కన్నతల్లి భాష కలుషిత పరుచకు
- Sudarsana Rao Pochampalli
- Jan 30, 2024
- 1 min read

'Kannathalli Bhasha Kalushitha Paruchaku' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 30/01/2024
'కన్నతల్లి భాష కలుషిత పరుచకు' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
తల్లియె నేర్పిన భాషను
ముల్లియ లాగను దలచుచు ముదముతొ బలుకన్
ఎల్లెడ లనగను కీర్తియు
ఉల్లస మొందుగ మనిషికి ఉత్తమ మనగన్
అమ్మా ఓ అమ్మా మా తల్లీ
నిను అమ్మీ మమ్మీ అనలేనమ్మా
తెలుగును వదిలి తెగులును తగిలీ
మలినముతో నే నిక మనలేనమ్మా
ఓంకారోద్భవ బీజాక్షరాలె
ఓనమాలుగ దిద్దితినమ్మ
అక్కా చెల్లెలు అన్నా తమ్ముల
పరభాషలో పలుకుట యేలా
పవిత్ర భావం వదులుట యేలా
కోయిల గొంతులో కోమలమెంతో
తెలుగు భాషలో తినలేనంత తీయదనం
మధుర మంజుల మనోజ్ఞ మై
అధరాలదిరే లాస్య విలాసమై
అమృత బిందువులలదుకొని
అక్షర రూపం దాల్చి జన
కుక్షినింపిన చెప్పన్నాక్షర చేవ
రక్షణ కాదా జన సమ్రక్షణ కాదా
అమ్మా ఓ అమ్మా మా తల్లీ
నిను అమ్మీ మమ్మీ అనలేనమ్మ
సుదర్శన రావు పోచంపల్లి
Comments