#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JendaSandesamu, #జెండాసందేశము, #RepublicDay

Jenda Sandesamu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 26/01/2025
జెండా సందేశము - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
ఎగురుతుంది మన జెండా
ఎంచక్కా గగనంలో
మహనీయుల త్యాగాలకు
సాక్షిగా ఇల స్వేచ్చగా
గణతంత్రం వచ్చిందని
ఎలుగెత్తి చాటుతుంది
పరతంత్రం పోయిందని
సంతోషం పంచుతుంది
కాషాయం,తెలువు ఆకుపచ్చ
రంగులతో అందంగా
మువ్వన్నెల ఘన జెండా
ఊగుతుంది గర్వంగా
తెలుపు రంగు పవిత్రతకు
కాషాయం రంగు త్యాగానికి
ముంగుర్తుగా ఉందోయ్!
ఆకుపచ్చ అభివృద్ధికి
చేయి చేయి కలపాలని
చెలిమితో మెలగాలని
మన జెండా సందేశము
అక్షరాల ఆదేశము
-గద్వాల సోమన్న
Comments