top of page

ఇన్ సైడ్ - అవుట్ సైడ్




 'Inside - Outside' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 10/12/2023

'ఇన్ సైడ్ - అవుట్ సైడ్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


అజయ్, భాను ఇద్దరు ఒకే ఊరిలో పుట్టి పెరిగినా.. చిన్నప్పటి నుండి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గిట్టదు. 


వందమంది మద్య కోట్లాట కూడా ఇద్దరితోనే మొదలవుతుంది. 

ఆ ఇద్దరిలో ఒకరిది తప్పుంటుందని పెద్దలు అంటుంటారు కదా.. !

 అచ్చం అలాగే ఇక్కడ కూడా... 


అజయ్ కి భాను అంటే గిట్టదు. భాను అజయ్ లా చదువుకోవటానికి పాఠశాలకి కూడా వెళ్ళడు. అంతటి పేదరికం భాను తల్లిదండ్రులది. 


అయినా కూడా... అజయ్ కి భాను అంటే ఆసూయ ఎందుకంటే.. ! భానుకి అక్షరం రాకపోయినా.. చాలా తెలివైన వాడిగా, మంచివాడిగా చిన్నతనం నుండే పేరు గాంచాడు. 


అసలు భాను పై అజయ్ ఆసుయకి ఇంకో కారణం కూడా ఉంది. 


ఆ ఊరిలో జనం పక్కోడి విషయాలు, వ్యక్తిత్వాలు, వాళ్ళు చేసే పనులు భూతద్దంలో చూడటం, మాట్లాడుకోవటం. 


ముఖ్యంగా ఈ రెండో కారణమే భాను పై అజయ్ కి ఆసుయ తెప్పించటానికి ప్రధాన కారణం. 


భాను ఇంటి పక్కనే అజయ్ ఇళ్ళు ఉండటంతో చదువుకోకపోయినా.. తెలివైనవాడనే పేరు చదువుకున్న తనకు రాకపోవడం ఏంటనీ..


 అది తప్ప అంతకుమించి వారికి ఏ శత్రుత్వం లేదు. ఒకరికొకరు గొడవలు పడరు, ఒకరికొకరు తిట్టుకోరు, ఒకరి అభివృద్ధికి ఒకరు అడ్డు కూడా పడరు. కానీ.. ! 

ఒకరినొకరు చూసుకోరు, ఒకరినొకరు మాట్లాడుకోరు, ఒకరు ఉన్న చోటుకి మరొకరు రారు. 


ఈ శత్రుత్వం ఒకరితో ఒకరు పోటీపడి బాగా గొప్పవాళ్ళం అవ్వాలనే కసిని వారిలో పెంచసాగింది. 


అయితే.. ! 

అజయ్ తో పాటు భాను మధ్యతరగతి వాడే అయినా భాను తల్లిదండ్రుల పేదరికం వలన అతడికి గొప్పవాడు అవ్వాలనే తన ఆశయాలు నెరవేరలేదు. 


అజయ్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి భాను కళ్ళ ముందు, ఊరి వారితో గొప్పవాడ్ని ఆని అనిపించుకోవాలని తహతహలాడుతుండేవాడు. 

ఒకవేళ ఉద్యోగం రాకపోయినా.. పట్నం పోయి ప్రవేటు జాబ్ తో అయినా బాగా సంపాదించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. 


భానుకి కూడా చదువుకోకపోయినా ఎలాగైనా అజయ్ కంటే మంచి జీవితం అనుభవించాలని ఆశ. అందుకోసం ఊరు వదిలి పట్నం వెళ్ళటానికైనా సిద్దంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు భాను. 


అజయ్ తాను అనుకున్నది సాధించటానికి పట్నం పోయాడు. 


దీంతో అజయ్ ఊరికి అవుట్ సైడ్, భాను ఊరికి ఇన్ సైడ్ గా అజయ్ తనలో తానే ఒక చాలెంజ్ చేసుకుని మరీ వెళ్ళాడు. 


అజయ్ పట్నం వెళ్ళాడని తెలిసి ఊరిలో పట్నం వెళ్ళేంత తెలివితేటలు ఉన్నాయా.. అంటు ఆశ్చర్యంతో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. 


అజయ్ కి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేంత తెలివితేటలు లేవనీ భానుకి తెలుసు. 

అయినా ఆసుయపరుడు అజయ్ కానీ భాను కాదు కదా.. !


అజయ్ ఏం చేస్తే తనకేందుకు తాను తాన తల్లిదండ్రులు బాగుంటే చాలు అనే ఆశ భానుది. 


అజయ్ కి నిజంగానే గవర్నమెంట్ జాబ్ కొట్టే సత్తా లేక ఓ ప్రవేటు కంపెనీలో నెలకు 15000వేల రూపాయలకు సెట్ చేసుకుని అక్కడే ఉంటూ.. 

ఎప్పుడో ఏడాదికి. ఒకటో, రెండో దఫాలు ఊరు వచ్చి చూసి పోతుండేవాడు. అయితే ఊరు వచ్చిన ప్రతిసారి అజయ్ కి ఎక్కడలేని గౌరవం దక్కేది. 


పట్నం వెళ్ళటమే ఆ ఊరికి గగనం. అలాంటిది పట్నంలో ఉద్యోగం చేసి సంపాదించటం అంటే మాటలా మరీ..


అలా అజయ్ ఊరి జనం మాటలకు పొంగిపోయేవాడు. కానీ.. 

 అజయ్ ఉద్యోగం, ఆ పనికి సరితూగని జీతం మాత్రం ఎవరికి తెలియదు. అజయ్ కూడా ఓ సాప్ట్వేర్ ఉద్యోగిలా బిల్డప్ కొట్టేవాడు. తల్లిదండ్రులు యోగక్షేమాలు పట్టేవి కాదు. అసలు అజయ్ మనసులో ప్రశాంతమైన జీవితం గడపలేకపోతున్నా.. బయటకు కనపడేవాడు కాదు. 


భాను తెలివిగా ఆలోచించి ఊరిలోనే ఉండిపోయాడు. 

ఊరు వదలని వాడు బాగుపడడు అని తెలిసినా.. పట్నం పోయేవాడు మనఃశాంతిగా బతకలేడని భానుకి తెలుసు. అజయ్ తో పాటు భాను కూడా ఇప్పుడు వయసుకు వచ్చినవాడే పైగా చిన్నప్పటినుండి తల్లిదండ్రులుతో కూలి పనికి వెళ్తూ వారికి సహాయంగా ఉంటు పనిలో మంచి అనుభవం సంపాదించాడు. 


ఇప్పుడు తాను కష్టమైన పనులకు వెళ్తూ.. తల్లిదండ్రులను పనికి వెళ్ళనీయకుండా ఇంటి వద్దే తనకున్న దాంట్లో కొంత మొత్తాన్ని ఆవులు, గేదెలు కొని తల్లిదండ్రులుకు వాటి పోషణ బాధ్యతలు అప్పగించేవాడు. పనిలేని సమయంలో తానే వాటి పోషణ చూసుకునేవాడు. ఒకవైపు పాల దిగుబడి, మరోవైపు పని, ఇంకోవైపు తల్లిదండ్రులుకు కష్టంలేని పని అప్పజెప్పి కని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను ఏ కష్టం రానీయకుండా చూసుకోగల్గుతున్నాడు. 


ఇక దేవుడు రాసిన రాత ఏమో కానీ.. అజయ్ భానులు ఒకే ఏడాది పెళ్ళి ముహూర్తాలు కుదిరాయి. 


భాను మంచి ఇళ్ళు కూడా నిర్మించుకున్నాడు. పశువులకు ప్రత్యేకంగా శాల కూడా ఏర్పాటు చేసి వృద్ధులైన తల్లిదండ్రులును కాకుండా ఇద్దరు పనివాళ్ళని కూడా పెట్టుకోసాగాడు. దీంతో భాను పని లేని సమయంలో తల్లిదండ్రులతో ఆనందంగా గడిపేందుకు కేటాయించేవాడు. 


అజయ్ పెళ్లికి ఊరు వచ్చాడు. 

అతడికి ఊరిలో ఏ గౌరవమూ లేదు. అతడి కంటే ఊరి ఇన్ సైడ్ లో ఉన్నవాళ్ళే ఎక్కువ సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారని. 


అందులోను భాను అంటే ఊరిలో వారందరికీ చాలా ఇష్టం, గౌరవము ఏర్పడింది. ఎందుకంటే ఊరిని వదలకుండా బాగుపడ్డవాడే లేడు అనుకుంటే ఊరిలో ఉండి అతడు ఎదిగిన స్థాయి, తల్లిదండ్రులును చూసుకునే విధానం ఎంత వర్ణించినా తక్కువే. 


తెలివి ఉండాలే కానీ.. ఇన్ సైడ్ లో ఉన్నా సాదించగలమని, చదువుకోకపోయినా ధైర్యం, తెలివితేటలు, కష్టపడేతత్వం ఉంటే ఏదైనా సాదించగలమని భాను నిరూపించాడు. 

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం






36 views0 comments
bottom of page