top of page

కన్నతల్లి వేదన - రోదన - ఆవేదన

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #KannatalliVedanaRodanaAvedana, #కన్నతల్లివేదనరోదనఆవేదన


Kannatalli Vedana Rodana Avedana- New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 30/05/2025

కన్నతల్లి వేదన - రోదన - ఆవేదన - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


నిర్భాగ్యురాలినైన  నన్ను  అనాధని  చేయడం  న్యాయమా?

ఏం పాపం  చేశానని  కన్నతల్లితో  బంధం  తెంచుకోవడం  ధర్మం?

చెట్టున  కాచిన  కాయలలో ఒక కాయ కాకపోతే  మరొక  కాయ  అన్నా  మంచిగా  ఉంటాయని  ఆశిస్తామే!

తల్లి  తన పిల్లలలో  ఏదో  ఒక  బిడ్డకైనా  తనపై   ప్రేమ ఉంటుందని ఆశించడం  తప్పా? 

జీవితంలో  ఎన్నోకష్టాలకోర్చి, అంతులేని బాధలు పడి  తనువు చాలించకపోవడం  ఆమె చేసిన  ద్రోహమా?

పిల్లలే  తన ప్రాణం‌, లోకమని  బ్రతకడం  నేరమా?

నిర్వాసితురాలైన  ఆ తల్లి  కనీసం పలకరింపుకు  కూడా  నోచుకోలేదా?

ధనవంతురాలైతే  ఆ తల్లి  మీ ప్రేమాదరణలకు  నోచుకునేదేమో!

కన్నతల్లి  ఇన్నేళ్లు  మీపై  చూపిన ప్రేమ గుర్తుకురావట్లేదా?

ఇప్పటికీ  ఆ పిచ్చితల్లి  ప్రేమను  తుంచుకోలేక  మానసిక  వ్యథని ఆనుభవిస్తోందే!

పేగుబంథమంటే  అదే మరి!

జీవి బ్రతికి ఉండగానే  కదా! ఈ పలకరింపులు, ప్రేమలు.

దివికేగిన  అమ్మా, నాన్నలు   రమ్మంటే  నాకు  రారు కదా!

బ్రతికుండగానే  ఈ తల్లిని  జీవఛ్ఛవంగా   చేయడం  ధర్మమా?

దైవం  మీద  భారం  వేసి  బ్రతుకు మీద  చిరుఆశతో  కాలం  వెళ్లదీస్తున్న నిర్భాగ్యురాలైన తల్లి.   




-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page