top of page

నన్ను నేను కలుసుకున్నాను



'Nannu Nenu kalusukunnanu' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 09/12/2023

'నన్ను నేను కలుసుకున్నాను' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ



జీవితం లో చాలా అలసిపోయాను. తప్పక, జీవితం నెట్టుకొస్తున్నాను. పేరుకి బంధువులు ఉన్నా...ఏ సహాయం లేదు. పేరుకి పెళ్ళి అయ్యింది అంతే! ఒంటరిగానే అన్ని పనులు చేసుకుని, సంతోషం లేక, ఉన్నాను. నా జీవితాన్ని నేనే మార్చుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాను. నా జీవితాన్ని నేను మార్చుకునే అవకాశం గురించి చాలా ఆలోచించాను. ఫ్రెండ్స్, బంధువులు...ఈ కలికాలం లో అందరూ అవకాశవాదులే. ఎవరి సహాయం అడిగినా, ప్రయోజనం ఉండదు.


కష్టమైనా, ఎలాగైనా టైం మెషిన్ కనిపెట్టాలని నిర్ణయించుకున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం..టైం మెషిన్ పై ఆసక్తి, మంచి పరిజ్ఞానం ఉండడం చేత..చాలా రీసెర్చ్ చేసి..రాత్రనకా..పగలనకా..ఆఫీస్ కు సెలవు పెట్టి మరీ తయారు చెయ్యడానికి పూనుకున్నాను. సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా, చివరకు సాధించాను.


నా గతం లోకి టైం సెట్ చేసి, నేను ప్రవేశించాను.. కరెక్ట్ గా ఆరు సంవత్సరాల వెనుక కు. గతంలో, ముంబై లో నేను పని చేసే ఆఫీస్ కు దగ్గరగా తీసుకున్న రూమ్ ముందుకు వచ్చేసాను. చుట్టూ చూసి, చాలా ఆనందపడ్డాను. నా రూమ్ తలుపు కొట్టాను. తలుపు తీసాడు. అది నేనే..అద్దం లో నన్ను నేను చూసుకున్నట్టుంది.


"ఎవరండీ మీరు? అరే...అచ్చంగా నాలాగే ఉన్నారే?"

"లోపలికి రావొచ్చా అనిల్?"

"నా పేరు మీకెలా తెలుసు?"

"నాకన్నీ తెలుసు! కూర్చొని మాట్లడుకుందాం అనిల్.."


ఇద్దరూ మంచం మీద కుర్చున్నారు.


"ఇప్పుడు చెప్పండి!..మీరు నా అన్నయ్యా? మనకేమైనా రాముడు భీముడు ఫ్లాష్ బ్యాక్ ఉందా?"

"లేదు అనిల్!"

"ఎలా ఉన్నావు అన్నయ్య?" అని అడిగాడు రూమ్ లో ఉన్న అనిల్.


"నేను చెప్పేది విను...నేను భవిష్యత్ నుంచి వచ్చాను. మనిద్దరం ఒక్కరమే...నువ్వు పాస్ట్ లో అనిల్...నేను ఫ్యూచర్ లో అనిల్.."

"నిజంగా..ఇది సాధ్యమేనా అన్నయ్య?"

"అవును నువ్వు చూస్తున్నది నిజమే!"



"నీ  కోసం వచ్చాను. నేను నిన్ను గైడ్ చేసి, నీ..అదే మన జీవితాన్ని మార్చబోతున్నాను ..ఇంకా హ్యాపీ గా ఉండడానికి.  ఈ ఊరు కాని ఊరులో...నీకు సహాయం చెయ్యడానికే వచ్చాను.


"ఎవరైనా ఫోన్ చేస్తున్నారా?"

"లేదు అన్నయ్య ! అమ్మ మాత్రమే చేస్తుంది అంతే!"

"మన జీవితం చివరవరకు ఇలాగే ఉంటుంది. ఈ కలికాలం లో ఎవరూ సహాయం చెయ్యరు. నువ్వు సెలబ్రిటీ అయి ఉండాలి..లేక డబ్బైనా ఉండాలి, అవి లేకపొతే చుట్టాలు కూడా పట్టించుకోరు!..దీనిని మారుస్తాను! నేను ఇక్కడ కొన్ని రోజులుంటాను. ఎవరైనా నా గురించి అడిగితే, అన్నయ్యనే చెప్పు!"


మనల్ని, అభిమానించే వారు జీవితం లో దొరకడం మన అదృష్టం..వారిని ఎప్పుడు వదులుకోకు. ఇంకొకటి, ఈ లోకం లో అందరూ నమ్మకంగానే కనిపిస్తారు; మన మీదే నిచ్చెనలు వేసి ఎదిగిపోతారు; సరిగ్గా స్పందించాలి అనిల్!


నీ మంచి మనసు, మంచి గుణమే నిన్ను జీవితంలో ముందుకు తీసుకుని వెళ్తుంది. నేను పడ్డ కష్టాలు కొన్నైనా నీకు తప్పించాలనే..నా తపన!”


"అలాగే అన్నయ్య!"


మర్నాడు తీవ్రమైన జ్వరం వచ్చింది రూమ్ లో ఉన్న అనిల్ కు. 

“పదా.. డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తాను”. 


అలాగ, నన్ను నేను హెల్ప్ చేసుకుని, నన్ను దగ్గరుండి నేను చూసుకుని...జ్వరం నయం చేసుకున్నాను. గతంలో నా దయనీయ పరిస్థితి నుంచి తప్పించాను.


"ఇప్పుడు అర్ధమైంది అన్నయ్య..నువ్వు ఎందుకు ఇక్కడకు వచ్చావో?"


"నీకు జ్వరం వచ్చినా, నీ దగ్గరకు ఎవరూ రాలేదు..అందుకే నేను వచ్చాను అనిల్! నేను వచ్చి అప్పుడే చాలా రోజులయింది...నేకు చెప్పాల్సినవి చెప్పి నేను ఇంక వెళ్ళిపోతాను..” అని జేబులోంచి స్మార్ట్ ఫోన్ తీసాడు.


"ఏమిటి ఇది అన్నయ్య?"


"ఇది ఖరీదైనా స్మార్ట్ ఫోన్… నీకు షేర్ మార్కెట్స్ అంటే ఆసక్తి అని నాకు తెలుసు! నేను ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెబుతాను...అప్పు చేసి వాటిలో ఇన్వెస్ట్ చెయ్యి...వాటి వలన కొన్ని సంవత్సరాలలో నువ్వు కోటీశ్వరుడు జాబితా లోకి  వెళ్తావు! 


అలాగే, నువ్వు ఎక్కడ జాగ్రతగా ఉండాలో కూడా రాసి ఇస్తాను. పెళ్ళి జీవితం లో చాలా ముఖ్యమైనది. బాగా అలోచించి, మంచి మనసున్న అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకో!”


"నా గురించి నీకు అన్నీ తెలుసు....నువ్వు నాకు దేవుడు తో సమానం అన్నయ్య...భవిష్యత్తు తెలిసిన వాడవు కదా!"


"కరెక్ట్ గానే చెప్పావు...నేను ఇంక నా కాలానికి వెళ్ళలేను..ఆ దేవుని దగ్గరకే వెళ్ళగలను. అలా చెయ్యక పొతే, నీ ఫ్యూచర్ మారదు. నేను పై నుంచి అంతా చూస్తాను లే..కంగారు పడకు. నీకు సంపూర్ణ ఆయుష్షు ఉంది. నీ జీవితం చాలా బాగుంటుంది...డబ్బు, పేరు, అర్ధం చేసుకునే భార్య అన్నీ ఉంటాయి..నేను చెప్పినట్టు చెయ్యి అంతే ..!


ఓకే...బై..ఎంజాయ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్..


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలుతాత మోహనకృష్ణ




50 views0 comments
bottom of page