కాస్త సమయం
- Yamini Rajasekhar
- May 31
- 3 min read
#YaminiRajasekhar, #KasthaSamayam, #కాస్తసమయం, #యామినిరాజశేఖర్, #TeluguStories, #తెలుగుకథలు

Kastha Samayam - New Telugu Story Written By Yamini Rajasekhar
Published In manatelugukathalu.com On 31/05/2025
కాస్త సమయం - తెలుగు కథ
రచన: యామిని రాజశేఖర్
ఓ పక్క పరుగులతో వంట పని, మరోపక్క పిల్లలకు బాక్సులు పెట్టడం, భర్తకు అన్ని సర్దడం, ఇంట్లో అన్ని సాయంత్రానికి వచ్చేసరికి సమకూర్చుకోవడం అనుకుంటూ గడియారం వైపు చూస్తుంది నవ్య...
"అమ్మో! ఈ సమయం ఇట్టే అయిపోతుంది," అని పరుగులు తీస్తుంది. అనుకున్న విధంగానే మెట్రో దగ్గరికి వచ్చేస్తుంది.
"నిమిషంలో రాబోతుంది మీరు ఎక్కాల్సిన రైలు," అని వినిపిస్తూ ఉంటుంది.
"ఇక నాకు ఈ రోజు కూడా చివాట్లే," అనుకుంటూ కరెక్ట్‌గా వచ్చి బండి ఆగుతుంది.
"ఎక్కడ కూర్చుందో రోజు ఒక దగ్గర ఎక్కమని చెప్తుంది. ఈరోజు మరి ఇక్కడే ఉందో, తాను ఎక్కడుందో," అనుకుంటూ ఎక్కుతుంది. ఎదురుగుండా చరిత కనిపిస్తుంది…
"హమ్మయ్య! నన్ను రక్షించావు కదవే!" అంటుంది నవ్య.
"మళ్లీ యధాప్రకారం చెప్పదలుచుకున్నావా? కాస్త ముందుగా రావచ్చు కదా!”
“ఏం చేద్దాం, పనులు సరిపోతున్నాయి, నీవా గబగబా పరుగులు తీస్తావు, ఏదో ఉన్నది సర్దుకుంటానంటావు, నాకు అలా కుదరదు కదా?" అంటుంది.
రోజు చెప్పేది — "మనిద్దరికీ కాస్త సమయం దొరికేది దీంట్లోనే కదా!" అనుకుంటూ ఇద్దరూ ఇక తమ ఊసుల్ని మొదలు పెట్టుకుంటారు.
మెట్రో ప్రయాణంలో అలా ఒక్కొక్క గమ్యంలో ఎంతో మంది దిగిపోతుంటారు.
“ఏదేమైనా కానీ, నవ్య.. ఎంత బాగుందో మనం ఇలా మాట్లాడుకుంటుంటే! ప్రతిరోజూ కనీసం క్షణమైనా తీరిక లేకుండా గడిచిపోతుంది మన జీవనం. ఇలాగైనా మాట్లాడుకుంటే కలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పు! చిన్న నాటి నుంచి కలిసిమెలిసి చదువుకున్నాం మనం!" అని అంటుంది.
ఇంతలో చరిత — "అవునే, కరెక్టే! ఇలాగే మనం మాట్లాడుకోవడానికి సమయం దొరికింది... లేకపోతే కలవటానికి ఓ ప్రణాళిక వేసుకోవాలి... అన్ని సమకూర్చుకోవాలి... అవునా కాదా?"
"అవును నవ్య!" అని చరిత అంటుంది.
"ఏమంటున్నారు మా అన్నయ్య గారు?" అని చరిత నవ్యని అడగడంతో...
నవ్య — "ఏమీ? అన్నయ్య మీద ఇలా ప్రేమ? అయ్యో, అదేమీ లేదు! రోజు మనం ఇలా కలుస్తున్నాం కదా! అన్నయ్య, మా ఆయన ఎప్పుడూ కలుస్తారో!" అని నవ్వుతుంది…
"ఈ రైలు ఇలానే వెళ్తూ వుంటే... మనం ఇంకా ఎక్కువ సేపు గడపవచ్చు... ఎంత మాట్లాడుకున్నా, అప్పుడేనా అనిపిస్తుంది!"
ఇద్దరూ చెరో దగ్గర దిగిపోతారు. ఆఫీస్ పనిలో పడిపోవటం... తిరిగి ఎవరి పాటికి వాళ్ళం సాయంకాలం ఇల్లు చేరతాము... అని ఇద్దరూ ఎంతో సేపు సమయం మర్చిపోయి... ఒక్కో దగ్గర దిగుతారు…
సరే అని అక్కడ ఏ రోజు కారోజు... రోజు మాట్లాడుకునే విషయాలు అయినా కూడా ఏరోజూ కూడా మనసులోని భావాలు చెప్పుకుంటూ వారిదైన లోకంలో అన్నింటినీ మరిచిపోతారు అక్కడే... ఇలానే కలుసుకుని ఉందాం జీవనమంతా ఇలా...
ఇంతకు మించిన ఆనందం ఇంకేం కావాలి... జీవనమంతా మనం ఇలానే గడుపుదాం అని నవ్య, చరిత ఎంతో ఆనందంగా గడిపేస్తారు వారి వారి సంతోషం... సమయాన్ని…
నీతి: ఇరు మనసులు కలిసిన రోజున పంచుకునే ఆనంద క్షణాలు...
***
యామిని రాజశేఖర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు యామిని కోళ్ళూరు ....చదువు ఎం.ఏ ...ఎంఫిల్...
నా చదువు మొత్తం తెలుగు మాధ్యమంలో లోనే జరిగింది....
నా అక్షరమే నాలో నింపేను ఉత్సాహంనా అక్షరమే ఆయుధం నా రచనలకు స్ఫూర్తి దాయకం....
గత నాలుగు సంవత్సరాలుగానేను సాహితీ సమూహాల్లో కవితలు,,, వ్యాసాలు....,కథలు,,,రాయటం.... సమీక్షలు చేయటం....పలు సన్మానాలు,,,,ప్రశంసా పత్రాలు అందుకొన్నాను ..... కొన్ని సదస్సులో.... ఐదవ తెలుగు ప్రపంచ సదస్సులో ...అంతర్జాల సదస్సులో పాల్గొన్న,,, నిత్య విద్యార్థిని..... ఇంకా భాష గురించి నేర్వాల్సింది చాలా వుంది.......నేను ఇలా ఈ స్థానంలో వున్నానంటేనాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి,,,, గురువులు...రక్తసంబంధీకులు,,,మావారు,,,,, పిల్లలు.... సాన్నిహిత్యాలు వీరి వెన్నుదన్నే కారణం....
ఎందరో కవులు కవయిత్రులు నుంచి కూడాఎంతో తెలుసుకోవాలి....
ఇంకా బాగా రాయాలి......నా లక్ష్యం ఆశయం నేను చేరుకోవాలి....
ప్రస్తుతానికి ఇదే నా గురించి....ధన్యవాదాలు
యామిని కోళ్ళూరు ✍️
Comments