top of page
Original.png

ఖగోళ యాత్ర

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KhagolaYathra, #ఖగోళయాత్ర, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 88


Khagola Yathra - Somanna Gari Kavithalu Part 88 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14/06/2025

ఖగోళ యాత్ర - సోమన్న గారి కవితలు పార్ట్ 88 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఖగోళ యాత్ర

----------------------------------------

నీలాల నింగిలో

మేఘాల తేరులో

విహరిద్దాం హాయిగా

చుక్కల లోకంలో


కదిలే మేఘంలో

చంద్రుని చేరువలో

బలే మజా ఉంటుంది

తారకల చెలిమిలో


కురిసే వెన్నెల్లో

విరిసే చినుకుల్లో

ఆహ్లాదం పండును

ఆనందం చిందును


ఊహల రెక్కలతో

ఖగోళ ఊసులతో

సందడే చేసేద్దాం

చకచక చూసొద్దాం











మేలుచేయు మేఘమాల

----------------------------------------

అందమైన మేఘమాల

తావులీను పూలమాల

బహు ముద్దగా కదులుతూ

అలరించును హృదయాలు


మేఘమాల చాటులో

దాగుడుమూతలాడును

చందమామ,తారకలు

దాని వెంట నడుచును


క్రమ్ముకొన్న మేఘమాల

పుడమిపైన వర్షించును

వర్షాలు కురిస్తేనే

అన్నదాత హర్షించును


గగనాన కదిలిపోయే

మేఘాలే కీలకము

మున్ముందుకు సాగుతూ

పంచును నేత్రానందము



















చక్కని నెలవంక

-----------------

అందాల నెలవంక

చూసింది నా వంక

నింగిలో తిరుగుతూ

చేసింది కనువిందు


గగనమ్మ సిగలోన

ఒదిగింది ముద్దుగా

మేఘమ్మ ఒడిలోన

కదిలింది హాయిగా


చుక్కల మధ్యలోన

చక్కగా ఇమిడింది

అంబరం గుండెపైన

సంబరం పొందింది


క్రమంగా పెరుగుతూ

మారింది నిండుగా

పున్నమి వేళ వెన్నెల

నిచ్చింది మెండుగా


నవ్వులే రువ్వుతూ

పువ్వులా పూచింది

దివ్వెలా వెలుగుతూ

అడుగు ముందుకేసింది


అంటారు చంద్రవంక

ఎంచక్కా ప్రేమగా

ముద్దులొలుకు నెలవంక

మారుతుంది వింతగా














అనంతుడు దేవుడు

----------------------------------------

దైవమే లేకుంటే

లోకమే ఉండునా

ఈ విశాల విశ్వమిక

మున్ముందుకు నడుచునా


సృష్టి,లయ కారుడతడు

అనంత శక్తిమంతుడు

అదృశ్య రూపుడతడు

మేధస్సుకు అతీతుడు


విశ్వాసమే మార్గము

ఆశించును దైవము

తను నమ్మినవారికి

చూడ రక్షణ కవచము


భగవంతుని నామమే

చేయాలోయ్! ధ్యానమే

అదే మనకు పెన్నిధి

ఘనం దైవ సన్నిధి










హృదయం దేవుని ఆలయం

----------------------------------------

దేవునితో సహవాసము

చేయాలోయ్! దినదినము

దైవ నామ స్మరణతో

కావాలోయ్! పరిశుద్ధము


మనసులోని మాలిన్యము

పోగొట్టుకోవాలోయ్!

భగవంతునికి నిలయము

కావాలోయ్!ఈ హృదయము


చిత్తశుద్ధి అవసరము

దైవానికి ప్రీతికరము

వాక్ శుద్ధే ప్రధానము

ఇవ్వాలోయ్! ప్రాధ్యాన్యము


హృదయమే దేవాలయము

కాపాడుకో! అనునిత్యము

భగవంతుడు దిగివచ్చి

చేయునోయి! నివాసము


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page