top of page
Original.png

కొత్తపేట కోటిలింగం సన్నాఫ్ జంబులింగం

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #KothapetaKotilingamSonOfJambulingam, #కొత్తపేటకోటిలింగం, #జంబులింగం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Kothapeta Kotilingam Son Of Jambulingam - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 15/07/2025

కొత్తపేట కోటిలింగం సన్నాఫ్ జంబులింగం - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

 

కొత్తపేట కోటిలింగం సన్నాఫ్ జంబులింగం.. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఖాళీ బ్రీఫ్కేస్ లో 500 రూపాయలు పెట్టుకొని బయటకు వచ్చి తన ఇంటికి గొళ్లెం పెట్టి గట్టిగా లాక్ వేశాడు.. రోడ్డు మీదకు వెళ్లి మళ్లీ అనుమానం తో వెనకకు వచ్చి బలంగా తాళంకప్ప లాగి చూశాడు. 


మంచి వాచి కొనాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. పెద్ద మార్కెట్ కు వెళ్లి రెండు మూడు స్ట్రీట్ లు తిరిగి రావువాచ్ కంపెనీ లో 500 రూపాయలతో తన మనసుకు బాగా నచ్చిన మంచి వాచి ఏరి ఏరి సెలక్షన్ చేసుకుని.. బ్రీఫ్కేస్ నుంచి 500 రూపాయలు తీసి షాపు అతనికి ఇచ్చాడు. 


తను కొన్న వాచీ బ్రీఫ్కేసులో పెట్టబోతుoడగా అందులో ₹1000 కనబడ్డాయి. అదిరిపడ్డాడు ఆశ్చర్య పోయాడు.. కొత్తపేట కోటిలింగం. 


''తను ఇంటిదగ్గర రెండు సార్లు లెక్కపెట్టి బ్రీఫ్ కేసు లో పెట్టింది ₹500 లే కదా. 


ఇదెలా.. సాధ్యమయింది.. ".. అనుకున్నాడు.. 


"సరే కంగారులో పెట్టానేమో" అని.. మనసును ప్రశాంత పరుచుకుని ఆ షాపులో 500 రూపాయలు చెల్లించి వేరొక షాప్కి వెళ్లాడు. తన దగ్గర ఉన్న ఆ మిగిలిన 1000 రూపాయలతో మంచి గిఫ్ట్ కొనాలి అని అతని ఉద్దేశ్యం. అందమైన చిన్న సైజు పాలరాతి తాజ్మహల్ కొన్నాడు. బ్రీఫ్కేస్ నుండి తీసిన 1000 రూపాయలు షాపు అతనికి చెల్లించి ప్యాకింగ్ చేయిoచిన తాజ్మహల్ బ్రీఫ్ కేస్ లో పెడుతుండగా.. అందు లో మళ్లీ 5 వేల రూపాయలు కనబడ్డాయి. 


తలతిరిగింది కొత్తపేట కోటిలింగం కి.. ఈ మాయాజాలం అర్థం కాలేదు. 


అక్షయపాత్ర లా.. ఈ బ్రీఫ్ కేస్ చేసే చిత్రం ఏమిటబ్బా??.. తనలో తానే ప్రశ్నించుకున్నాడు.. జవాబు దొరకలేదు. 


సరే 5000 రూపాయలు ఉన్నాయి కదా అని గోల్డ్షాప్ కు వెళ్లి.. రింగు కొనుక్కుని బ్రీఫ్కేస్ లో పెట్టి 5000 షాపు అతనికి ఇచ్చి తిరిగి బ్రీఫ్కేస్ లోకి చూడగా 10, 000 కనిపించాయి. 


"ఓర్నాయనోయ్.. " పిచ్చెక్కిపోయింది కొత్తపేట కోటి లింగానికి. 


బయటకు వచ్చి.. గోడకేసి ఎవ్వరూ చూడకుండా నెత్తి బాదుకున్నాడు.. దబదబా బాదుకున్నాడు. 


బయట ప్రజలకు ఎవరికైనా ఈ విషయం చెబితే తన కు మాయమాటలు చెప్పి ఆటోలో కొండలలోకి తీసుకెళ్లి చితగ్గొట్టి.. కత్తితో బెదిరించి బ్రీఫ్ కేస్ లాక్కుని పోతారు. 


లేదా తనకు పిచ్చి పట్టిందని.. బలవంతంగా లాక్కెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించి రకరకాల కొత్త కొత్త ఇండిషన్స్ పొడిపించి లేని పిచ్చి తెప్పిస్తారు. 


పోనీ.. పోలీస్స్టేషన్కు వెళ్లి ఈ విషయం వివరం గా చెబుదామంటే.. అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం గురించి బేరీజు వేసుకోలేకపోతున్నాడు. తనను ఒక భూతవైద్యుడు లాగో మాంత్రికుడులాగో స్టేషన్ కి తన విచిత్రమైన వార్త కవరేజ్ కి వచ్చిన మీడియా వాళ్ళు చిత్రించి.. తనను ఇంకా చాలా రక రకాలుగా చిత్రించి ప్రపంచానికి తనను విచిత్రమైన తలతిక్క మనిషిగా పరిచయం చేసి.. తనను జీవిత ఖైదుచేసి ఆ బ్రీఫ్ కేస్ ఎవరో ఒకరి సొంతం చేసుకుని.. బిలియనీర్లు అయిపోవచ్చు. 


" వామ్మో వారబ్బో.. వారి నాయనో.. ఇది ఏంటి అబ్బా.. " ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయం కొత్తపేట కోటిలింగానికి అర్థం కాలేదు. 


ఈసారి పక్కనే ఉన్న పెద్ద బండకేసి నెత్తి గట్టిగా బాదు కున్నాడు.. అదేమిటి తన నెత్తి బండకేసి గట్టిగా కొట్టుకుంటే బండది చిన్న రాతి ముక్క ఊడి కింద పడిపోయింది కానీ తన శరీరం చిట్లి చిన్న రక్తం బొట్టు కూడా కారలేదు.. 


"ఇదేదో చిత్రం జరుగుతున్నట్టు భలే గమ్మత్తుగా

ఉందే".. అనుకుంటుండగా కొత్తపేట కోటిలింగానికి కడుపు లో అది ఏదోలా అనిపించింది.. 

ఆకలి వేయటం లేదు కానీ చేతులతో తీసుకొని ఏదో నోట్లో పెట్టుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది.. చుట్టూ రోడ్డు అవతల ఇవతల చూశాడు.. తనకు ఇష్టమైనవి ఏమి కనిపించలేదు.. ఇటువంటి సమయం లో తియ్య తియ్యగా ఉండే బందరు లడ్డు తినాలనిపించింది. ఇప్పుడు ఎలా వస్తుంది. బందరు వెళ్లి తెచ్చుకోవాలంటే కష్టం.. ఉన్నట్టుoడీ బ్రీఫ్కేస్ బరువుగా అనిపించింది. 


కోటిలింగం రోడ్డు దాటి అవతలకు వెళ్లి అక్కడ ఒక అరుగు మీద కూర్చుని బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూశాడు. దాంట్లో రెండు పెద్ద పెద్ద బందరులడ్డూలు కనపడ్డాయి. ఆశ్చర్య పోయాడు.. ఆలోచన చేయడం మానేసి ఆబగా ఒక లడ్డూ తినేసాడు. ఇప్పుడు మంచి నీళ్లు తాగాలి అని పించింది అతనికి.. బ్రీఫ్ కేసులో ఒకపక్కన బిర్లా వాటర్ బాటిల్ విచిత్రంగా దర్శన మిచ్చింది. కేప్ ఓపెన్ చేసి మొత్తం తాగేసి బాటిల్ దూరంగా గిరాటేసాడు. 


తన దగ్గర మిగిలిన మరో బందరు లడ్డు ఎవరికైనా పెడదామని.. చుట్టూ చూశాడు.. దూరంగా ఒక అబ్బాయి కనిపించాడు అతని దగ్గరికి వెళ్లి లడ్డు ఇవ్వబోయాడు. ఆ అబ్బాయి తన జేబులోంచి ఒక బందరు లడ్డు తీసు కొని తింటూ.. అప్పల నరసింహం లాంటి కొత్తపేట కోటిలింగం వైపు చూడకుండా వెళ్లిపోయాడు. 


ఎక్కడో మండింది అప్పల నరసింహ లాంటి కొత్తపేట కోటిలింగానికి. ఒకసారి ఒళ్లంతా గోకేసుకున్నాడు. ఈ చిత్ర విచిత్రాలు చేదించి తీరాలి.. అనుకుంటూ.. 


రోడ్డు మధ్యగా నిలబడి గట్టిగా చెయ్యి గిల్లుకున్నాడు. తస్సదియ్య.. పిసర అంత నొప్పి కూడా కలగలేదు.. అదే సమయంలో అతని మీద నుండి విజయవాడ వెళ్ళే సూపర్ డీలక్స్ బస్సు దూసుకుపోయింది. అయి నా కొత్తపేట కోటిలింగం క్రింద పడలేదు.. దెబ్బ తగల లేదు.. మనిషి హాయిగా అలాగే నిలబడి ఉన్నాడు!!!


ఇదంతా ఒక.. కల.. ఏమో అని అనుమానం వచ్చింది కొత్తపేట కోటిలింగానికి. 


'రకరకాల కలలు.. ఆ కలలో రంగురంగుల కలలు.. బలే బలే కలలు గమ్మత్తు కలలు. '


చూసుకుంటే తను మంచం మీద లేడు. పెద్ద బజారు లోనే అటు ఇటు తిరుగుతున్నాడు.. 


గట్టిగా గిల్లి చూసుకుని ఇది కల కాదు అని నిర్ధా రించుకున్నాడు. 


పూర్వం జానపద కథలు లో లాగా తను ఏదైనా మహిమగల ఆకు కాని తొక్కేనా అనుకున్నాడు ముందు.. 

అబ్బే ఈ రోజుల్లో అలాంటి విచిత్రాలు ఎక్కడివి?


ఇది కాదు పని అని ఒక నిర్ణయానికి వచ్చి పక్క నుంచి వెళుతున్న.. అతన్ని.. హలో బ్రదర్.. అని పలకరించాడు. అతను లెక్కచేయకుండా వెళ్ళిపోయాడు.. 


కోటిలింగానికి కోపం తన శరీరపు ప్రతి రంధ్రం నుండి బయటకు తన్నుకుని వచ్చినట్టు అయింది. 


బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి.. తను కొన్న వాచి కసిగా రోడ్డు మీదకు గిరాటు వేశాడు.. దాన్ని ఎవరు పట్టించు కోకుండా వెళ్లిపోతున్నారు. 


ఈసారి తను కొన్న పాలరాతి తాజ్ మహల్

ప్యాకింగ్ విప్పి రోడ్డుమీద గట్టిగా కొట్టాడు. అది రోడ్డు మీద వెయ్యి ముక్కలయింది. ఆ ముక్కలు తొక్కు కుంటూ ప్రజలు అటు ఇటు నడిచేస్తున్నారు ఏమిటి 

చెప్మా.. 


వాళ్లకు అవి గుచ్చుకోవడం లేదు కూడా. 

కానీ.. వాళ్ళు ఎవరు తన వైపు కన్నెత్తి కూడా చూడ టం లేదు.. అదే అర్థం కావడం లేదు కొత్తపేట కోటిలింగానికి. 


కొత్తపేట కోటిలింగానికి చిరాకు ఎత్తి చిర్రెత్తింది.. 

తను చివరగా కొన్న గోల్డ్ రింగ్.. ఒక అమ్మాయిని పిలిచి ఇవ్వబోయాడు. ఆమె కనీసం రెస్పాన్స్ లేకుండా తన వైపు కన్నెత్తి చూడకుండా నడుచుకుంటూ వెళ్ళి పోయింది. 


ఈసారి కొత్తపేట కోటిలింగం తన దగ్గర ఉన్న పదివేల రూపాయలు.. రోడ్డు మీద వెదజల్లాడు. అబ్బే.. అవి గాల్లో ఎగురుతూ ఉన్నాయి కానీ అసలు కింద పడటం లేదు. 


అనుమానం వచ్చేసింది కొత్తపేట కోటిలింగానికి. 


పదునైన తన గోళ్ళతో గోకి చూసుకున్నాడు తన శరీరాన్ని.. పిసరంత రక్తపు బొట్టు కారలేదు. 


కాళ్ళ వైపు చూసుకున్నాడు.. తన రెండుపాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి చిత్రంగా.. 


చిత్రమే మహా చిత్రం.. 


తను కొత్తపేట కోటిలింగమే.. కానీ

అందులో ఏదో తిరకాసు ఉంది. 


అప్పటికి కొత్తపేట కోటిలింగానికి కొంచెం కొంచెం అర్థం అయింది. కొంచెం కొంచెం గా అర్థం చేసుకో గలిగాడు. 


" ఇ హీ హీ.. ఇ హీ హీ.. ఇ హీ హీ.. ఇ హీ హీ.. "


పైకి గట్టిగా నవ్వేసాడు. అయినా అతనిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.. కనీసం అతని వైపే చూడలేదు. వాళ్లు తన వైపు చూస్తున్నారు ఏమో కానీ తనే వాళ్లకు కనబడటం లేదేమో!!!


" ఇ హీ హీ.. ఇ హీ హీ.. ఇ హీ హీ.. ఇ హీ హీ.. "


అలా వెకిలిగా నవ్వుకుంటూ గాల్లో అలా అలా ఎగిరి పోతూ దగ్గరలో ఉన్న స్మశానపు మర్రి ఊడల చెట్టు మీదకు వెళ్ళిపోయాడు.. కొత్తపేట కోటిలింగం.. సన్నాఫ్ జంబులింగం!!!!


***** 

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page