top of page
Original.png

కవి కావ్యం

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #KaviKavyam, #కవికావ్యం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Kavi Kavyam - New Telugu Story Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 23/09/2025

కవి కావ్యం - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


నిశ్శబ్దంగా ఉండాల్సిన ఇల్లు ఈరోజు చాలా గోలగోలగా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పిల్లల్ని పడుకోబెట్టి నాకోసం ఎదురు చూస్తూ కూర్చునే శ్రీమతి.. 


ముందు గదిలో రెండు మంచాలపై అమ్మానాన్న పడుకుని నిద్ర పట్టక దొర్లుతూ ఉంటారు. శబ్దం కాగానే అమ్మ లేచితలుపు తీసి ముఖంలోకైనా చూడకుండా వెంటనే పడుకునే అమ్మ.. 


ఆలోచిస్తూ.. త్వరగా ముందు గదిలోకి అడుగు పెట్టాడు సుధీర్. 


"హ్యాపీ బర్త్డే రిద్ధీ" అంటూ చుట్టూ ఉన్న పిల్లలు క్లాప్స్ కొట్టుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 


కేక్ కట్ చేస్తున్న కూతురు దగ్గరికి వెళ్లి, చిట్టి తల్లీ నేను మర్చి పోయాను.. "హ్యాపీ బర్త్డే టు యూ రిద్ధీ " అని కేక్ నోట్లో పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టాడు సుధీర్. 


“చాలాసేపటి నుండి నీకోసం ఎదురు చూశాం డాడీ.. ఇప్పుడా వచ్చేది?’ అని కోపంగా చూచింది. 


“అవును అమ్మలు.. పనిలో పడి మర్చిపోయాను.” 


“పెదనాన్న వచ్చి కేక్ తెచ్చి దగ్గరుండి కేక్ కట్ చేయించాడు డాడీ..”

 

“అన్నయ్య! థాంక్స్" అని, “అనుకోని మీటింగు వల్ల రాలేక పోయాను. ఆఫీస్ ఆవర్స్ లో మీటింగ్ అయింది.. కానీ ఆఫీస్ అటెండర్ అమర్ సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అలా క్షణంలో ఏం జరిగిందో కూడా తెలియలేదు. చూడడం తప్ప మాట్లాడలేకపోతుంటే, వెంటనే అతన్ని నా కారులో హాస్పిటల్కు తీసుకువెళ్ళాను.”

 

“సరే. ఎలా ఉందిరా? డాక్టర్స్ ఏమంటున్నారు?” అనగానే, 

“వెంటనే అన్ని పరీక్షలు చేసి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై, దాంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని స్కానింగ్ కి పంపించారు. రిపోర్ట్ రావాల్సి ఉంది. 


ట్రీట్ మెంట్ చేయగానే ప్రస్తుతానికి మాట్లాడుతున్నాడు. నేను ఫోన్ చేసి ఇంట్లో వాళ్లకు చెప్పాను. బంధువులతో సహా అందరూ వచ్చారు. నేను వాళ్లకు ధైర్యం చెప్పి డాక్టర్స్ తో మాట్లాడి అక్కడే ఉంటాను” అన్నాను. 


‘ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారండి మీ కోసం, టెన్షన్ పడుతారు వెళ్లండి’ అన్నారు.” 


“అవునా డాడీ! నువ్వు ఒక నిండు ప్రాణాన్ని సేవ్ చేశావు. నాకు ఏమి కోపం లేదు. మమ్మీ తో అందరూ ఉన్నారు. నేను బిగ్ గర్ల్ అయిన తర్వాత నీలాగే చేస్తాను. మన పిల్లికి దెబ్బ తాకితే నేను కట్టు కట్టాను. అది నన్ను ఎంతో ప్రేమతో చూస్తుంది. నిన్ను కూడా అమర్ అంకుల్ మంచి వాడివని, తనను కాపాడి నావని, ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాడు డాడీ నువ్వు గ్రేట్..” 


“మనం చేసిన మంచి మనం లేకపోయినా మిగిలితే చాలమ్మా! మనల్ని గుర్తించక పోయినా మనము ఎప్పటిలాగానే ఉండాలి. నేను కొంత డబ్బు నా అకౌంట్ నుండి ఇచ్చి వస్తానమ్మా. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లాలి త్వరగా నిద్రపోమ్మా!”


“నాకు గవర్నమెంట్ స్కూల్ ఇష్టం లేదు. కాన్వెంట్ స్కూల్ కి వెళ్తాను.” 

 

“మాతృభాషలో విద్యా భ్యాసం జీవిత విలువలను నేర్పిస్తుందమ్మా! మన విద్యా వ్యవస్థ గొప్ప చరిత్ర, సoస్కృతిని కలిగి ఉంది. విద్య కేవలం డబ్బు సంపాదిoచడానికి మాత్రమే కాదమ్మా! సంస్కారాన్ని కూడా నేర్పాలి.”

 

“అక్కడ పేదవాళ్లు, పరిశుభ్రత పాటించడం లేదునాన్నా.”

 

“అందరూ కాదు కదా, కొందరే అలా ఉన్నారు కదా! అందరూ మనలాగే అనుకుంటే విద్యావ్యవస్థ కుంటుపడిపోతుంది. రేపు నేను వస్తాను నీతో.. వాళ్ళలో మార్పుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెప్పి వాళ్ళ స్థితిగతులు ప్రభుత్వ దృష్టికి తీసుకవద్దాము. రెండు రోజుల్లో దసరా సెలవులు వస్తున్నాయి. పాఠశాల తెరిచిన తర్వాత వాళ్ల బీదరికాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేద్దాం.”

 

“ఏంటండీ.. ఆ చిన్న ప్రాణానికి స్వేచ్ఛ.. చదువు నేర్పించాలి అనుకున్నాను.. కానీ హై స్కూల్ కి వచ్చేసింది. దాని మనసులో బాధలు, ఆందోళన, ఆలోచనలు రేకెత్తించే సమస్యలను దృష్టికి తెస్తున్నారు. వాటిని పరిష్కరించాలంటే మనవల్ల ఏమవుతుంది? ప్రభుత్వ పరంగా జరగాలి.”

 

“ప్రజలే ప్రభుత్వం సుశీలా! ‘ఉడత సాయంతో సేతువు కట్టినట్లు’ చిన్నఆశయం చైతన్యస్పూర్తి. ఉద్యమ నాయకులు మనకేం అనుకుంటే, మనం కూడా ఈ స్థితిలో ఉండే వాళ్ళం కాదు” అని వెనకకు తిరగగానే అమర్ వచ్చి, కాళ్ళకు దండం పెడుతుంటే, 

“అది ఏంటి అమర్ ! అంతా దేవుని దయ. నేను చేసింది ఏమీ లేదు. సమయానికి నేను హాస్పిటల్ తీసుకెళ్లాను అంతే..”

 

“మీరే నాకు దేవుడు సార్!”


“నువ్వు సంతోషంగా ఉంటే చాలు రెస్ట్ తీసుకో” అంటూఇంట్లో దింపేసి వచ్చాడు. 

*****

తండ్రి సుధీర్ కూతురు వెంట వెళ్లాడు. “పరిశుభ్రత లేకుండా ఉండే వాళ్ళు చూపించమ్మా” అనగానే, గాలింపు చూపులు చూసి.. “ఎవరు లేరు నాన్న” అని తెల్ల ముఖం వేసింది. 


మేమే అంటూ పదిమంది పిల్లలు లేచి నిలబడి, “రిద్ధీ చెప్పింది నిజమే. ఆమె చదువులో ఫస్ట్, వినయ విధేయతలో బెస్ట్ అని టీచర్స్అందరూ మెచ్చుకొని, మమ్మల్ని మాత్రం మీరు ఎంత చెప్పినా మారరురా! అని బడితె దెబ్బ లేసినా మేము మారలేదు. 


మీ అమ్మాయి మాత్రం అవేమీ పట్టించుకోకుండా మాతో కలిసి ఉంటూ మాకు తెలియని అర్థం కాని పాఠాలను నేర్పుతుంది. చదువు మీద ఆసక్తి వచ్చింది.. 


కానీ పరిశుభ్రత పాటించట్లేదు.. మేము.. అయ్యా!” అని ఇద్దరు వ్యక్తులు వచ్చి, “కారణం మాకు నీళ్లు ఉండవయ్యా, చుట్టూ చెత్తాచెదారం. ప్రజా నాయకులువచ్చి చూసి పోతారు.. కానీ మా సమస్యలు అలానే ఉన్నాయి. 


సాదాసీదాగా పంచె, లాల్చీ భుజాన చేతి సంచితో నిత్యం మా కష్టాలకు స్పందించి, అధికారులతో వచ్చి తన కవిత్వంతో రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటూ మురికివాడల నివాసుల గురించే శ్రద్ధ తీసుకొని మా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ శుభ్రం చేయించాడు. ఆయన గత కొన్నేళ్లుగా ఇలాంటి సమాజ సేవకే తమ జీవితం అంకితం చేశాడట.”

 

“ఎక్కడున్నారూ చూద్దాం” అనగానే “ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ పదండి వెళ్దా”మంటే దగ్గరికి వెళ్లారు. 


“నాన్నగారూ మీరా! మీకోసం మేం వెతకని చోటు లేదు. ఇంటికి రండి. " అని సుధీర్ అంటున్నా.. 

"నన్ను పుట్టుక నుండి మరణం వరకు కదిలించే పేద ప్రజలే ఈ నా కవికావ్యంలో పాత్రలు" అంటూ వచ్చిన వారితో వెళ్ళిపోయాడు. 


 సమాప్తం. 

******************

 యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments


bottom of page