కాంతి కిరణాలు - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna
- Aug 2
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KanthiKiranalu, #కాంతికిరణాలు, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "కాంతి కిరణాలు" పుస్తకావిష్కరణ అనంతపురంలో
Kanthi Kiranalu - Book Unveiling ceremony At Ananthapur - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 02/08/2025
కాంతి కిరణాలు - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త బాలబంధు డా. గద్వాల సోమన్న రచించిన "కాంతి కిరణాలు" పుస్తకావిష్కరణ జిల్లా కేంద్ర గ్రంథాలయ సమావేశ మందిరం, అనంతపురంలో ఘనంగా జరిగింది. తెలుగు వెలుగు సాహిత్య సామజిక సేవా సంస్థ 5వ వార్షికోత్సవం సందర్బంగా రచయిత, ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శలు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ జనప్రియ కవి శ్రీ ఏలూరి వెంగన్న, కవి, సాహిత్యవేత్త డా. పొట్లూరి హరికృష్ణ, ఆ సంస్థ అధ్యక్షులు టి. వి. రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అమరనాథ రెడ్డి గారల మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద పుస్తకావిష్కరణ చేసి, పరిచయం చేయడం విశేషం. అనంతరం ఈ పుస్తకాన్ని టి. వి. రెడ్డి దంపతులకు అంకితమిచ్చారు. అత్యల్ప కాల వ్యవధిలో 76 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి రవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులూ, తెలుగు వెలుగు సంస్థ కార్యవర్గము మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. 'కాంతి కిరణాలు 'కృతికర్త గద్వాల సోమన్నను పాఠశాల హెడ్మాస్టర్ ఏ. జాన్సన్, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు అభినందించారు.
-గద్వాల సోమన్న
Comments