top of page

ఇంట్లో దెయ్యం.. మాకేం భయం

Writer: Mohana Krishna TataMohana Krishna Tata


'Intlo Deyyam Makem Bhayam' - New Telugu Story Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 08/01/2024

'ఇంట్లో దెయ్యం.. మాకేం భయం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



గోపాలరావు తన ఉద్యోగం నిమిత్తం కొంత కాలం వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఊరులో ఒక సంవత్సరం పాటు ఉద్యోగం. టైం తక్కువ ఉండడం చేత వెంటనే జాయిన్ అవాల్సి వచ్చింది. కొత్త ఊరిలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ అని తెలుసుకున్నాడు గోపాలరావు. 


ఊరి చివర ఉన్న ఒక ఇల్లు మాత్రం ఎప్పటినుంచో ఖాళీ గానే ఉంది. ఆ ఇంట్లో దెయ్యం ఉన్నాదని అక్కడ ప్రచారం. రాత్రి ఆ దెయ్యం ఆ దారిలో పోయే వారిని భయపెడుతుందని చెబుతారు. అందుకే, ఆ ఇంట్లో దిగడానికి.. ఎవరూ ముందుకు రాలేదు. 


అద్దె ఇంటి కోసం గోపాలరావు చాలా చూసాడు. ఎక్కువ అద్దె కట్టి అద్దె కు ఇల్లు తీసుకోవాలనుకున్నాడు. అదే విషయం తన భార్య కు చెప్పాడు. అంత అద్దె ఇవ్వడానికి పెళ్ళాం ఒప్పుకోలేదు. ఊరి చివరలో ఖాళీ గా ఉన్న ఇల్లు ఒకటి ఉందని.. ఎవరో చెప్పారని చెప్పింది భార్య కాంతం. ఆ ఇంటికైతే, అద్దె కుడా వద్దని ఇంటి ఓనర్ చెప్పాడు. ఆ ఇంట్లో ఒక సంవత్సరం పాటు మనం ఫ్రీ గా ఉండొచ్చని భర్త కు చెప్పింది కాంతం. 


కాంతం, దెయ్యాలను నమ్మదు.. ధైర్యం చాలా ఎక్కువ. ఆ ఇంట్లో దెయ్యం మీద ఉన్న పుకారు గురించి భర్తకు చెబితే, ఇంట్లో దిగడానికి ఒప్పుకోడని చెప్పలేదు. 


"రేపే మంచి రోజు. మనం వెళ్ళి ఇల్లు శుభ్రం చేసుకుని.. అక్కడే ఉందాం.. " అంది కాంతం.. 


మర్నాడు భార్యాభర్తలు ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి వాలకం చూసి భయపడ్డారు. ఇంటి నిండా దుమ్ము, ధూళి. ఇల్లంతా బూజు వేలాడుతూ ఉంది. ఫ్రీ గా అద్దెకు వచ్చిన ఇల్లు కాబట్టి.. ఆ మాత్రం శుభ్రం చేసుకోకపొతే ఎలాగ అనుకుని.. కాంతం, చక చక ఇల్లు శుభ్రం చెయ్యడం మొదలు పెట్టింది. సగం ఇల్లు శుభ్రం అయ్యేసరికి రాత్రి అయ్యింది. అలసిన ఇద్దరు, భోజనం చేసి.. పడుకున్నారు. 


మర్నాడు ఉదయాన్నే.. నిద్ర లేచి ఇల్లంతా చూసేసరికి.. శుభ్రం చేసిన గది.. మళ్ళీ దుమ్ముగా తయారైంది. సర్దిన సామానులు పెట్టిన చోట లేవు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? అని ఆలోచించింది కాంతం. రాత్రి తానే.. సరిగ్గా సర్ధలేదేమో అనుకుని ఊరుకుంది. 


"ఏమండీ! అంట్లు తోమడానికి, ఎవరైనా మనిషి దొరుకుతుందేమో అడగండి.. "

"అలాగే కనుక్కుంటాను కాంతం!" అని చెప్పి గోపాలరావు స్కూలు కు వెళ్ళే టైం అవుతుందని.. హడావిడిగా వెళ్ళిపోయాడు. 


కాంతం.. మళ్ళీ ఇల్లు శుభ్రం చెయ్యడానికి పూనుకుంది. ఇల్లంతా శుభ్రం చేసేసరికి సాయంత్రం అయింది. ఈలోపు గోపాలరావు ఇంటికి వచ్చాడు. 


"ఏమండీ! ఇల్లు శుభ్రం చేస్తుంటే, మళ్ళీ దుమ్ము గా అయిపోతుంది. ఎలాగో తెలియట్లేదు.. ?"


"ఇందాకల.. స్కూల్ లో మనం ఈ ఇంట్లో ఉంటున్నామని చెబితే, చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకనో అడిగితే.. ఈ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పారు. కొంపదీసి.. ఆ.. ఆ.. దె.. య్యం.. చేస్తుందా ఇదంతా.. ?" అని భయపడుతూ అన్నాడు గోపాలరావు


"ఏమోనండి.. అడుగుతాను.. కాస్త ఉండండి.. "


"ఓ దెయ్యమా! ఎక్కడ ఉన్నావు? నేను ఇల్లు శుభ్రం చేస్తుంటే, నువ్వేనా.. మళ్ళీ పాడుచేస్తున్నావు.. ?"

"అవును.. నేను దెయ్యాన్నే.. నీకు దెయ్యమంటే భయం లేదా?.. అలా అరుస్తున్నావు!" అంది దెయ్యం.


"నాకు భయం లేదు.. " అని గట్టిగా అంది కాంతం.


"భయం లేదంటావేమిటే కాంతం.. భయంతో నాకు చేతులు, కాళ్ళు ఒణుకుతూ ఉంటేనూ.. "


"ఎందుకు అలా చేస్తున్నావు?.. సామానులు కుడా చెల్లా చెదురు చేస్తున్నావు.. ఓ దెయ్యమా?" అడిగింది కాంతం. 


"నాకు కామెడీ చెయ్యడమంటే చాలా ఇష్టం.. అందుకే అలా చేస్తున్నాను.. నేను ఇంతకు ముందు కామెడీ షోలు చేసేవాడిని. అలా కామెడీ చేస్తూ.. ఒక రోజు స్టేజి మీదే ప్రాణాలు విడిచాను. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నేను చనిపోయిన తర్వాత రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాను. రాత్రి అయితే, ఈ పక్కనే ఉన్న దారిలో వెళ్తున్న వారిని ఆటపట్టిస్తూ ఉంటాను.. అంతే! అందుకే, ఈ ఇంటికి భయం తో ఎవరు రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఈ ఇంటికి వచ్చారు. నేను ఎవరికీ ఏ హాని చెయ్యను. మీకు నేను చేసే కామెడీ నచ్చకపోతే, ఇక్కడ నుంచి వెళ్ళండి.. " అని చెప్పింది దెయ్యం.. 


దెయ్యం వల్ల.. తమకి ప్రాణహాని లేదని గ్రహించారు ఇద్దరు దంపతులు.. 


"ఓ దెయ్యమా! నువ్వు ఇక్కడ ఉండాలంటే, బుద్ధిగా ఉండాలి.. " అంది కాంతం.


"అలా ఉండాలంటే, మీరు నాకు రోజు కామెడీ కథలు చెప్పాలి.. అలా చెబితేనే, నేను అల్లరి చెయ్యను.. " అంది ఆ దెయ్యం.


"సరే అయితే.. కానీ, దానికి నువ్వు ఇంటి పనిలో నాకు సాయం చెయ్యాలి.. అప్పుడే నీకు రోజూ కామెడీ కథలు చెబుతాము. ఇంకో విషయం.. నువ్వు ఆ పెరటిలోనే ఉండాలి.. ఇంట్లోకి రాకూడదు.. "

"అలాగే అక్కడే ఉంటాను.. పని లో కుడా సాయం చేస్తాను " అని చెప్పి అక్కడ నుంచి పెరటి లోకి వెళ్లిపోయింది ఆ దెయ్యం.


"దెయ్యం తో ఆ ఒప్పందం ఏమిటి కాంతం?"

"ఊరుకోండి.. ఇంట్లో పనులకి మనిషిని పెట్టుకుంటే, బోల్డంత డబ్బులు ఇవ్వాలి. అదే.. రోజూ ఒక కథ చెబితే.. ఆ దెయ్యం అన్ని పనులు చేసి పెడుతుంది కదా. మీరు తెలుగు మాస్టారే కదా.. కథలు బాగా తెలుసు.. మీకు కథలు చెప్పడం పెద్ద కష్టం కాదు.. "


అలా రోజు దెయ్యానికి ఒక కామెడీ కథ చెప్పేవాడు గోపాలరావు. రోజు చెప్పే కథలను ఆ దెయ్యం చాలా ఆనందించి.. ఇంట్లో పనంతా చేసేది. కొన్నాళ్ళ తర్వాత ఆ దెయ్యానికి ఇంకొక కామెడీ దెయ్యం తోడు దొరికి.. ఆ దెయ్యం అక్కడ నుంచి వెళ్లిపోయింది.. 


******


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ




 
 
 

Comments


bottom of page