top of page

జాతస్య మరణం ధ్రువం'Jathasya Maranam Dhruvam' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'జాతస్య మరణం ధ్రువం' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జాతస్య హి ధ్రువో మృత్యుః

ధ్రువం జన్మ మృతస్య చ.


అంటే పుట్టిన వారికి మరణం తప్పదు- మరణించిన వారికి పు ట్టుకా తప్పదు- ఈ విషయము గురించి శోకించడము తగదు- ఇది భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించిన ధర్మ సూత్రము. ఏదైనా ఆరంభిస్తే ముగింపు తప్పదు- తిరిగి ఆరంభించడము సహజమే- ఉదాహరణకు ఇరువురి మధ్య ఒక యుద్ధము ఆరంభమైతె అది గెలుపుతోనో ఓటమితోనో సంధితోనో ముగియక తప్పదు. తిరిగి కొన్నాళ్ళకు మళ్ళీ మళ్ళి యుద్ధము చేస్తూనే ఉంటారు.


తినడము ఆరంభిస్తె కడుపు నిండితె ముగించక తప్పదు. ఉద్యోగములో చేరడము ఆరంభమైస్తే- విరమణే ముగింపు. ఈ విధంగ మన దైనందిన కార్యక్రమాలలో అనుక్షణము ఆరంభ ముగింపులు సహజంగానే చేస్తున్నాము- తిరిగి మళ్ళీ అవసరార్థము అదే పని ఆరంభించడము ముగించడము చేస్తుంటాము. అదే చర్విత చర్వణం అంటారు. చావు పుట్టుకలు కూడా చర్విత చర్వణం లాంటివే.


ఆయన పేరు హరి శంకర శతధృతి. ఇతనిని దత్తాత్రేయుడు అని కూడా కొందరంటుంటారు - కారణం దత్త అంటే సమర్పించుకొనడము- త్రి మూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్యంత పాతివ్రత్యము గలదియు - అత్రి మహాముని భార్య యైన అనసూయ పాతివ్రత్యము ఎంత గొప్పదో పరీ క్షించ దలచి ఆమెను నగ్నముగా ఉండి భోజనము పెట్టమంటారు- సరె అని ఆమె తన పాతివ్రత్య మహిమతో ముగ్గురిని చంటి పిల్లలుగా మార్చి భోజనము వడ్డిస్తుంది. అంటే ఇప్పుడు వారు అనసూయ పుత్రులతో సమానము- ఎప్పుడైతె అనసూయకు పుత్రులో అత్రికి కూడా కుమారులే- అందువలన దత్త అత్రేయ అని పేరు వచ్చింది.


ఇతని పేరు హరి, శంకర, శతధృతి(బ్రహ్మ) కావడము చేత అందరు తమాషాగ దత్తాత్రేయ అని పిలుస్తుంటారు. భార్య పేరు జగజ్జనని.. ముగ్గురు కూతుర్లు వరుసగా శర్వాణి, నారాయణి, పారాయణి.. హరి శంకర శతధృతి బాగా చదువుకున్నవాడు కాడు కాని వ్యాపారములో మంచి అనుభవముండి బాగా డబ్బు సంపాదిస్తుంటాడు- అద్రుష్ట వశాత్తు అతని భార్య జగజ్జనని బాగా చదువుకున్న వ్యక్తి- విద్వాంసురాలు.


కూతుర్లను కూడా బాగానే చదివిస్తున్నారు తలిదండ్రులు- హరి శంకర శతధృతిది బలహీనమైన ఆలోచన- చావు అంటే భయం- ఒక వేళ చనిపోతె ఏమౌతుంది- నీటి బుడగ మాదిరి టప్పని పేలిపోవలసిందేనా- ఇక ఏమీ ఉండదా! ఈ బంధాలన్ని ఏమి కావలెను.. కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిపాస్తులేమి కావలెను.. అని రాత్రింబవళ్ళు ఆలోచిస్తుంటాడు. ఆలోచించుటే కాక దిన దినము శారీరకంగా మానసికంగా కృంగిపోతుంటాడు- భార్య జగజ్జనని ఇది గమనించి భర్తకు కొన్ని ధైర్య వచనాలు చెబుతుంది.


భర్తతో అంటుంది “చూడండి.. మీ వంశము ఎప్పుడు ఆరంభమయిందో మీకు తెలుసా- ఆ పరంపర ఇప్పుడు ఏమైనట్టు ?. ఆరంభము అంతము లేనిది ఒక కాలము మాత్రమే- అది ఒక ప్రవాహము లాంటిది. అందులో అంతా కొట్టుక పోవలసిందే- భయపడి ఎక్కడికీ పారిపోలేము. కదా చింతించి ప్రయోజనము లేదు” అని నచ్చజెప్పే ప్రయత్నము చేస్తుంది జగజ్జనని.


“ఒక సలహా మాత్రము ఈయగలను- అదేమిటంటె మీరు ఇంత కష్టపడి సంపాదించి ఇన్ని ఆస్తులు కూడ బెట్టారు కదా! ఆ ధనము మీది వ్యామోహమే మీరు చావంటే భయపడి దిన దినము చిక్కి పోవడానికి కారణం. చావు మన చేతిలో లేని పని- అందుకొరకు మీరు సంపాదించిన ధనము "ధర్మాయ యససే అర్థాయ, కామాయ, స్వజనాయచ" అను సూత్రము ప్రకారము ఐదు భాగాలు చేసి ఒకటి ధర్మ కార్యాలకు, రెండవది కీర్తి ప్రతిష్టలకు, మూడవది రేపటి పెట్టుబడికి, నాల్గవది మీ స్వంత అవసరాలకు, ఐదవది కుటుంబ పోషణకు వెచ్చించుతూ హాయిగా కాలము గడుపుతుండండి. భయము వీడండి” అని మరీ మరీ చెబుతుంది భర్త హరి శంకర శతధృతికి జగజ్జనని..


“శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిందేమిటంటే ‘పుట్టినవానికి చావు తప్పదు- చచ్చిన వానికి పుట్టుకా తప్పదు. కాని మన మన కర్మలననుసరించి ఉత్కృష్ట జన్మ పొందే అవకాశమున్నది’ అంటాడు భగవానుడు. ఆ పని నేటినుంచైనా మొదలు పెట్టి ఆత్మ సంతృప్తి పొందుచూ ఉండండి” అని చెబుతుంది జగజ్జనని.


ఈ మాటలకు కొంత ఊరట చెందినవాడై “అవునుకదా! మనకండ్ల ముందు ఎందరో నిరు పేదలు కూడు, గూడు, గుడ్డ లేక ఎన్నో అవస్థలు పడుచున్నారు పాపం- ఆ దరిద్రులే, నారాయణ స్వరూపులని మనము రేపటినుండే తొలుత దానధర్మాలు మొదలు పెడుతాము- ఒక గుడి కట్టించుదాము- జాతస్య మరణం ధృవం అంటున్నావు కద.. మన ఊరిలో మంచి వసతులతో ఒక వైకుంఠధామము కట్టించ పూనుకుందాము” అంటుంటే ఇంటిల్లిపాది సంతోషానికి హద్దు లేదన్నట్టుగా ముగ్గురు కూతుర్లు శర్వాణి, నారాయణి, పారాయణి తల్లిని బిగ్గరగా కౌగిలించుకుంటారు.


“నేను చదువుకొనక చాలా తప్పు పని చేశాను జగజ్జననీ- నీ మూలంగానైనా పుణ్యము లభిస్తుంది. నాకు అదే చాలు” అంటాడు హరిశంకర శత ధృతి.


“ఈ రోజు మీ మనసు కుదుట పడవచ్చు. ఇంకా కొన్ని విషయాలు చెబుతాను వినండి” అంటూ “అమ్మలూ! మీరుకూడా కాస్త ఓపిక చేసుకొని వినండి, తప్పేమికాదు” అని బిడ్డలకు కూడా చెబుతుంది జగజ్జనని.


జగజ్జనని మాటలకు ఎవ్వరూ అడ్డు చెప్పకుండా వినసాగారు-


“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత-

అభ్యుత్తాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం -- పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే-


అంటే ధర్మమునకు హాని కలిగి నప్పుడు, అధర్మం పెచ్చుపెరిగిపోవునప్పుడు(జన్మకర్మ రహితుడైనప్పటికిని ) నన్ను నేను సృజించుకుంటాను అంటూ - సత్ పురుషులను పరీక్షించుటకు, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగము నందు అవతరించుచుందును అని అంటాడు భగవానుడు.


విష్ణువు ధరించిన ఏక వింశతి(21) అవతారాలు ఏవంటే 1. బ్రహ్మ, 2. వరాహ, 3. నారద, 4. నరనారాయణ, 5. కపిల, 6. దత్తాత్రేయ, 7. యజుడుయజ, 8. ఋషభ, 9. పృథు, 10. మత్స్య, 11. కూర్మ, 12. ధన్వంతరి, 13. మోహిని, 14. వరాహ, 15. నృసింహ, 16. వామన, 17. పరశురామ, 18. వ్యాస, 19. రామ, 20. కృష్ణ, 21. కల్కి. వీటిలో పది మాత్రమే పూర్ణావతారాలు. అవి- 1. మత్స్య, 2. కూర్మ, 3. వరాహ, 4. నారసింహ, 5. వామన, 6. పరశురామ, 7. శ్రీరామ, 8. బలరామ- 9. బుద్ధ, 10. కల్కి.


ఇక్కడ బలరామునికి బదులు కృష్ణావతారముగా వ్యవహరించడము జరిగింది (కారణం- బలరాముడు- కృష్ణుడు ఒకేసారి జన్మించుటచే).


నరసింహావతారము అనంతరము నర రూపము నరునిగా- సింహ రూపము నారాయణునిగా అవతరించుటచే నరనారాయణ అవతారమంటారు. అంటే భగవంతునికి కూడా జన్మలెత్తు విధానము ఉన్నప్పుడు మానవ మాత్రులమైన మనము మృత్యువుకు జంకకూడదు తెలిసిందా” అని అందరి ముఖము వైపు చూస్తుంది జగజ్జనని.


హరిశంకర శతధృతి సంపూర్ణ సంతృప్తి చెందుతాడు. మరునాటినుండే హరిశంకర శతధృతి సత్కార్యాలు చేయ తలపెట్టి ఊరి పెద్దల సమక్షములో తాను చేయబోవు పనులగురించి వివరించుతాడు- అకస్మాత్తుగా ఇతనిలో వచ్చిన మార్పుకు జనమంతా సంభ్రమాస్చర్యాలకు లోనౌతారు. ఆ నాటినుండే హరిశంకరశతధృతి కీర్తి మొదలవుతుంది- చేతికి ఎముక లేదన్నట్టుగా దాన ధర్మాలు చేస్తుంటాడు- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దేవుండ్లను నమ్మినందున ఊరిలో "దత్తాత్రేయ" గుడి కట్టించ బూనుతాడు.


అటు ఊరి చివర ఉత్తరాన వైకుంఠ ధామము కూడా నిర్మాణానికి పూనుకొని తగిన ఏర్పాటు చేస్తాడు. ఇక ఇంటివారందరిని జనము గౌరవ భావముతో చూస్తుంటారు. గ్రామ సమాజ కేంద్రమునకు, పాఠశాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మున్నగు వాటి అవసరాలు తీర్చ ఖర్చుకు వెనుకడుగు వేయకుండా ఎంతో కుతూహలం తో డబ్బులందిస్తుంటాడు హరిశంకర శతధృతి.


మొదట ఊర్లో ఉన్న బీదవారి బాగుకు అధిక ప్రాధాన్యమిస్తాడు. ఏండ్లనుండి సంపాదించి దాచిన సొమ్మంతా కరిగిపోతున్నా వెరువక ముందడుగు వేస్తుంటాడు హరిశంకర శతధృతి. ఇంట్లో భార్యా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంటారు. మూడు నాలుగు నెలలలో హరిశంకర శతధృతి తలపెట్టిన పనులన్ని పూర్తయితాయి.


మొదట దత్తాత్రేయుని విగ్రహ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలు శాశ్విత పూజారి నియామకము మున్నగు వాటి నిర్వహణకు గ్రామ వాసులు కూడా ఉత్సాహముతో చందాల రూపకంగా సొమ్ము సమకూర్చుతారు. ఊరంతా ఉత్సాహానికి కారకుడైన హరిశంకర శతధృతిని అందరు కొనియాడుతారు. గ్రామములో స్వల్ప కాలములోనే మంచి పేరు సంపాదించిన హరిశంకరశతధృతి ఇక అధిక సంపాదనకు స్వస్తి పలికి ఉన్నదాంట్లోనే సరిపుచ్చుకొనుచు కాలము గడుపసాగాడు- యుక్త వయసొచ్చిన బిడ్డలకు ఏడాదికొకరికి వివాహము జరిపిస్తూ ఆ బరువుకూడా దించుకొని హాయిగా బ్రతుకసాగాడు-


కొంత కాలానికి మనుమలు మనుమరాండ్రు కలుగడముతో ఇక అతని ఆనందానికి హద్దులు లేకుండా అవుతుంది. ఇన్నింటికి ఇంత సంతోషానికి కారకురాలైన తన భార్యను ఒక దేవతగా భావిస్తాడు. ఏ జన్మలో చేసిన పుణ్యమో జగజ్జనని రూపున నా అదృష్టము నా వెన్నంటి నిలువడము అనుకుంటు తాను నమ్మిన ఆ త్రిమూర్తుల రూపమైన దత్తాత్రేయునికి మొక్కుకుంటాడు. ఇంకా మిగిలి ఉన్న తన ఆస్తిలో నాలుగు భాగాలు చేసి ముగ్గురు బిడ్డలకు సమ భాగాలుగా పంచి నాల్గవ భాగము తమకొరకై ఉంచుకుంటాడు హరిశంకర శతధృతి.


ఇప్పుడిక మృత్యువంటే భయము వీడి నిశ్చింతగా బ్రతుకసాగాడు హరిశంకరశతధృతి. జగజ్జనని కూడా ఊపిరి పీల్చుకున్నదై భార్యాభర్తలిద్దరు ప్రశాంత వాతావరణములో బ్రతకసాగారు. చదువు జ్ఞానము, సంస్కారము మంచి నడతయే కాక జీవితాన్నే అనుకూలంగా మారుస్తుంది కదా అని తలపోయుచు హరిశంకరశతధృతి భార్య దరి చేరి ‘జగజ్జననీ.. నీవు నిజంగా నా పాలిటి దేవతవు’ అనుకుంటు ఆమె చేతిలో చేయివేసి తిరగేసి ఆ చేతినే ముద్దుపెట్టుకుంటాడు తృప్తిగా.


సమాప్తం


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


270 views0 comments
bottom of page