నోటితో జాగ్రత్త!!
- Gadwala Somanna
- Dec 22, 2024
- 1 min read
Updated: Jan 1
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #నోటితోజాగ్రత్త, #NotithoJagrattha

Notitho Jagrattha - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 22/12/2024
నోటితో జాగ్రత్త - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
నోటి మాట శక్తి గలది
నిలుపుకుంటే గౌరవము
అదుపు చేస్తే మంచిది
జీవితంలో విజయము
నోటి మాటలతో వ్రణము
రేపితే రాదు మేలు
నొప్పించకుండా ఉన్న
అదే అదే వేనవేలు
నియంత్రణ లేని నోరు
చిక్కులు తెచ్చిపెట్టును
పోగొట్టును మంచి పేరు
అప్రతిష్ట పాలు చేయును
నోటితో బహు కీడు
చేస్తుంది వల్లకాడు
దాన్ని సాధు చేయు వాడు
లోకాన లేడు! లేడు!
నిప్పు లాంటి చిన్న నోరు
కడలి హోరు దాని పోరు
తగలబెట్టు కాపురాలు
పాడుచేయు జీవితాలు
కడు జాగ్రత్త నోటితో
అల్లకల్లోలం చేయును
బ్రతుకుల్లో సుడిగుండాలు
ఖచ్చితంగా రేపును
-గద్వాల సోమన్న
Comments