top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - ముందుమాట


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai ' - New Telugu Web Series Introduction Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై' తెలుగు ధారావాహిక - ముందుమాట

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ముచ్చటగా ఒక ముందుమాట—

(ఇక జీవితం ఉద్వేగ పూరితమై--ఉత్తుంగ తరంగమై--- నవలకోసం)


మూడ్రోజుల క్రితం ఒక విదేశీ రచయిత్రి యిలా అన్నట్టు గుర్తు-

‘ఏది వ్రాసినా యెలా వ్రాసినా అందులో నేనుంటాను!’


పైకి యిది సరదాగా సందడిగా అగుపించినా లోలోన లైట్ గా తీసుకోకూడని విషయం మాత్రం కాదు. ఆ కోవన చూస్తే, మరొక అడుగు ముందుకు వేసి చూస్తే— పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నమాటలు జ్ఞప్తికి రాక తప్పదు, ”జీవితం అనవరతం పరిసరాలతో పరిస్థితులతో సర్దుబాటు చేసుకుంటూపోయే ఒక జీవన ప్రక్రియ“(LIFE IS A CONTINOUS PROCESS OF MAKING ADJUSTMENT WITH ONE’S SURROUNDINGS AND CIRCUMSTANCES).


ఇక్కడ మనిషికి యెదురయే మూలాధారమైన పాయింటాఫ్ ఫోకస్ గురించి తర్కించాలి. సర్దుబాటనేది లేకుండా దానికి తావులేకుండా మనిషి మనుగడ సాగించలేడా! ఎటువంటి సర్దుబాటుకీ తావివ్వకుండా తన యిష్ట ప్రకారం విహంగంలా సర్వ స్వతంత్రుడై బ్రతుకు బాటను మలచుకోలేడా! వీటికి సజావుగా జవాబివ్వాలంటే మనం మన అట్టడుగు అనుభవాల పొదరిండ్లను వెతకవలసిందే-- ఎందుకంటే— ఏ మనిషీ దేశానికీ ప్రాంతానికీ అతీతంగా ఆలోచించి చూస్తే అదాటున లక్ష్మణ రేఖను దాటాలని పూనుకోడు. కంటికానని చీకటి సొరంగంలో చిక్కుకుపోవాలని కోరుకోడు. ఇదే కదా సరైన లా ఆఫ్ లాజిక్ ఔతుంది!


కాని—చాలా మంది విషయాలలో అలా సజావుగా సాగదు. కారణం- మనం ఉంటూన్న భూమండలం ఒక విశాలమైన అయస్కాంత కేంద్రం, ఇందులో ఉంటూ దేనికీ ప్రభావితులు కాకుండా ఉండాలనుకోవడం అసంబధ్ధం. - అసంభవం. సాధారణంగా మనుషులకు, ముఖ్యంగా భారతీయులకు స్ఫూర్తి దాయకులు సిధ్ధులు సాధువులు, మునులు యోగులు యోగ పురుషులు. ఈ కోవకు చెందిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడి పరిస్థితి యేమయంది? ఎక్కణ్ణించో వచ్చిన ఒక దేవనర్తకి తన ముఖ భింగిమలతో వివిధ నాట్య విన్యాసాలతో బ్రహ్మర్షిని వశ పర్చుకుని తపోభంగానికి పాల్పడగలిగింది. ఇలా జరగడానికి మనకు స్పష్టంగా కానవచ్చే న్యాయ సూత్రం ఒక్కటి- ఏమిటది?


జీవితం మనదే కావచ్చు గాక—కాని అది మన అదుపులో ఉండకపోవచ్చు. మన ఆదేశాలను స్వీకరించకపోవచ్చు. మనం చూస్తూండగానే మన యెట్టెదుటే జారిపోవచ్చు. జారి కరిగిపోవచ్చు. అప్పుడు మనం జారిపోతూన్న జీవితాన్ని అందుకోవాలని ఆరాటంతో చేతులు చాచి పరుగు తీయవచ్చు. కాని—అప్పటికే జీవితం గాలిలో రెక్కలు విదిల్చే పక్షిలా యెక్కడికో అందుకోలేనంత దూరానికి యెగిరి పోవచ్చు. అందుకే విజ్ఞులు ధర్మజ్ఞులు పదే పదే చెప్తుంటారు- పరిస్థితులతో పరిసరాలతో సర్దుకు పొమ్మని. వంగినట్లే వంగి గాలి హోరు తగ్గిన తరవాత నిటారుగా తలెత్తుకున్న గడ్డి పరకలా బ్రతకడం నేర్చుకొమ్మని. ముంచుకు తన్నుకు వచ్చే జీవన ప్రవాహానికి యెదురీదమని.


ఇక పైన ముందుకు సాగాలంటే కీకారణ్యం వంటి ఈ ప్రపంచం గురించి నిష్కర్షగా ఆలోచించాలి. ఈ ప్రపంచం అప్పుడూ యిప్పుడూ అన్న ప్రసక్తికి చోటులేకుండా సమతుల్యతతో ప్రస్తావించాలంటే- అది కర్కశమైనది. నిరాసక్తమైనది. దానికెప్పుడూ యెదుటి వారి కళ్ళలో ఒలికే కన్నీరు కనిపించదు. చూసీ చూడనట్లు ముఖం తిప్పేసుకుని పెడ ముఖంతో అభావంతో దాటి వెళ్ళిపోవడమే దానికి తెలుసు.


ఓదార్పు చూపించే మాట అటుంచి, కన్నీరు చూసి కారణం అడిగే తీరిక దానికెక్కడది?పరుగు తీయడంలో పరుగు పెట్టించడంలోనే మనిషికి కిక్కుంటుంది. అహంకారపు మత్తు ఉంటుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ యిలా అంటాడు—“నాకు దు:ఖం కలిగినప్పుడు నేను వర్షంలో తడుస్తాను. తడుస్తూనే నడుస్తాను. కన్నీరు కారుస్తూనే సాగిపోతుంటాను. అప్పుడే కదా నేను విడిచే కన్నీరు బయటి ప్రపంచానికి కనిపించదు!“

హృదయం ఉన్నవాళ్ళను ఆ ఒక్కమాటా కలచివేస్తుంది కదూ!ఇక విషయానికి వస్తే—కన్నీటి విలువ అందరికీ తేలవదు. మానవత్వం గల మానవాత్మలకే తెలుసు కన్నీటి విలువ. అందుకే యిప్పుడు ప్రఖ్యాత తెలుగు కవి కాళోజీ గారిని ఓసారి గుర్తు చేసుకుందాం. కన్నీరు గురించి ఆయన యిలా రాస్తాడు—


“ అశ్రువులు నన్నెపుడు ఆదుకొని వుండాలె.

అశ్రువులు లేనట్టి అసువులేలా నాకు “


ఆ రీతిన ముందుకు సాగితే నేను వ్రాసిన ఈ నవలలో పెక్కుమంది మనసున్నవారు మెరుస్తూ జ్వలిస్తూ కనిపిస్తారు. ఒకరి కష్టాన్ని చూసి మరొకరు చలిస్తారు. కన్నీరు తుడుస్తారు. అటువంటి ఆర్ద్రత గలవారు మనచుట్టూ ఉంటే, కనీసం మనకెప్పుడైన యెదురయితే యెంత బాగున్ననిపిస్తూంది. అయితే—నేనిక్కడ ఒక ఉదాత్తమై జీవనాంశాన్ని చెప్పడానికి ప్రయత్నంచాను. సామాజిక సహజీవనానికి మూల స్తంభం వంటిదిది. కాదనలేని వాస్తమిది-

ఇంతకీ యేమిటది? ఒకరినుండి ఒక ప్రశస్థమైనదేదైనా మనం అందుకుంటే వాళ్ళకు మన తరపున మరొక ప్రశస్థమైనది ప్రత్యమ్నాయంగా యివ్వాల్సి ఉంటుంది; మన యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే-- అందుకే సాధ్యమైనంత మేర మనం ఒకరి నుండి యేదీ ఆశించకుండా ఉండటమే మేలు. ఉభయతారకం.


ఇక నవల కథాగమనం వేపు చూపు తిప్పుదాం. రామభద్రం కుటుంబం ఆదినుంచీ వంట వృత్తిని నమ్ముకుని మనుగడ సాగిస్తూన్న కుటుంబం. తండ్రి రాఘనయ్య అతడికి నేర్పిన విద్యకూడా అదే—అతడికి పిల్లనిచ్చిన మాఁవగారు కూడా వంట వృత్తిలోనుండి వచ్చిన వారే—ఈ కుటుంబ నేపథ్యం వలన అతడు యెంత ఆశించినా ఎనిమిదవ తరగతికి మించి చదవలేకు పోతాడు. అప్పుడొకసారి ఆర్థిక మాంద్యం వల్ల యేర్పడ్డ గడ్డు పరిస్థితి వలన చాలామందిలాఅతడు పనిచేస్తూన్న హోటెల్ యజమాని వ్యాపారం మూసివేసి దుబాయ్ వెళ్ళిపోతాడు.


అప్పుడు అతడి కుటుంబమంతా అగ్గగ్గలాడిపోతారు. అతడికి భార్య యిద్దరు కొడుకులు ప్లస్ వయసు మళ్ళిన తల్లిదండ్రులు. ఎన్ని దిక్కులు చూసినా అతడికి స్థిరమైన కొలువు దొరకదు. ఒకటి రెండు కర్రీ పాయింట్ల వద్ద తాత్కాలికంగా చిన్నపాటి ఉద్యోగాలుమ దొరికినా అవి స్థిరంగా ఉండవు, అటువంటి గడ్డు పరిస్థితిలో వేరే దారి లేక తన చిరకాల మిత్రుడు గంగాధరం సూచన మేర ఢిల్లీలోని ఒక మెస్సులో చేరడానికి సిధ్ధమవుతాడు.

అటువంటి క్లిష్టమైన జీవన పరిస్థితిలో రామభద్రం ఒక గట్టి నిర్ణయానికి వస్తాడు- ఎట్టి పరిస్థితిలోనూ తన యిద్దరు కొడుకులూ తనలా అరకొర చదవులతో పొగచూరిన వంట గదుల్లోకి ప్రవైశించకూడదని.


ఢిల్లీమెస్సు ఓనర్ ఒక స్త్రీ. డైనమిజమ్ గల పర్సనాలిటీ. మంగుళూరుకి చెందిన ఆ తెలుగు స్త్రీ భర్త రటైర్మెంటు తీసుకున్న మిలిటరీ ఆఫీసర్. పేరు రూపవతి. ఆమెతో యేర్పడ్డ సాన్నిహిత్యం రామభద్రానికీ అతడి కుటుంబానికీ పెను మార్పులు తెస్తుంది.


AN OFFEER THAT CAN NOT BE REFUSED అన్న చందాన సాగుతూంది రూపవతీ రామభద్రానికీ మధ్య స్నేహ బంధం. సర్వమూ ఉద్వేగ భరితం. ఉత్తుంగ తరంగం—అణువణువునా ఉత్కంఠ రేపేంత ఆసక్తి కరం.


క్రింది నవలలోని పాత్రల గురించి క్లుప్తంగా—

1)అ- రామభద్రం- వంట వృత్రిలో ఉన్న సామాన్యుడు

ఆ- భార్య- కమల కాంతం

ఇ- తండ్రి- రాఘవయ్య

ఈ- తల్లి తాయారమ్మ

ఉ- పెద్ద కొడుకు- వాసుదేవరావు

ఊ- చిన్నకొడుకు- వెంకట్.

ఎ- చెల్లి- లలిత

ఏ- ఆమె భర్త- వాసు(రామభద్రం బావ)

ఐ- కొడుకు ప్రసన్నకుమార్

ఒ- కూతరు- భార్గవి

2- రూపవతి- డిల్లీ మెస్సు ఓనర్-

3- మంజులా దేవి- మరదలు పిల్ల.

4- మాలిని- రూపవతికి బందుత్వం గల సహాయకురాలు

5- గంగాధరం- రామభద్రం మిత్రుడు

6- సోమనాథం- మెస్సులోని హెడ్ కుక్.

7- కామయ్య—కమల కాంతం తండ్రి- రామభద్రం మామగారు.

పాండ్రంకి సుబ్రమణి


=======================================================================

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

57 views0 comments

コメント


bottom of page