top of page

కార్మిక లోకం

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #కార్మికలోకం, #KarmikaLokam

ree

Karmika Lokam - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 01/05/2025

కార్మిక లోకం - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


కాసుల తోనే పని అనే చోట 

మనసు పెట్టి మనుగడ కోసమే

కని వినీ ఎరుగని కష్టాలైనా  

కలకాలం మాతోటే గడపడం కోసమే అన్నట్టుగనులలో గండా లతో, కొండలలో బండ లతో,

పొలాల్లో పొలిమేరల్లో 

పడ్డ శ్రమ కు  పంచుకునే  

మంచే లేక వంచనతో వంగిన నడుముకి

వoచిన ఇనుప కడ్డీల దెబ్బలు గుర్తులుగా

,మోసిన ఇసుక బస్తాలు వీపులు రాపిడుల మచ్చలుగా

చిందిన రక్తపు చమటలు మరకలు గా, కరిగించిన కండలు కడ్డీ లే కర్షకుల, కార్మికుల ఆస్తి పాస్తులు

స్వార్థం వంటికి సుగంధ ధన స్వప్నాలు

కరుణతో రుణం తీర్చు కుని కళ్ళను పొడిచిన  కర్కశ బాకులు


ఉరుకులతో ఉన్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుందని ఉత్తుత్త వేతనాలు తో  ఉరి కంబాలు

ఉన్న ఊరిని విడిచి ఉనికినే మరిస్తే నమ్ముకున్న వాళ్ళు నష్ట జాతకులు

ఉద్యమం తెలియని వలస

 కార్మికుల పైన  ప్రభుత్వం   

పట్టించుకునే  ఆ చూపుల  తీరు 

కార్మిక, కర్షక కార్మికులకు కంటినీరు


***

ree

-యశోద గొట్టిపర్తి





Comments


bottom of page