top of page

ఇల్లరికము


'Illarikamu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'ఇల్లరికము' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి

నాగేంద్ర సింహ- తామసి ల కుమారులు నలుగురు వరుసగా జయసింహ, రాజసింహ, విజయసింహ, నరసింహ.


నాగేంద్ర సింహకు ఆదాయము అంతంత మాత్రమే. కాకపోతె పూర్వీకులనుండి సంక్రమించిన ఇల్లు, పది ఎకరాల పొలమే ఆతని ఆస్తి పాస్తులు. ముగ్గురు కొడుకుల పెళ్ళిళ్ళు చేసినా నాల్గవ వాడైన నరసింహ బాగుపడుతాడని ఇల్లరికము ఈయ తలుస్తాడు. దూరపు బంధువు రామేశ్వర శర్మ అవనిజ లకు కూతుర్లు నలుగురు. ఇంకా ఎవరికీ పెళ్ళి కాలేదు. మంచి ఆస్తిపరుడు. మగపిల్లలు లేక పెద్దకూతురు నర్మద పెళ్ళి చేసేటప్పుడే ఇల్లరికము కొరకు వెదుకుతుంటాడు.

అది తెలిసిన నాగేంద్ర సింహ తన చిన్న కొడుకు నరసింహను ఇల్లరికము ఈయ దలిచి రామేశ్వర శర్మ కు తెలియపరుస్తాడు.


ఆయనా సంతసించి నరసింహను ఇల్లరికానికి ఒప్పుకొని నరసింహకు నర్మదకు ఘనంగా వివాహము జరిపి అల్లుణ్ణి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. ఇప్పుడు ఇక ముగ్గురు మరదండ్లు యమున, సరస్వతి, మందాకిని ల వివాహ బాధ్యత నరసింహ మీద పడుతుంది. మొదటి బుక్కలోనే కంకెడు రాయి వచ్చినట్టు నరసింహ పరిస్థితి ఏర్పడుతది.

శ్వశురు గృహం స్వర్గతుల్యం. మరుదినమేకం పాదరక్ష ప్రయోగం. అను సామెత తెలిసినా నరసింహ ఇల్లరికపు అల్లుడు కావడము చేత మరియాద అంతంత మాత్రమే ఉన్నా పాదరక్ష ప్రయోగ స్థితికి వచ్చే అవకాశము లేదు.

నరసింహ చదువుకున్నవాడు. బుద్ధి మంతుడు పైగా తెలివిగలవాడు.


అతని మాటలు, నడవడి చాతుర్యము తో తనకు అత్తవారింట మర్యాద భంగము కాకుండా చూసుకొని వ్యవహరిస్తుంటాడు. ఏ మాత్రము మరియాద లోపము జరిగినట్టు భావించినా భరించే మనస్తత్వము కాదు. అది గమనించె మామ రామేశ్వర శర్మ అత్త అవనిజ లు ఇంకా ముగ్గురు కూతుర్ల పెళ్ళిళ్ళ భారము ఉన్నది కనుక అల్లుని మనసు నొప్పించకుండా మసలుకుంటారు.


నరసింహ అత్తవారి సొమ్ముకు భవిష్యత్ లోవారసుడు ఐనా ఉన్న ఆస్తిలో నాల్గవ భాగమే అయితుంది అని గమనించి అత్తవారి సొమ్ముకు ఆశించకుండా తన తెలివితో వేరే చోట భూములు కొంటూ ఉంటాడు. ఒక పైసకు కూడ వారి మీద ఆధార పడకుండ. పేరుకు ఇల్లరికపు అల్లుడైనా సంస్కృత కవి కిరాతార్జునీయ రచయిత భారవి పరిస్థితి రానీయకుండ నిత్యనూతన అల్లునిగానే సపర్యలందుకుంటుంటాడు.


అత్తవారింటిలో అల్లునిదే పెత్తనము సాగగా ముగ్గురు మరదళ్ళ పెళ్ళిళ్ళు నరసింహనే పూనుకొని జరిపించుతాడు. సడ్డకులు కూడా నరసింహ అంటె గౌరవంగా చూస్తారు.

పెళ్ళిళ్ళకొచ్చిన బంధువులంత వీరింటి వ్యవహారము చూసి ముక్కుమీద వేలేసుకుంటారు. ఇల్లరికమల్లుడేమిటి ఇంత అజమాయిషి ఏమిటి అనుకుంటు.


వెనుకటికి అల్లుడు కడు స్వతంత్రుడు. ఇల్లలుకను, ముగ్గులేయ, ఇస్తళ్ళెత్తన్ అను సామెత వాడెడు వారు.

నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగు వాడె ధన్యుడు సుమతీ అని సుమతి శతకకారుడు బద్దెన చెప్పినట్లు అత్త మామల- మరదళ్ళ, సడ్డకుల తుదకు భార్య నర్మదను కూడా మనసుకు ఏమాత్రము ఆత్మ న్యూనతా భావము, బాధ కలుగకుండా ఇంటి పెద్దలా మెలుగ సాగాడు నరసింహ.


ఆలి పుట్టినింట దానున్కి ఇష్టము లేక వేరే చోట ఇల్లు గూడా కొనుక్కుంటాడు నరసింహ. ఇల్లరికము అంటె ఒక రకంగా ఆత్మను చంపుకోవడమే అని భావిస్తాడు నరసింహ. అదీ వేరొకరిరి సొమ్ముకు ఆశించినట్టయితదని అతని భావన. తన తల్లిదండ్రుల ఇంట్లో తోబుట్టువులు పూర్వీకుల ఆస్తి అనుభవించుచూ దర్జాగా బ్రతకడమేమిటి తాను కేవలము ఆస్తి కొరకు ఇల్లరికము ఒప్పుకోవడ మేమిటి అని ఆలోచించ సాగాడు. దీనికి తోడు సడ్డకుల మనసులో కూడా నరసింహ ఒక్కనిదే పెత్తన మేమిటి అను భావన పొడసూపడము నరసింహకు మనస్కరించదు.


ఏదో పిన్న వయసులో తెలియక ఇల్లరికము వచ్చినందుకు తనను తనే నిందించుకుంటాడు. ఎట్లాగు వచ్చినందుకు బాధ్యత వహించి మరదళ్ళ పెళ్ళిళ్ళు చేసిన సంతృప్తి మిగిలింది చాలు అనుకుంటాడు నరసింహ. ఇదంతా మనసులో నాటుకోవడానికి అత్తవారింటికొచ్చిన కొత్త చుట్టాలు చాటుమాటుకు నుడివిన మాటలే. బహిర్గతంగా వాళ్ళను నిలదీస్తె ఒకటి తను ఏలాగు ఇల్లరికపు అల్లుడే. రెండవది అత్తమామలు నొచ్చుకుంటారు. మూడవది నర్మద బాధ పడుతుంది అనుకొని కొన్ని రోజులు ఏమీ మాట్లాడక ఊరుకుంటాడు.


ఇల్లరికము అనే ముద్ర తొలగించుకొనడానికి తాను కొనుక్కున్న ఇంటికి మారుతూ అత్త మామలను కూడా వచ్చి తమతో ఉండమంటాడు నరసింహ.


వయసు మళ్ళుతున్న తమకు తోడు ఎవరు లేక శేష జీవితము గడుపుటలో ఇబ్బంది ఏర్పుడుతుంది అని గ్రహించి అత్తమామలు అల్లుని మాటకు ఎదురు చెప్పక వారి యెంటనే పయన మైతారు. ఉన్న ఆస్తి నాలుగు భాగాలు చేసి పంచుతానంటె తమకు మాత్రము ఏమీ వద్దని సున్నితంగా తిరస్కరిస్తారు నరసింహ నర్మద.


కొత్త ఇంట్లో గృహప్రవేశానికి తలిదండ్రిని అన్నల వదినల తక్కిన బంధువుల మరదండ్ల సడ్డకుల ఆహ్వానిస్తాడు నరసింహ. ఒచ్చిన బంధువులందరికి మరియాదగా కట్న కానుక లిచ్చి సత్కరిస్తాడు నరసింహ.


నర్మదకు కూడా తలిదండ్రుల ఇల్లు అనకుండా తన స్వంత ఇల్లనే తృప్తి కలుగుతుంది.


ఆస్తి పంపకము తోడు తమ వాటా తిరస్కరించడముతో నరసింహ మరదళ్ళు సడ్డకులు లోలో ఎంతో సంతోషముతో ఉంటారు

మొత్తము మీద లోకుల దృష్టిలో నరసింహ ఇల్లరికపు అల్లుడనే భావన తొలిగి పోతుంది.


సమాప్తం.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



コメント


bottom of page