top of page
Original_edited.jpg

కోతి మోసం


ree

'Kothi Mosam' New Telugu Story

Written By Mukkamala Janakiram

'కోతి మోసం' తెలుగు కథ

రచన: ముక్కామల జానకిరామ్



కొండకు దగ్గరలో కొండకింది గూడెం అనే పల్లెటూరు ఉండటంతో కోతులు,కాకులు,పక్షులు ఇండ్లపైన ఎప్పడూ సందడిగా తిరిగేవి.


లచ్చమ్మ పక్షులు,జంతువుల కోసం వాకిట్లో నూకలు పోసేది.ఒకరోజు గోడపైన అరిసెను పెట్టడం చూసిన కాకి ఒక్క ఉదుటున వచ్చి ముక్కుతో అరిసెను కరచుకొని వెళ్లి వేపచెట్టు కొమ్మ పై వాలింది.అది చూసిన కోతి ' ఈరోజు ఎక్కడా ఆహారం దొరకలేదు.బాగా ఆకలిగా ఉంది.ఎలాగైనా కాకి నుండి అరిసెను సంపాదించాలి' అని మనసులో అనుకుంది కోతి.


ఒక ఉపాయాన్ని ఆలోచించి 'కాకి మామా! కాకి మామా! నువ్వు ఒక్క అరిసెనే తెచ్చుకున్నావా? ఆ గోడపైన ఇంకా చాలా అరిసెలు ఉన్నాయి. నేను కడుపు నిండా తిని వస్తున్నాను.నువ్వు కూడా వెల్లి ఇంకొన్ని అరిసెలు తెచ్చుకో! కొన్ని రోజుల పాటు నీకు ఆహారం కోసం అన్వేషించే పని ఉండదు'.నువ్వు, నీ పిల్లలు హాయిగా తినొచ్చు అని ఆశ కలిగించింది కోతి.


కోతి మాటలు నమ్మిన కాకి తెచ్చుకున్న అరిసెను వేప కొమ్మపై ఉంచి నీ మంచి మనసుకు కృతజ్ఞతలు !ఇప్పుడే వెళ్లి అరిసెలు తీసుకొస్తాను' అని చెప్పి వెళ్ళింది.సమయం కోసం ఎదురు చూస్తున్న కోతిబావ చెట్టు కొమ్మ మీద ఉన్న అరిసెను గబుక్కున వెళ్లి తినేసింది.


అక్కడికి వెళ్ళిన కాకిమామకు నిరాశ ఎదురైంది. కోతి బావ చేసిన మోసాన్ని గ్రహించిన కాకి.తన తెలివి తక్కువతనానికి బాధపడి ఎవరి మాటల వెనుక ఏ రహస్యం దాగి ఉన్నదో అనుకుంది. చేసేదేమీలేక ఆహారం కోసం బయలుదేరింది కాకి.

ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్ M. A., B. Ed., D. Ed


స్కూల్ అసిస్టెంట్- తెలుగు

నల్గొండ జిల్లా

తెలంగాణా




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page