top of page

ఇరుగు పొరుగు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Irugu Porugu' Telugu Story Written By Kiran Vibhavari

రచన: కిరణ్ విభావరి


పక్కింటి వాళ్ళతో తగాదాలు పెంచుకుంటే పెరుగుతాయి.

మాటకు మాట జవాబుగా వస్తుంది.

ఒకరు ఒక మెట్టు దిగితే అవతలి వారు మరో మెట్టు దిగుతారు.

పోరు నష్టం, పొందు లాభం అని తెలియజెప్పే ఈ కథను డైనమిక్ రైటర్ కిరణ్ విభావరి గారు రచించారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.ఇక కథ ప్రారంభిద్దాం.


"ఏం పోయే కాలం వచ్చిందర్రా ? మాస్కులు అవీ మా ఇంటి ముందు పడేస్తున్నారు. మేం జబ్బు పట్టి పోవాలనా? పాడు మనుషులు .. పాడు బుద్దులు." అమ్మమ్మ ఎవరిని తిడుతుందా అని బయటకి వచ్చి చూసాను. పక్కింటి ఉమాదేవి గారు మాస్కులు మా బాల్కనీలో పడేశారు. అది చూసిన మా అమ్మమ్మ వాళ్ళను ఏకబీకిన తిడుతోంది. వాళ్ళూ కూడా ఘాటైన సమాధానాలు ఇస్తూ ఏదో అంటున్నారు.


రేప్పొద్దున ఇలాగే మాస్కులతో, ఉమ్ములతో, నోటి తుంపరులతో యుద్దాలు జరుగుతాయేమో నాకు భవిష్యత్తు లీలగా కనిపించింది. అమ్మమ్మ ఆవేశపడుతూ గుండెలు పట్టుకుని కుర్చీలో కూలబడింది. నీళ్ళ చెంబు అందిస్తూ, "ఎందుకే అంతలా ఆవేశ పడతావ్? మెల్లిగా నేను రాము గారికి చెప్పేవాడిని కదా !" అంటూ ఆవిడ పక్కకు కుర్చీ లాక్కుని కూర్చుని చెప్పాను. నా చిన్నతనంలోనే మా తల్లి తండ్రి ఇద్దరూ ఒక యాక్సిడెంటులో చనిపోతే, నన్నూ తమ్ముడిని కంటికి రెప్పలా పెంచింది.


"మామూలుగా చెబితే వినే రకాలా అన్నయ్య " మోహన్ అమ్మమ్మకి సపోర్ట్ చేస్తూ అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. మా ఆవిడ ఒక గ్లాసులో సోడా పట్టుకు వచ్చింది. "నీకెందుకు రేఖ ఈ శ్రమ. మోహన్ కి చెబితే తెచ్చేవాడు కదా" అంటూ అమ్మమ్మ రేఖ చేతిలోని గ్లాసు పుచ్చుకుంది. రేఖ నిండు గర్భిణి కావడం మూలాన అమ్మమ్మ తనను జాగ్రత్తగా ఉండమని పదే పదే చెబుతూ ఉంటుంది.


"అన్నయ్య..ఓనరు రెంట్ అడిగాడు. కరెంట్ బిల్లు కూడా కట్టాలి " మోహన్ బిల్లు ఎంతైందో చెప్పాడు.


"హ్మ్మ్...సరే" అంటూ తలాడించాను. కానీ మనసులో ఏదో గుబులు. ఎలా కట్టాలి? మాది ప్రవేటు స్కూల్. ఫీజులు వసూలు చెయ్యలేనిది, డబ్బులు ఎక్కడనుండి తేవాలి అని మా మేనేజ్మెంట్ ఈ నెల సాలరీ ఇవ్వలేదు. వచ్చే నెల కూడా ఇస్తారనే నమ్మకం లేదు. తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాలేదు. నా ఒక్కడి సంపాదన మీద నా కుటుంబం అంతా ఆధార పడి ఉంది. సేవింగ్స్ కూడా పెద్దగా లేవు. ఇప్పుడెలా రా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చున్నాను.


"అన్నిటికీ ఆ రామయ్య తండ్రి ఉన్నాడురా. ఆయన చూసుకుంటాడు లే. " నా మనసుని గ్రహించి , అమ్మమ్మ సముదాయించింది. నవ్వి ఊరుకున్నాను.


*****


వంటింట్లోంచి ఏదో పెద్ద శబ్దం వస్తే, పరుగున అందరం అటు వెళ్ళాం. రేఖకు పురిటి నొప్పులు మొదలైనట్టు ఉన్నాయి. కింద నేల మీద కాళ్ళు బార్లా చాపి కూర్చుని , నొప్పితో విలవిల లాడుతోంది. నాకు కాళ్లూ చేతులూ ఆడక," మోహన్ తొందరగా వెళ్లి ఓ ఆటో పిలుచుకుని రా' అంటూ వాడిని పురమాయించారు. "వరండాలో తీసుకుని పోదాం. గాలి ఆడుతుంది" అని అమ్మమ్మ చెప్పగానే, మెల్లగా రేఖను వరండాలోకి తీసుకుని వచ్చాం. నొప్పులకు తాళలేక రేఖ అరుస్తుంటే, నాకు కళ్ళు నిండుకున్నాయి.


మోహన్ దిగులుగా వచ్చాడు. లాక్ డౌన్ కారణంగా ఒక్క ఆటో కూడా దొరకలేదు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తోందట. నాకేం చెయ్యాలో పాలు పోలేదు. అంతలో ఉదయం గొడవ పెట్టుకున్న ఎదురింటి ఉమాదేవి గారు గేటు తీసుకుని పరుగున వచ్చారు."ఏంటి పిన్ని నొప్పులు స్టార్ట్ అయ్యాయా?" అంటూ అమ్మమ్మను అడిగింది. అమ్మమ్మ బాధగా అవునన్నట్టు తల ఊపింది. వెంటనే పరుగున వాళ్ళింటికి వెళ్లి, వాళ్ళాయనను వెంటేసుకు వచ్చింది. వాళ్ళ కారులో రేఖను , దగ్గరలోని ప్రసూతి ఆసుపత్రికి తీసుకు వెళ్లాము. డాక్టర్లు ప్రసవ వేదన పడుతున్న నా భార్యను ఐసియు లోకి తీసుకు వెళ్ళి, తలుపులు వేశారు.ఏదో కొంత గండం గట్టెక్కినట్టు అయ్యింది. "పొద్దున్న జరిగినదానికి ఏం అనుకోకు ఉమ.." అమ్మమ్మ ఉమాదేవి గారి భుజం మీద చెయ్యేసి చెప్పింది.మన భారతీయ సంస్కృతిలో ఈ ఇరుగు పొరుగు ఆత్మీయతలు కలహాలు కవ్వింపులూ ఇవన్నీ ఒక భాగమే. ఈరోజున తిట్టుకుని కొట్టుకున్న వాళ్ళూ తెల్లారికల్లా కలిసిపోతూ ఉంటారు. ఉమాదేవి గారిని చూస్తే భలే ముచ్చట వేసింది. పొద్దున్న జరిగినది మనసులో పెట్టుకోకుండా ఈ లాక్ డౌన్ వేళలో కూడా సహాయం చేసిన ఆమె పెద్ద మనసుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే."మాది తప్పులే పిన్ని. మా అత్త గారి సంగతి నీకు తెలుసు కదా. 40 రూపాయలు పెట్టీ కొన్న మాస్కూ ఒక్క రోజుకి వాడి పడేస్తామా అని ఉతికి ఆరవేసారు. అయితే క్లిప్పు పెట్టకపోవడం చేత గాలికి అది మీ ఇంట్లో పడింది. ఎవరికైనా బాధ వేస్తుంది లే. అసలే కరోనా కాలం" ఉమాదేవి జరిగింది చెప్పుకొచ్చారు.


" మా అమ్మమ్మ కూడా అంతే ఆంటీ " మా మోహన్ నవ్వుతూ అన్నాడు.


అంతలో "కంగ్రాట్స్ అండి..మీకు మహాలక్ష్మి పుట్టింది." అని నర్స్ నవ్వుతూ చెప్పేసరికి, అందరి మొహాలు వెలిగిపోయాయి. "మొత్తానికి తల్లి బిడ్డ క్షేమం...అంతా నీ వల్లే ఉమా. నీ ఋణం తీర్చుకోలేనే" అమ్మమ్మ ఉమ గారి చేతులు పట్టుకుని చెబుతుంటే, "అయ్యో.. అంత మాటలెందుకు పిన్ని " అంటూ కౌగలించుకుంది.

జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసాకా, నా బిడ్డను చూడడానికి గదిలోకి వెళ్ళాను. బంగారు బొమ్మలా ఉంది. "నీ యింట మాలక్ష్మి పుట్టిందిరా" అమ్మమ్మ దిష్టి తీస్తున్నట్లు చేతులు తిప్పి, తలకు నొక్కుకుంటూ చెప్పింది. ఆ మాటను నిజం చేస్తూ, మూడు నెలల జీతంతో విలువ చేసే, పిఎఫ్ అమౌంట్ నా ఖాతాలో జమ అయ్యింది అనే సందేశం రాగానే, ఉద్వేగభరితంగా అమ్మమ్మను ముద్దు పెట్టుకున్నాను. "కరోనా కాలంలో ముద్దులు నిషేధం" మోహన్ నవ్వుతూ అంటుంటే, అందరి నవ్వులూ జతకూడాయి.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 33 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసింది నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియోలో ప్రసారం అయ్యింది.

Saho, విశాలాక్షి, సినీ వాలి పత్రికల పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది. మల్లె తీగ కవితల పోటీలో విశిష్ట బహుమతి అందుకున్నాను. కొత్త వెలుగు అనే కథల సంకలనం ప్రచురించాను86 views0 comments

Comments


bottom of page