top of page

కల చెదిరింది




'Kala Chedirindi' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 10/12/2023

'కల చెదిరింది' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


భాను ఉదయం నిద్ర లేచేసరికి.. పక్కన భర్త లేడు. బాత్రూమ్ లో ఉండి ఉంటాడేమో నని మళ్ళీ దుప్పటి కప్పుకుని పడుకుంది. కాసేపటికి మళ్ళీ మెలుకువ వచ్చి.. భర్త కోసం చూసింది.. ఇంకా రాలేదు. ఈ రోజు సండే, ఆఫీస్ కుడా లేదు.. మాములుగా అయితే ఉదయం ఎనిమిది వరకు పడుకుంటాడు రవి. కొంచం మెలుకువ తెచ్చుకుని.. అలా బాల్కనీ లోకి వెళ్లి చూసింది.. అక్కడా లేరు. ఇల్లంతా వెదికింది.. ఎక్కడా జాడ లేదు. మా ఆయనకి వాకింగ్ కి వెళ్ళే అలవాటు కుడా లేదు. ఏంటబ్బా! అని చాలా అలోచించి.. తన ఫోన్ తీసి రవి కి కాల్ చేసింది.. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంతో ధైరవంతురాలు భాను.. భర్త ఎక్కడున్నాడో తెలియక పోయేసరికి, చాలా కంగారు పడిపోయింది.. 


తన ఫోన్ లాక్ ఓపెన్ చేసి.. ఒక గంట కింద రవి పెట్టిన మెసేజ్ చూసింది.. 


"భాను! జీవితం లో చాలా ఉహించుకున్నాను.. కానీ.. నాకు నీ సహకారం లేదు. నేను వెళ్ళొస్తా! ఏమో వెళ్తాను అనాలేమో.. " అని మెసేజ్ పెట్టాడు. మెసేజ్ చూసిన భాను కి గతం లో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి.. 


***


భాను కాస్త హుషారుగానే ఉండేది. రవి ని పెళ్ళి చూపులలో ఇష్టపడి మరీ పెళ్ళి చేసుకుంది. ఇష్టపడే భార్య వస్తే, ఆమె అన్నింటిలోను సహకరిస్తుందని.. జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యచ్చు కదా! అని ఫిక్స్ అయ్యాడు రవి. 


భాను అంత అందంగా లేకపోయినా, చామనచాయ రంగు.. చూడడానికి బాగుంటుంది. అయినా, అందానిదేముంది.. నన్ను ఇష్టపడుతుంది.. అదే చాలనుకున్నాడు రవి. 


పెళ్ళైన కొత్తలో.. కొంచం బాగానే ఉన్నా.. రొమాన్స్ అంటే, ఒక ఎలర్జీ లాగ దూరంగా ఉండేది భాను. కొత్తలో అలాగే ఉంటుందేమో అనుకుని సర్దుకు పోయాడు రవి. కానీ, సంవత్సరం గడచినా తనలో మార్పు లేదు. సంసారం అంటే, అదేదో పెళ్ళి చేసుకున్నాము కాబట్టి అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. సరదాలు లేక, బెడ్ రూమ్ ఎప్పుడూ వెల వేల బోయేది. 


భాను కి ఇదంతా పెద్ద ప్రాబ్లం గా అనిపించేది కాదు. పెళ్ళి కి పరమార్ధం లో ఒకటైన సంసారం గురించి తక్కువ అంచనా వేసింది భాను. తను అనుకున్న పనులు జరిగాయా లేదా అని చూసుకోవడం.. భర్త వెంట పడి పనులు చేయించుకోవడం తప్ప.. భర్త కోసం తను చేయాల్సింది ఏమిటో ఎప్పుడు ఆలోచించలేదు. కమ్మగా వండి పెట్టడం, సరదాగా కబుర్లు చెప్పడం, కలిసి సినిమా చూడడం.. అలాంటివి ఏవీ లేవు. 


వీటి గురించి చాలా సార్లు డిస్కషన్స్ అయినా.. అన్నీ గొడవకే దారి తీసేవి. పైగా, భార్య ఎలా ఉంటే, అలా సర్దుకు పోవాలని హితం చెప్పేది భాను. ఒకోసారి అయితే, భాను మాటలు రవి ని బాగా డిస్టర్బ్ చేసేవి. సంసారం చెయ్యడానికి కుడా లెక్కలు వేసి.. నెంబర్ ఫిక్స్ చెయ్యడం భాను కే చెల్లింది. ఇలాగే.. ఇంకో సంవత్సరం గడిచిపోయింది. సరదా లేని జీవితం జీవించలేక, వర్క్ పై ధ్యాస లేదు. తన లక్ష్యం గురించి సపోర్ట్ చేసే భార్య ఏమి పట్టించుకోవట్లేదు.. పైగా, పెళ్ళి ఒక ట్రేడ్‌మార్క్ కోసం చేసుకున్నట్టు అనిపించింది రవి కి. 


***


ఇంక ఇలాంటి జీవితం వద్దని.. చాలా సార్లు రవి అన్నది గుర్తొచ్చింది భాను కి. ఏం చెయ్యాలో అర్ధంకాక.. అయోమయం లో మెయిల్ ఓపెన్ చేసింది. అప్పటికే, బుగ్గల వరకు జారిని కన్నీటిని తుడుచుకుంటూ.. రవి పంపిన మెయిల్ చదివింది. 


"భాను! నువ్వంటే, నాకు ఇష్టమే.. కానీ.. పెళ్ళి మీద నీకు పాజిటివ్ ఒపీనియన్ లేదని నాకు అర్ధమైంది. నేను జీవితం లో సాధించడానికి చాలా ఉన్నాయి.. వాటి కోసం నా గమ్యం వైపు వెళ్తున్నాను.. "


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలుతాత మోహనకృష్ణ


48 views0 comments
bottom of page