top of page
Writer's pictureNeeraja Prabhala

కల్యాణమొచ్చినా కక్కొచ్చినా



'Kalyanamochhina Kakkochhina' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 25/03/2024

'కల్యాణమొచ్చినా కక్కొచ్చినా' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


కృష్ణయ్య  తన  ఏకైక  కొడుకు  చైతన్య, భార్య  సుమతితో  సంతోషంగా  ఉంటున్నాడు. తండ్రి ఇచ్చిన  వందెకరాల  పొలము, ఊరులో  ఇళ్లకన్నా  ఎత్తైన  పెద్ద డాబా, విలాసవంతమైన  జీవితాన్ని  గడుపుతూ  ఊరిలో  పెద్దమనిషిగా  చెలామణి అవుతున్నాడు.  చైతన్య  చక్కగా  చదివి  పట్నంలో  మంచికంపెనీలో  ఉద్యోగం  చేస్తున్నాడు. 


పిల్లికి  కూడా బిచ్చమెయ్యని  మనస్తత్వం  కృష్ణయ్య  దంపతులది.  వాళ్లకు  ఎంతసేపూ  తమ ఆస్తులు, అంతస్తులే  లోకం. దేవుడు, దైవము  ఇలాంటివి  ఏమీ పట్టవు.  ఊరివారందరికీ  వాళ్ల  మనస్తత్వం  తెలిసి కూడా  ధనవంతుడని  గౌరవంతో  ఉండేవారు. ఎవరన్నా  ఆయన  మాటలని  వ్యతిరేకిస్తే. వాళ్లమీద  పగబట్టి  వేదించేవాడు. అందువలన  గ్రామస్తులు  ధనవంతులతో తమకు  విరోధమెందుకని  మిన్నకుండిపోయేవారు. అందువలన  ఆఊరిలో  ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా  అయ్యేది. అది  అలుసుగా  తీసుకుని  ఊరిలో అందరిమీద   తన అజమాయిషీ  చెలాయించేవాడు  కృష్ణయ్య.


కొన్నాళ్ల తర్వాత  చైతన్యకు  చాలా  పెళ్లి సంబంధాలు  వచ్చాయి.  ధనాశ, మితిమీరిన కోరికలతో  తమ కొడిక్కి  వచ్చిన సంబంధాలను  తిరస్కరించేవాళ్లు  కృష్ణయ్య దంపతులు.  తల్లితండ్రుల  మాటను  ఎదిరించే  మనస్తత్వం  కాదు  చైతన్యది. 


రెండుమూడు  సంవత్సరాల  తర్వాత  చైతన్య కు  పెళ్లిసంబంధాలు  రావడం  మానేశాయి. చూస్తూండగానే  చైతన్యకు  పెళ్లి వయసు  దాటిపోయింది. ఏ బీదపిల్లనో  కోడలిగాచేసుకోమన్న   బంధువుల  సలహాని తిరస్కరించారు  కృష్ణయ్య దంపతులు.


  కాలం  వేగంగా  సాగుతోంది.  కొన్ని సంవత్సరాలతర్వాత  కృష్ణయ్య దంపతులు  వృధ్ధులయ్యారు.  కాలక్రమేణా  ఒకరితర్వాత  మరొకరు  ఏడాది వ్యవధిలో  కాలం చేశారు. జరిగిన దారుణాలకు  చైతన్య  చాలా వ్యధ చెందాడు.  మరో  ఏడాది తర్వాత  చైతన్యకు ఒక ప్రమాదంలో  చాలా తీవ్రంగా దెబ్బతగిలింది.   అతను హాస్పిటల్  పాలయ్యాడు. డాక్టర్లు  అతనికి చికిత్స చేసి  బ్రతికించారు. కానీ  అతను  సంసారజీవితానికి పనికిరాడని  తేల్చి చెప్పారు.  ఒకవేళ అతను  వివాహం  చేసుకుంటే  అతను చనిపోయే ప్రమాదముందని  స్పష్టంగా  హెచ్చరించారు. 


రోజులు గడుస్తున్నాయి. ఒకరోజున  తనకు తెలిసినవాళ్లమ్మాయి  వకుళని   పెళ్లిచేసుకున్నాడు. ఆస్తిపరుడే భర్తగా  రావాలనే కోరికతో  నలభై సంవత్సరాలు వచ్చినా   వకుళకు  పెళ్లికాలేదు. కానీ  “కల్యాణం  వచ్చినా, కక్కొచ్చినా  ఆగదు” అన్నట్లుగా  చైతన్యకు   వకుళతో  వివాహం జరిగింది.  


విధిరాత   తప్పదన్నట్లుగా  పెళ్లైన  నెలరోజుల  వ్యవధిలోనే  చైతన్య  విగతజీవయ్యాడు.  డాక్టర్ల  హెచ్చరికని  పెడచెవిన  పెట్టి  పెళ్లిచేసుకున్న  కారణంగా  అతను తన  విలువైన  జీవితాన్నే  కోల్పోయాడు. ఆస్తి అంతా  వకుళ  హస్తగతమై  విలాసవంతమైన  జీవితం  గడుపుతోంది  వకుళ. 


కల్యాణమొచ్చినా , కక్కొచ్చినా  ఆగదు కదా!


   ….సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


Video link

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




66 views0 comments

Σχόλια


bottom of page