top of page

తుపానులో కారులో షికారు

#పెనుమాకవసంత, #PenumakaVasantha, #TufanuloKaruloShikaru, #తుపానులోకారులోషికారు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Tufanulo Karulo Shikaru - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 23/9/2025

తుపానులో కారులో షికారు - తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

 

"తుఫాన్ అనీ టీవిలు అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి పొంగి పొర్లుతుందిటా. ఇపుడు కొత్త కారు కొన్నాను, మా ఊరిలో అందరకీ.. చూపించాలనీ”


“అటు వైపు వెళ్ళకండి. వాన తగ్గితే, అందరం వెళ్ళి అప్పుడు గుళ్ళో పూజ చేయించుకుని వద్దాము వింటున్నారా? నా మాటలు" భర్తను అడిగింది ప్రభ. 


"ఆ వింటున్నాను టీవీ వాళ్ళు చెప్పారంటే.. పెళపెళ ఎండ వస్తుంది. టీవీల్లో, రేడియోలో వర్షం ఉందంటే.. రాదని రాదంటే ఉందని అర్థం కదా?”


"ఏం కాదు చూడండి. మబ్బు పట్టింది. సూర్యుడు కూడా రాకపోతే.. ఇంకా. చెప్తున్నాగా వెళ్ళకండి. "అని ఆర్డర్ వేసింది. 

 

"నీ మాట కాదని నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా. నువ్వు వద్దన్న తర్వాత వెళితే ఆ పని అవుతుందా? చెప్పు. అందుకని ఎక్కడికీ  వెళ్ళటం లేదు. కారును సర్వీస్ కు తెమ్మన్నారు షో రూం వాళ్ళు. అక్కడికి వెళ్లి వెంటనే వస్తాను. వెళ్లేప్పుడు ఎదురుగా వచ్చి మళ్ళీ ఎక్కడికనీ? అడగకు" అన్నాడు విసుగ్గా అప్పారావు. 


"ఇంత వర్షంలో సర్వీసింగ్ ఏంటి? నా బొందా. ఒక రెండు రోజులు ఆగి ఇవ్వచ్చు కదా!" అన్న ప్రభతో "ఫస్ట్ మంత్లో సర్వీసింగ్ చేయించుకుంటే.. ఫ్రీ తర్వాత, డబ్బు కట్టమంటాడు సరేనా. " 


ఫ్రీ గా అంటంతో మెత్తబడి “అయితే సరేలే.. త్వరగా వెళ్ళి వచ్చేయండి" అంది ప్రభ. అయినా ప్రభకు అప్పారావు మీద నమ్మకం లేదు. 


‘అందరిలో తను ప్రత్యేకంగా ఉండాలని ఎపుడూ ఏదోకటి చేస్తుంటాడు. రీల్స్ లో వీడియో పెట్టటం కోసం మొన్నటికి మొన్న ఆ కుర్చీనీ మడత పెట్టీ డాన్స్ వేసి, కుర్చీ మడత పెడుతుంటే, కాలికి కుర్చీ బలంగా దెబ్బ తగిలి, ఇపుడే కాస్త కోలుకుంటున్నాడు. మళ్ళీ ఇపుడు ఈ వర్షంలో అడ్వెంచర్ ఏమీ చేయటం లేదు కదా? చెప్తే వినే మనిషి కాదనీ! 

ఈయన ఇంటికి వచ్చేవరకు నాకు కంగారే!' మనసులో విసుక్కుంది ప్రభ. 


ప్రభ అనుమానం నిజమే. కారులో వాళ్ల ఊరు బయలుదేరాడు. వర్షంలో ఒక రీల్ చేద్దామనుకునే.. వెళ్తున్నాడు. 


రోడ్ మీద ఎవరూ? లేరు కారు చాలా హాయిగా వెళ్తుంది. ‘ఉందిలే.. ! మంచి కాలం ముందు ముందునా!’

 

పాత పాట వింటూ డ్రైవ్ చేస్తున్నాడు అప్పారావు. 


కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు మిర్రరులో నుండి చూస్తే పక్కన కాలువకు గండి పడి పంట పొలాలు నిండి  పోయినాయి. ఆ నీళ్ళు రోడ్ మీదకు వచ్చాయి. ఇంక ముందుకు పోవటానికి వీలు లేక దిగాడు. అక్కడే వర్షంలో ‘గాలి వానలో వాన నీటిలో కారు ప్రయాణం’, రీల్ షూట్ చేసుకుని, వెనక్కు తిరిగాడు. 


అప్పారావు ఎంతకు రాకపోయేసరికి అప్పారావు సెల్ కు ప్రభ, కాల్ చేస్తే సిచ్చుడాఫ్ వచ్చింది. కార్ షోరూంకి కాల్ చేసింది. ఇవాళ మా సర్వీస్ సెంటర్ కు సెలవని చెప్పారు. 


ఈయన వినే మనిషి కాదని తెల్సి కూడా పోనిచ్చాను చూడు. నాది తప్పు. అసలెక్కడికి వెళ్ళాడో అర్థంకాక అప్పారావు వస్తె అమీతుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయింది ప్రభ. 

 

కారు వెనక్కి తిప్పిన తర్వాత, ఇంకా వాన ఎక్కువ అవటంతో రోడ్ మీద నీళ్ళు నిలవటంతో డ్రైవ్ చేయలేకపోయాడు. వెళ్ళే దారిలోని ఊరిలో రోడ్ పక్కన ఉన్న పంచాయితీ ఆఫీస్  దగ్గర ఆపి పార్క్ చేసాడు. కారులో పడుకుందామని 

ప్రయత్నిస్తే.. నీళ్ళు కాళ్ల టైర్లు మునిగే వరకు వచ్చాయి. 


అమ్మో.. ! నీళ్ళు పోయిన తర్వాత చూసుకోవచ్చని, కారులో నుండి దిగి, ఆఫీసు వరండాలో ఆరోజుకు తల దాల్చుకున్నాడు. 


ఇంటికి ఫోన్ చేద్దామంటే ఫోన్ ఛార్జ్ అయిపోయింది. పవర్ కట్ అవ్వటం వల్ల ఆ రోజు ఆ వరండాలో బిచ్చగాళ్ళ పక్కన సేద తీరాడు. వాళ్లకు, పాత దుప్పట్లు ఉన్నాయి. తనకేమి లేవు. చలికి వణుకుతూ అలాగే గడిపాడు. రెయిన్ కోట్ తీసి ఒక పక్కన ఆరవేసాడు. బిచ్చగాళ్ల చుట్ట వాసనలో ఎలాగో ఆ నైట్ నెట్టేసాడు. 


మరుసటిరోజు పొద్దున లేచి చూస్తే, నీళ్ళు అలాగే వున్నాయి, అక్కడి మనుష్యుల, సాయంతో కారును నీటి నుండి, బయటకు తీసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లగానే, కాంచన గెటప్లో ఉన్న ప్రభను చూసి షాకయ్యాడు. 


ఇక అబద్దం చాలా జాగ్రత్తగా ఆడాలనుకుని ప్రభ అడక్కముందే పురాణం మొదలు పెట్టాడు. 


"ముందు సర్వీస్ సెంటర్ కు వెళితే లీవ్ అన్నారు. ఇంటికి వస్తుంటే అమ్మ కాల్ చేసింది. తనకు వంట్లో బాగాలేదని. సర్లే చూసి వద్దామని పోతే.. మధ్యలో వానెక్కువైతే ఒక ఊరిలో ఆగాను. "


"ఆపండి.. ! ఈ కధలు నాకు కాదు, సినిమా డైరెక్టర్లకు చెపితే డబ్బులిస్తారు. మీ అమ్మగారు మీరటు వెళ్లగానే ఫోన్ చేసారు. 


‘ఎపుడూ వాడు బయటనే ఉంటాడు. ఇవాళ వాడిని ఇంట్లో ఉండమను.’ అంది. ఇపుడైనా నిజం చెపుతారా?" అంది ప్రభ. 


"ఒక్క నిముషం గాప్ ఇవ్వు. రాత్రి అన్నం తినలేదు. నిన్న పగలు తిన్న అన్నమే.. నీరసంగా ఉంది" మాట్లాడలేననీ నాన్ వెర్బల్ సైగలు చేసాడు. టివిలో ఆఫ్టర్నూన్ 

మూగవార్తలు చదివే వాళ్లు అప్పారావును చూస్తే సిగ్గుపడతారు. అలా సైగలు అయ్యాడు కాసేపు అప్పారావు. 


"అయ్యో ముందు బ్రష్ చేసుకురండనీ" జాలిపడి వంటగదిలోకి వెళ్ళింది. 


నీ వీక్ పాయింట్ నాకు తెలుసు కదా. ఆ పాయింట్ తో బతికి బయట పడ్డానని "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకొని ఫోన్ చార్జుకు పెట్టుకుని వాష్ రూంలోకి 

దూరాడు అప్పారావు. 


 వారం తర్వాత, "ప్రభా.. ! గాలివానలో వాన నీటిలో కారు ప్రయాణానికి అనే ఫోటోకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఉత్తమ ఫోటోగ్రాఫర్  గా ప్రైజ్ పొందాను. ఐదువేల రూపాయిలు 

వచ్చాయి. ఆ వీడియో రీల్స్ లో పెడితే లక్ష వ్యూస్ వచ్చా”యన్నాడు ఆనందంగా. 

అవి నీకే ఇస్తున్నానని ప్రభకు ఇచ్చాడు అప్పారావు. 


ఎంతో సంతోషపడి డబ్బులు తీసుకున్న భార్యతో, "ఆ రోజు ఎన్ని ఫ్రీ షోలు వెరైటీగా చూపించావు కాంచన, చంద్రముఖిలాగా! ఇపుడు అర్థమయిందా నేనంటే.. ?""

అన్నాడు అప్పారావు. 


"అపుడపుడు పర్లేదు. మీతో కాస్త పున్నమి, అమావాస్య రోజులు, తట్టుకుంటే మిగతా రోజులు మీరు కింగ్" మురిపెంగా భర్తను చూసుకుంటూ అంది ప్రభ. 


'ఇంతకీ ఇది పొగిడిందా, తిట్టిందా!' అర్థం కాక జుట్టు పీక్కున్నాడు అప్పారావు. 


సమాప్తం

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments


bottom of page