top of page
Original.png

జోక్యం అనవసరం

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JokyamAnavasaram, #జోక్యంఅనవసరం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 154

Jokyam Anavasaram - Somanna Gari Kavithalu Part 154 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 15/12/2025

జోక్యం అనవసరం - సోమన్న గారి కవితలు పార్ట్ 154 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


జోక్యం అనవసరం

--------------------------------------

ఎదుటివారి బ్రతుకుల్లో

జోక్యమే చేసుకోకు

అనవసరపు విషయాల్లో

ఉత్సుకత పెంచుకోకు


ఎవరి బ్రతుకులు వారివి

సంబంధమసలు లేనివి

ఎందుకంత ఆరాటము

పనికిరాని ఉబలాటము


పరుల గుట్టు బహిర్గతము

ఏనాడూ చేయబోకు

దాని కంటే నీచము

వేరొకటి ఉండబోదు


మానాలి వెటకారము

ఉండాలి సంస్కారము

చేతనైతే మాత్రము

చేయాలోయ్! సహాయము

ree






గురుదేవుల నీతి సూక్తులు

-----------------------------

బుద్ధిబలం గొప్పది

భువిలోనే మిన్నది

కల్గియున్న వారికి

క్షేమాన్ని ఇచ్చునది


విలువైనది జ్ఞానము

అభివృద్ధికి మార్గము

కల్గియుంటే గనుక

చేయు స్వర్గధామము


బహు శ్రేష్టము ధ్యానము

చేకూర్చును శాంతము

చేసుకుంటే గనుక

సుభిక్షము జీవితము


పెరగాలి గౌరవము

తరగాలి గర్వము

ఎదగాలి గొప్పగా

బ్రతకాలి హాయిగా

ree















బామ్మ హితవు

----------------------------------------

వల్లించుట నీతులు

చూడ సులభతరమే

చూపించుట చేతలు

అత్యంత ముఖ్యమే


ఉండాలి ఆచరణ

బ్రతుకున క్రమశిక్షణ

మనోబలం గొప్పది

అదే కదా రక్షణ


మాట మీద నిలకడ

ఉంటేనే మనుగడ

గుర్తించుము బాధ్యత

ఇవ్వాలోయ్! భద్రత


మనసుపై నియంత్రణ

ఉండాలోయ్! ధారణ

చూపించాలి కరుణ

వృద్ధులపై ఆదరణ

ree













మేటి మాటల ముత్యాలు

-----------------------------------------

మాట విలువ పెంచుకో

మంచి దారి ఎంచుకో

సాహస పనులు చేసి

ఘన కీర్తిని పంచుకో


దుర్గుణాలు త్రుంచుకో

చెడు తలపులు మానుకో

శ్రేష్టమైన బుద్ధితో

పరుల మేలు కోరుకో


గర్వాన్ని వదులుకో

వినయాన్ని ధరించుకో

మహనీయుల బాటలో

సక్రమంగా నడుచుకో


త్యాగగుణం చాటుకో

ప్రేమ మదిని నింపుకో

పదిమంది క్షేమాన్ని

అనిశము స్మరించుకో

ree














ముఖ్యమైన వాక్కులు

-------------------------------------------

నీ తప్పు లేని చోట

ఏమాత్రం తలవంచకు

నమ్మకం లేని చోట

క్షణమైనా వాదించకు


డబ్బు ఉన్న వాని కన్న

గుణం ఉన్న వాడు మిన్న

చరిత్ర చెప్పే సత్యము

నిశితంగా గమనించుము


వద్దు వద్దు శత్రుత్వము

ముద్దు ముద్దు క్షమాగుణము

అన్నింటిలో శ్రేష్టము

అవనిలో ప్రేమతత్వము


ప్రేమలేని జీవితాలు

సఖ్యత లేని కుటుంబాలు

అభివృద్ధికి బహు దూరము

అగును అతలాకుతలము

ree

గద్వాల సోమన్న







bottom of page