జీవన విధానంలో మన ఆరోగ్యం - ఆహారపు అలవాట్లు
- Kandarpa Venkata Sathyanarayana Murthy

- Jun 19
- 4 min read
#JeevanaVidhanamloManaArogyamAharapuAlavatlu, #జీవనవిధానంలోమనఆరోగ్యంఆహారపుఅలవాట్లు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguArticleOnHealthyDiet

Jeevana Vidhanamlo Mana Arogyam Aharapu Alavatlu - New Telugu Article Written By Kandarpa Murthy Published In manatelugukathalu.com On 19/06/2025
జీవన విధానంలో మన ఆరోగ్యం ఆహారపు అలవాట్లు - తెలుగు వ్యాసం
రచన: కందర్ప మూర్తి
ఈ సృష్టిలో జీవజాలానికి గాలి నీరు ఎంత అవసరమో జీవన క్రియకు ఆహారం కూడా ముఖ్యమైంది. నాగరికత పెరిగి ఆదిమానవుడు వేషభాషలతో పాటు నివాసం, తినే తిండిలో ఆధునికత మొదలైంది. ఆది మానవుడు అడవుల్లో సంచరిస్తూ కందమూలాలు, జంతువుల పచ్చి మాంసంతో కడుపు నింపుకునే వాడు. ఆధునికత పెరిగి నేటి మానవుడు రకరకాలుగా తమ ఆహారాన్ని మార్పులు చేసి షడ్రుచులతో భుజిస్తున్నాడు.
జంతు పదార్ధాలను, వృక్ష పక్షి జాతులే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు, జలచరాల మాంసం తింటూ జీవితాలను సుఖమయం చేసుకుంటున్నాడు. దైనందిన జీవితంలో మనిషి తినే ఆహారం శరీర పోషకాలకే కాకుండా ఆరోగ్య సంరక్షణకు ఎంతో అవసరం.
భగవత్ ప్రసాదం మానవజన్మ. మనిషి పుట్టుక నుంచి మరణించేవరకు మానవ జన్మను జాగ్రత్తగా కాపాడుకుంటు ఆరోగ్య పరంగా ఆధ్యాత్మికంగా సార్ధకం చేసుకోవాలి. ఎందరో యోగులు ఋషులు ఆధ్యాత్మిక వేత్తలు శరీర ఆరోగ్యరక్షణ జీవన విధానం గురించి అనేక మార్గదర్శకాలు ప్రభోదించారు.
ఎన్ని సంపదలున్నా శరీర ఆరోగ్యమే మహా భాగ్యమని నిర్దేశించారు. ఆరోగ్యంలో కూడా భౌతిక ఆరోగ్యంతో పాటు మానసికానందం ముఖ్యమని, దైనందిన జీవన విధానంలో ధ్యానం యోగాసనాలు ప్రాణాయామం వంటి శాస్త్రీయ విధానాల్ని ఆచరించమని తెలియచేసారు.
భూప్రపంచంలో అనేక దేశాలు వివిధ వాతావరణ పరిస్థితులు అనేక జీవన విధానాల కనుగుణంగా శరీరాకృతి వసతి ఆహారం వేషధారణ సంస్కృతి సంప్రదాయాలున్నాయి. ప్రాచీన కాలం నుంచి మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఆహార వస్త్రధారణ ఆధ్యాత్మిక చింతన ప్రపంచ దేశాలకు ఆదర్సంగా ఉంటోంది.
తరాలు మారుతున్నాయి. జీవన విధానం ఆహార వస్త్ర విహారాల్లో మార్పులు కనబడుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవనంతో పాటు అంతా యంత్ర మయమైపోయింది. శరీర శ్రమ తగ్గింది. కృత్రిమ ఆహారం, కృత్రిమ వస్త్రాలు, గాలి నీరు కూడా కలుషితమైపోయాయి. శరీర వ్యాయామం లేక
పసిబిడ్డల నుంచి వయోజనుల వరకూ రోగాల బారిన పడుతున్నారు. శరీర ఆరోగ్యం బాగులేకపొతే దినచర్య మందకొడిగా సాగుతుంది. చలాకితనం తగ్గుతుంది. చిరాకు కోపం పెరుగుతాయి. కుటుంబ సభ్యులు సహచరులతో సఖ్యతగా ఉండలేరు.
నేటి ఆధునిక యంత్రయుగంలో జీవన విధానంలో మార్పులు ఎంతో ముఖ్యం. శరీరానికి కావల్నిన మానసిక శరీర విశ్రాంతి కల్పించాలి. ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని బహిరంగ లేక చక్కని గాలి వెలుతురు ప్రసరించే ప్రశాంత వాతావరణంలో సమయాను కూలంగా యోగ ధ్యానం ఆసనాలు వేస్తూ నడకకు ప్రాధాన్య మిచ్చి సాత్విక ఆహారం సమయ పాలన నియమబద్ద జీవన విధానం అవసరం.
ఎక్కువగా శుద్ధ మంచి నీటిని త్రాగాలి. రాత్రి వీలైనంత తొందరగా ఆహారం తీసుకుని నిద్రకు ఉపక్రమించాలి. సమయం చిక్కినప్పుడు ఆధ్యాత్మిక పౌరాణిక పుస్తకాలు చదవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన స్త్రీ పురుష వయో వృద్ధులు వయోజనులు ఈ నియమాలు అనుసరిస్తే మేలు జరుగుతుంది.
జీవన విధానం:
పూర్వీకులు ఎక్కువగా గ్రామీణ ప్రశాంత వాతావరణంలో బతికేవారు. కులవృత్తులు వ్యసాయదారులు చిన్న వ్యాపారులు అన్యోన్యంగా ఉండేవారు. తెలతెల వారగనే ఎవరి పనులలో వారు నిమగ్నమయేవారు. డబ్బుతో కాకుండా ద్రవ్య మార్పిడి ఇచ్చి పుచ్చుకోవడమయేది.
పురుషులు ఉదయాన్నే దూరంగా బహిర్భూమికి వెళుతు అందుబాటులో ఉండే వేప కానుగ వంటి ప్రకృతి సాధనాలతో దంతధావనం కావించే వారు. మానవ విసర్జకాలు ఇంటి వాతావరణానికి దూరంగా మట్టిలో కలిసిపోయేవి. వచ్చే పోయేటప్పుడు స్వచ్ఛమైన గాలి నడక వ్యాయామం జరిగేది. ఎక్కువగా ప్రకృతి సిద్ధంగా ఆహారం లభ్యమయేది. పాడిపసువులు పెంపుడు జంతువులు పక్షుల ఆహారం అందుబాటులో ఉండేది. నివాసాలు ప్రకృతి పద్దతుల్లో ఉండేవి.
పగలంతా ఎవరి పనులలో వారు గడిపి రాత్రి పది గంటలలోపే నిద్ర తీసేవారు. కావసినంత విశ్రాంతి శరీరానికి మెదడుకు అంది మనసు ప్రశాంతంగా మరుచటి రోజు చలాకీగా ఉండేవారు. నిరక్షరాస్యత కారణంగా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నప్పటికీ అప్పటి నియమాలు ఆరోగ్య పరంగా మేలు చేసేవి. నేటి ఆధునిక యంత్ర యుగంలో పిల్లలు పెద్దలు వత్తిడి ఆంధోళన భయంతో రోజులు గడుపుతున్నారు.
అందువల్ల మానసికాందోళనకు గురై మెదడు గుండె మూత్ర పిండాలు ఊపిరి తిత్తులు వంటి అంతర్గత అవయవాల పనితీరు దెబ్బ తిని బ్లడ్ ప్రెషర్ షుగర్ గుండెజబ్బులు నరాల జబ్బులతో బాధపడుతున్నారు. కుటుంబంలో పెద్దలు క్రమశిక్షణతో ఉంటే పిల్లల ప్రవర్తన బాగుంటుంది. అందువల్ల సమాజానికి మేలు జరుగుతుంది.
ఆహార ఆరోగ్య నియమాలు:
మనం తినే ఆహార నియమాల్ని బట్టి శరీర జీర్ణక్రియ బాగుంటుంది. రోగాలకు ముఖ్య కారణం మలబద్దకం. మల విసర్జన సక్రమంగా జరగక పోతే అనేక రోగాలు వస్తాయి. విసర్జకాలు బయట పడక కడుపులో ఉబ్బరం, మంట పుట్టి ఆకలి నసిస్తుంది. పోషకాలు సరిగ్గా అందక రక్త ప్రసరణతో పాటు అవయవాల పనితీరు ప్రభావితమవుతుంది. అలాగే మూత్ర విసర్జన సక్రమంగా జరగక కిడ్నీలు దెబ్బతింటాయి.
ప్రకృతి సిద్ధమైన శాకాహారం శరీర ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. చిరుధాన్యాలు ఆకుకూరలు ఫలాలు పప్పుదినుసులు పాలు పెరుగు వంటి జంతు పదార్థాలు సులభంగా జీర్ణక్రియకు సహకరిస్తాయి. కొబ్బరి నీళ్లు ఫలద్రవాలు రక్త శుద్దికి పనిచేస్తాయి.
వయోజనులు వీలైనప్పుడల్లా రక్త దానం చెయ్యడం వల్ల రక్త శుద్ది జరిగి కొత్త రక్తకణాలు పుట్టి చురుకుదనం వస్తుంది. మద్యం పొగతాగడం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో పెంపుడు జంతువులు పక్షుల వల్ల అవి చూపే విశ్వాసం ఆటలు అరుపుల మూలంగా వృద్ధులు పిల్లల్లో మానసికానందం కలుగుతుంది.
ఏ వయసుల వారికైనా నడక ఎంతో మేలు చేస్తుంది. రక్త ప్రసరణతో పాటు కండరాలు కీళ్లకు వ్యాయామవుతుంది. ఉమ్మడి కుటుంబం కాకపోయినా సాధ్యమైనంత వరకూ కుటుంబ సభ్యులు ఏకాంతంగా కాకుండా ఉమ్మడిగా కలిసి జీవిస్తే మానసిక రోగాలకు దూరంగా ఉండవచ్చు.
ఆరోగ్య సూత్రాలు:
ధ్యానం యోగ మనసును అదుపులో ఉంచుతాయి. ఆసనాలు శరీర అవయాల్ని క్రమబద్దీకరిస్తాయి.
ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తుంది. పరిమితి నడక కండరాల కీళ్లకు రక్త ప్రసరణను కలిగిస్తాయి. విపాసన విలాస జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక దారి చూపుతుంది.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.




Comments