించదు కదా!
మరీ నీకోసం యింత చేసిన నాకోసం
నీవు ఏమి చేశావు.?
నన్ను నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా ఏకపక్షంగా
వైరిపక్షంవాడిగా ప్రకటించావు.
---------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను




Comments