ఇంటి పని ఆరోగ్యం
- A . Annapurna
- Dec 23, 2024
- 3 min read
Updated: Jan 14
#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #ఇంటిపనిఆరోగ్యం, #IntiPaniArogyam, #TeluguSpecialArticle, #AnnapurnaArticles, #సామాజికసమస్యలు

Inti Pani Arogyam - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 23/12/2024
ఇంటి పని ఆరోగ్యం - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
అమెరికా నుంచి నాలుగేళ్ల తర్వాత ఇండియా వచ్చిన నేను కాస్తంత బడలిక తీరిన తర్వాత బంధువులను కలవాలని ఒక నోట్ తయారు చేసి పెట్టుకున్నాను. వాళ్లకి ముందుగా ఫోను చేసి వారానికి ఒకరిని కలిసాను. ఒకోక్కరిని చూసినపుడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి వీళ్లు ఇలా వున్నారు? అనుకున్నాను.
వీరిలో ఇద్దరు జాబ్ చేస్తారు. మిగిలినవాళ్లు ఇంట్లో ఉండేవారు. ఒక్కరూ ఇంటిపని చేసుకోరు. బయటనుంచి ఫుడ్డు తెప్పించుకుంటారు. ఒకరి ఇంట్లో ముగ్గురు పనివాళ్ళు. ఒకరు ఇంటిపని చేసి కూరలు తరిగి పెట్టి వెడితే ఇల్లాలు కుక్కర్ పెట్టి పోపులు వేస్తుందిట. సాయంత్రం చపాతీ చేయడానికి మరో మనిషి వస్తుంది. వారానికి ఒకరోజు బాత్రూములు కడిగే మనిషి వస్తుందిట (అర్బన్ కంపెనీ వారట). మరో కుటుంబం ఉద్యోగాలకు వెళ్లేవారు కనుక మొత్తం వంట ఇంటిపని చేసి వెడుతుంది పనిమనిషి.
ఇంకోరు అన్ని ఆన్లైన్ రెస్టారెంట్ ఫుడ్ తెప్పించు కుంటారుట. కర్మ కాలి మెయిడ్ రాకపోతే మొగుడి పని అయిపోతుంది. ఇంట్లో వుండే గృహిణి ఏమి చేస్తుంది? సినిమాలు షాపింగ్ టీవీ సీరియళ్లు చూడటం. ఇంకా వయసు మళ్ళిన ఒక భార్యా భర్తలే నయంగా కనిపించారు. ఇద్దరమే ఎంతకావాలి. . . ఒక్క బెడ్ రూమ్ ఇంట్లో తక్కువ సామానుతో చేయగలిగిన పనులు చేసుకుంటున్నారు. నాలుగు మొక్కలు కుండీలో వేసుకుని వాటిని పసిపాపలా చూసుకుంటూ ముచ్చటగా వున్నారు.
మరో బంధువు ఎప్పుడూ బెడ్ మీదనే కూర్చుని నెలకోసారి ఆరోగ్యం బాగాలేదు అంటూ డాక్టరు హాస్పటల్స్ మందులు అని ఒకటే కబుర్లు చెబుతోంది. భర్తే వంట చేస్తాడు. మనిషిని చూస్తే ఎక్కడ జబ్బు మనిషిలా లేదు. మరి ఎందుకు పనిచేయదో అర్ధం కాలేదు. ఉండేది ఇద్దరు. పైగా చిన్నవారేమికాదు. . . . సెవెంటీ ఇయర్స్. . . . ఈ ఏజ్ లో ఎక్కువ తినలేరు. ఒక కూర, సాంబారో, రసం చాలు. అంటే పని బద్ధకం. భర్త ఆన్లైన్ ఫుడ్ తెప్పిస్తే రోజుకి చాలా ఖర్చు అవుతుందని పాపం ఆయనే వంట చేస్తున్నాడు.
ఇలా వుంది వీళ్ళ పధ్ధతి. ఏమైనా కోవిద్ వచ్చి తగ్గి అంతా బాగుపడినా మనుషులు మాత్రం సుఖాలు మరిగారు. మహిళలు జాబ్స్ మానేశారు. కొందరికి జాబ్స్ లేవు. వున్నవి పోయాయి. అటువంటప్పుడు పొదుపు జాగ్రత్త పాటించాలి. అప్పుడు కష్టం అయినది ఇప్పుడు బద్ధకాన్ని పెంచుతోంది. మేము మా పిల్లలూ కూడా అమెరికాలో మామూలుగా తిరగడం, కొన్నాళ్ళు జాబ్స్ కి బ్రేక్ వచ్చినా ఇంటిపని బయట పని చేసుకున్నాం. వాకింగ్ ఎక్సర్ సైజులు చేశాం.
దిన చర్యలో ఎలాంటి మార్పు లేదు. ట్రావెల్ చేయలేదు. పార్టీలు చేసుకోలేదు. ఎవరి ఇంటికి వెళ్ళలేదు. మరి ఇక్కడ వీళ్లకు ఏమి వచ్చింది? ఇంటిపని మానేసి అనారోగ్యం తెచ్చుకున్నారు. పార్టీలు వేడుకలు మానుకోలేదు. కొద్దిరోజులు ఇంటిపట్టున వున్నా, తర్వాత మామూలుగా తిరిగేశారు కదా. మరి ఇంటిపనికి ఓపికలేదా? విడ్డూరంగా వుంది.
నాకు ఒక్కటే అనిపించింది. . . . పని చేసుకోడము అలవాటు ఉంటే ఏదోఒక పని చేస్తారు. ఖాళీగా కూర్చోలేరు. అని! శరీరం శ్రమ పడితేనే మనం చెప్పినట్టు వింటుంది. లేకుంటే ఏదోఒక అనారోగ్యం కలుగుతోంది. ఈ రోజుల్లో వయసును మరచి వ్యాపకం కల్పించుకునేవారు చాలామంది వున్నారు. వారిని ఫాలో అవ్వండి. ఉత్సాహం వస్తుంది. ఏమి చేయని వాళ్లను మార్చలేము. వాళ్ళు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు.
అది గుర్తుకువస్తే, రేపటినుంచి ఇంటిపని చేస్తే చాలు. . .! మీరూ సంతోషంగా ఉండగలరు.
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)

Comments