top of page

మిస్టర్ మానసిక రోగి
 'Mister Manasika Rogi' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 09/12/2023

'మిస్టర్ మానసిక రోగి' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఒక వ్యక్తి తాను కష్టపడిన సొమ్ముతో ధానదర్మాలు చేసి పేదవారికి అండగా ఉంటే ఆ వ్యక్తి ఇంటిమీద ప్రభుత్వాలు సీబీఐ, ఈడి దాడులు చేస్తుంది. 


ఒక ట్రాఫిక్ పోలీసు రద్దీ జంక్షన్ వద్ద అంబులెన్స్ కి బదులు సియం కాన్వాయ్ ని రెండు నిమిషాలు ఆపినందుకు అతడిపై సస్పెన్షన్ వేటు. 


ఒక పోలీసు అధికారి ఎలక్షన్స్ డూటిలో అధికార పార్టీ నాయకుల వాహనాల్లో తనిఖీ చేసినందుకు అతడి పై బదిలీ వేటు. 


ఇలా మనం ఎప్పుడూ పత్రికలలో చూస్తుంటాం. 


గ్వాలియర్ జమిలి ఎన్నికలు కాస్తా ఉత్కంఠగా, కోట్లాటలు గొడవలు మధ్య కష్టతరంగా ముగిసింది. 


ఓట్లు లెక్కింపు అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లును ఇద్దరు డిఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. 


ఆ సమయంలో రోడ్డు పక్కన ఓ బిచ్చగాడు చలిలో వణుకుతూ హాహాకారాలు చేస్తుండటం చూసి అక్కడికి వెళ్ళారు. ఆ బిచ్చగాడు దృఢమైన, కండలు తిరిగిన శరీరం కలిగి ఉన్నాడు. 


అందులో ఓ అధికారి తన చేతి గ్లౌస్ లు బూట్లు, ఇవ్వగా.. !

రెండో అదికారి తన స్వెటర్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. 


ఇంతలో ఆ వ్యక్తి వాళ్ళని పేరు పెట్టి పిలిచి 

"ధన్యవాదాలు" అన్నాడు. 


అది విని ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుని మరలా బిచ్చగాడి వద్దకు వెళ్ళారు. అతడి చేష్టలు, మాటలు చూస్తుంటే బిచ్చగాడు కాదు. ఒక మానసిక రోగిలా కనిపించాడు. 


అయినా.. ! 

డిఎస్పీ హోదాలో ఉన్న తమ పేర్లు సామాన్యులకే అంతగా తెలియదు. మరీ ఈ మానసిక రోగికి ఎలా తెలిసింది.. ? అనే ప్రశ్న వారికి ఆలోచింపజేసింది. 


తమ సిబ్బంది, మరియు వైద్య సిబ్బందితో ఆ మానసిక రోగిని స్నానం చేయించి నూతన వస్రాలు ఇప్పించి, జుట్టు, గడ్డాంను కత్తిరించగా ఆ ఇద్దరు అధికారులకు గుండెలు పిండేసినట్లు అయింది. 


తేరుకుని అతడికి సెల్యూట్ చేశారు. 

మిగత వారికి ఏమి అర్థం కాక అలా చూస్తుండిపోయారు. 


ఆ ఇద్దరు డిఎస్పీలు, గౌడ్ ని చూస్తూ.. తమ గతాన్ని తలుచుకుంటు కన్నీరు పెట్టుకున్నారు. మన దేశంలో నీతి నిజాయితీతో పని చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. 

అలాంటి వారి లో భూపేంద్ర గౌడ్ ఒకరు. 


మధ్యప్రదేశ్ పోలీసు విభాగంలో 1999 బ్యాచ్ కి చెందిన వారిలో భూపేంద్ర గౌడ్, రత్నేష్ కుమార్, వాల్మీకి బదౌరియాలు కూడా ఉన్నారు. 

అందులో గౌడ్ ట్రైనింగ్ నైపుణ్యంలో ఎక్కువ మార్కులు సాధించాడు. 


అసలు గౌడ్ కి ట్రైనింగ్ అంటేనే ఒక ఆశ. అతడు చిన్నప్పటి నుండి పోలీసు కావాలని నిజాయితీతో పని చేసి తన సామార్థ్యంతో పదిమందికి సేవ చేయాలని కలలు కన్నాడు. కాబట్టే శిక్షణ సమయంలో కష్టం అనకుండా ఇష్టంతో శిక్షణ పూర్తి చేసిన ఘనుడు భూపేంద్ర గౌడ్. 

అక్కడితో ఆగక ఎన్నో ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ లకు నాయకత్వం వహించి సమర్ధవంతంగా నడిపి విజయం సాదించిన ధీరుడు. 


గొప్ప ధైర్యం, మొక్కవోని పట్టుదల గౌడ్ సొంతం. అతను ఈ ఉద్యోగం కోసమే తన శరీరాన్ని ద్రుడంగా మార్చుకున్నాడు. 

శరీర దారుడ్యంలోనే కాదు.. , మేథాశక్తిలోను అతనికి ఇంకెవరు దరిదాపులోకి రారు. అంతటి తెలివితేటలు భూపేంద్ర గౌడ్ కే సాద్యమయ్యాయి. 

 

తన బ్యాచ్ కి తానే ఒక మార్గనిర్దేశకుడిగా నడిపాడు. 

రత్నేష్ కుమార్, వాల్మీకి బదౌరియా, గౌడ్ ఒకే రూం లో బస చేసిన మంచి స్నేహితులు. 


గతంలో ఈ ముగ్గురు ఎన్నో కేసులు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. 


 నిజాయితీగా పని చేయటం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని వ్యక్తి గౌడ్. ఈ విషయంలో అతని స్నేహితులు వెనక్కి తగ్గినా తాను నిజాయితికే కట్టుబడి పనిచేశాడు. 


ఒకనొక దశలో దేశంలో బెస్ట్ డిఎస్పీ గా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. 


అతని పేరు ఎన్నో పత్రికలలో, చానల్స్ లో వస్తుంటాయి. 


ఒకరోజు 

స్వయంగా అధికార పార్టీ నాయకుడు 

ఓ పోలింగ్ బూత్ వద్ద ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు అని దగ్గర ఉండి చూస్తుండటంతో సమస్యాత్మక ప్రాంతం కావటంతో అక్కడే డీఎస్పీ గా విదుల్లో ఉన్న భూపేంద్ర గౌడ్ అతడిని చట్టం ప్రకారం అరెస్టు చేసినందుకు గౌడ్ ని లక్ష్యంగా చేసుకుని పీక్కుతిన్నారు పార్టీ నాయకులు. 


అతడికి రకరకాల సమస్యలు స్రుష్టించి మానసిక వేదనకు గురిచేశారు. 


ఒకప్పుడు గౌడ్ ని పొగుడుతూ వ్రాసిన పత్రికలు, చానెల్స్ ఇప్పుడు రాజకీయ పార్టీలుకు అమ్ముడుపోవటంతో గౌడ్ ఒక మానసిక రోగని ముద్ర వేసి ఒకప్పుడు డిఎస్పీ ఇప్పుడు మిస్టర్ మానసిక రోగి అంటూ లోకానికి కొత్తగా పరిచయం చేశాయి. 


అలా గౌడ్ ని ఎంతో మనోవేదనకు గురిచేసి ఉద్యోగం చేసే సత్తా అతడిలో లేదని వైద్యులతో సర్టిఫికెట్ ఇచ్చేలా చేయటంతో కుటుంబ సభ్యులు కూడా అతడిని పట్టించుకోక ఈ పరిస్థితికి వచ్చి ఉంటాడని ఆ ఇద్దరు అధికారులు అయిన రత్నేష్ కుమార్, వాల్మీకి బదౌరియాలు గతాన్ని నెమరు వేసుకుని అక్కడ ఉన్న సిబ్బందికి గౌడ్ ని పరిచయం చేశారు. 


తమతో రావాలని గౌడ్ ని ఆ అధికారులు కోరారు కానీ అందుకు గౌడ్ నిరాకరించాడు. ఎందుకంటే ఆయనకు ఈ పరిస్థితిని తెచ్చిన వాళ్ళను ఎదురించలేదు. ఉద్యోగాలు ఊడిపోతాయనే భయంతో కనీసం గౌడ్ కి మద్దతుగా నిలవలేదు. 


అయినా.. గౌడ్ ని, ఆయన నిజాయితీని, ఆయన శక్తి సామర్ధ్యాలను వాళ్ళు ఎన్నటికీ గౌరవించాల్సిందే. ఎందుకంటే తాము చేయలేని పని గౌడ్ చేశాడు కాబట్టి. అందుకే ఆయన్ని స్వర్గ్ సదన్ అనే ఆశ్రమానికి పంపించారు. 

అంతేకాకుండా అక్కడ ఆయన తిరిగి సాధారణ మనిషి లా మారి తమ భార్య బిడ్డలతో సాధారణ జీవితం గడపటానికి తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 


నిజంగా రత్నేష్ కుమార్, వాల్మీకి బదౌరియాల్లా అదికారులకు, నాయకులుకు లోబడి పని చేస్తే గౌడ్ కూడా ఈరోజు తన కుటుంబంతో ఎంతో చక్కగా జీవితం అనుభవించేవాడు. కానీ.. 

తన శరీరం పై ఉన్న యూనిఫామ్ కి, తమకు నమ్ముకున్న ప్రజలకు, న్యాయం చేసి, చట్టానికి లోబడి పనిచేసి బతికుండగానే తన జీవితాన్ని కోల్పోయాడు గౌడ్. 


నీతి నిజాయితీతో పని చేసేవాళ్ళు కావాలని కోరుకునే ఈ సమాజం అలాంటి వాళ్ళని కాపాడుకోలేకపోతుంది. 

మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. 


దేశంలో నిజాయితీగా పని చేసేవాళ్ళు అనేకమంది ఉన్నారు. కానీ.. వాళ్ళు గౌడ్ లా తమ జీవితాలను పణంగా పెట్టలేక పార్టీలుకు, నాయకులుకు లొంగిపోతున్నారనేది జగమెరిగిన సత్యం. 


అలా లొంగకుండా ఎదురించిన కొద్దీ మంది పరిస్థితి గౌడ్ లాగానే ఉంటుందనే విషయం కూడా నమ్మదగినదే. 

ఇప్పుడు గౌడ్ మరలా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మిస్టర్ మానసిక రోగి ఒకప్పుడు డిఎస్పీ. 


గౌడ్ మరలా యధాశక్తిని పొందాలని అందరం కోరుకుందాం అవినీతిని తరిమికొడదామని. 

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


30 views0 comments

Commentaires


bottom of page