జీవిత సత్యాలు
- Vemparala Durga Prasad
- 3 days ago
- 1 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #TeluguKavithalu, #తెలుగుకవితలు, #జీవితసత్యాలు, #JeevithaSathyalu

Jeevitha Sathyalu - New Telugu Poem Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 05/07/2025
జీవిత సత్యాలు - తెలుగు కవిత
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
తరచి చూడగ గోచరించెను దేవుడు
కులాల కుళ్లు అంటుకోడతడు
మతాల మౌఢ్యము నెరుగడతడు
పాప పుణ్యాల లెక్కసేయును వాడు
పుట్టించి గిట్టించు వాడు తానె యతడు
జనుల చేష్టలు క్రీడగా చూచు నతడు
అల్లా అనువానికి అల్లా యతడు
జీసస్ అనువానికి జీససతడు
శివ శివా అనువానికి శివుడువాడు.
---------------
బాధ్యతలు గుర్తు చేస్తుంటే
బంధాలు బీటలవుతున్నాయి
మంచి అలవాటు ప్రోత్సహిస్తే
చెడు మాటలు వినబడుతున్నాయి
నిండు మనసుతో ఏమి చెప్పినా
అనుమానాలు ముసురుకుంటున్నాయి....
కానీ...లెక్కించక
అంతఃశుద్ధి తో ముందుకు సాగిన చాలు
పంతాల పరదాలు అవే తొలగిపోతాయి.
-----------
జీవితంలో ఒడిదుడుకులు సంవత్సరం లో ఋతువులు లాంటివే..
శిశిర ఋతువులో ఆకురాల్చిన
చెట్లు వసంతం లో చిగురిస్తాయి..
ఓపికతో చక్కదిద్దుకుంటే జీవితం వసంతం కాదా?

-వెంపరాల దుర్గాప్రసాద్
댓글