top of page
Original.png

జరుగబోయే కథ

Updated: Jan 16

#JarugaboyeKatha, #జరుగబోయేకథ, #Nagini, #నాగిని, #తెలుగుకథ

Jarugaboye Katha - New Telugu Story Written By Nagini

Published In manatelugukathalu.com On 08/06/2025

జరుగబోయే కథ - తెలుగు కథ

రచన: నాగిని


కలమును కరమును కదపని కలికీ

కడగండ్లే నీ తోడై ముంచును నిను కడలిన


... ఇక్కడ ఆపేసిన తన కవనం మళ్ళీ అందించునా ఆ విజయాల ప్రహసనం?


కనులు తుడుచుకుంటూ మూసుకుని కుర్చీలో వెనక్కి వాలింది కవిత.


ఇంట పెద్దలందరూ తనకు బాలసారె నాడు పెద్ద పేరే తగిలించినా, తన తల్లి మక్కువగా మనసు లోనే ఈ పుత్రికకు పెట్టుకున్న పేరది.


@@@@@@@@@@@@@@@@@@@@@@@@


"బాల మురళీ కృష్ణ గారినీ, బాల సుబ్రహ్మణ్యం గారినీ మధించితే పుట్టిన అమృతం" ఈ సుధాకరుని గొంతు!


"అబ్బ! ఈయన చివరలో ఆ జోల పాట పాడితే, నేనైతే ఇది కళా వేదిక అని కూడా మరచి పోయి ఓ కునుకు తీసేసాననుకో"!


"మా అమ్మ సంగీతం మహిమ గలదని చెప్తుంటే తీసి పారేశా కానీ, ఈ సుధాకరుని పాట వింటుంటే ఇప్పటికిప్పుడే నాకూ సంగీతం నేర్చేసుకోవాలని ఉబలాటం కలుగుతోంది కానీ, ఆ సుధాకరుని లా మాత్రం పాడలేనని ఆగిపోయాన్రా!" వంటి ప్రశంసలను వింటూ, వేదిక దిగి, తన వాహనం వైపుగా నడుస్తున్న సుధాకర్ కు కారు ఎక్కినా అవి వినపడుతూనే ఉండటం ఎప్పటి లాగానే చిరునవ్వును తెచ్చి పెట్టింది.


"అసలాయన పాడేవి జనాల నోళ్ళల్లో నానే సినిమా పాటలూ, నాటి తరం వాగ్గేయకారుల కీర్తనలూ కాకపోయినా, సాహిత్యము కూడా నోళ్ళల్లో నే నానుతూ ఉంటుంది, ఎవరు వ్రాస్తారో పాటలను!" - ఆఖర్న వినపడిన ఈ మాట మాత్రం "తన తెలివి తేటలకు" గర్వం వచ్చి చేరింది కంటి కొసలలో. 


//////////////////////////////////////////////////////////////////////////


"తనెక్కడ లోపం చేసింది? ఇంటికొచ్చిన అతిథులందరికీ వండి వడ్డించింది, పెద్దలకు మందులూ, టిఫెన్లూ, పిల్లలకు చిరుతిళ్ళూ, ఆడపిల్లలకు తలంట్లూ, పూల జడలూ, గోరింటాకూ - ఇంట్లో ముగ్గు దగ్గర నుంచి పనులూ, పని వాళ్ళని సమర్థింపులూ", కంట నీరు గంగయై పొంగ సాగింది కవితకు.


మొన్న తన చేత గోరింటాకు పెట్టించుకుంటూ పిన్నత్తగారి కూతురు తీసి పడేసిన తన కాగితాలు భర్త తీసేసుకున్నాడు! ఇలా ఎన్ని సార్లని!


ఆ కాగితాలన్నీ ఇక మిగల లేదనుకుని, కరగి పోయెను కలలే, తళుకులీనని కళల కాంతులే యిక కొరత పడగా అనుకుంటూ మౌనంగా విచారింౘ సాగింది సగటు మహిళకు ప్రతీక అయిన కవిత.


 సమాప్తం


నాగిని  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

 నా పేరు: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి

కలము పేరు: నాగిని

ఊరు: హైదరాబాద్

వృత్తి: సాఫ్ట్వేర్ రంగము

పరిచయ వాక్యాలు: వృత్తి ఇష్టమైన సాఫ్ట్వేర్ రంగము, ప్రవృత్తి ప్రాణప్రదమైన పద్య సాహిత్యము, ఇతర ప్రక్రియలలైన కథలు, నానీలు, కవితలు, పరిమిత సంఖ్యలో గౙల్స్ రచనలు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page