క్షణికం
- Veereswara Rao Moola
- May 17
- 3 min read
#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Kshanikam, #క్షణికం, #TeluguCrimeStory, #కొసమెరుపు

Kshanikam - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 17/05/2025
క్షణికం - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
నాగరత్నం, రంగయ్య శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కి వచ్చారు పనుల కోసం. ఇద్దరూ బిల్డింగ్ లు కట్టే చోట ఇటుకలు మోయ్యడానికి, కాంక్రీట్ ఎత్తడానికి కుదిరారు.
వాళ్ళు పనిచేసేది వంశీ బిల్డర్స్ వెంచర్ కూకట్ పల్లి ఫోర్త్ ఫేజ్ దగ్గర. దాని పక్కనే పోలీస్ స్టేషన్. అందులో యస్ ఐ, కానిస్టేబుల్ భాను మూర్తి ఉన్నారు. భానుమూర్తి ఉంటే ఆ ప్రదేశం కాంక్రీటు జంగిలే!
*****
ఒక రోజు భానుమూర్తి తన ఫ్రెండ్ ని కలవడానికి బిల్డింగ్ దగ్గర కి వెళ్ళినప్పుడు అక్కడ నాగ రత్నం అతని కంటపడింది.
"మస్తు గా ఉంది పోరి. పిటపిట లాడిపోతోంది " అనుకున్నాడు. ఒంగి మట్టి తీస్తుంటే జాకెట్ లోపలి అందాలు కనబడి పిచ్చెక్కి పోయాడు. నాగరత్నం కౌగిలి లేని నర జన్మ వృధా అనుకున్నాడు. మరిన్ని వివరాలు సంపాదించాడు. అవకాశం గురించి పొంచి ఉన్నాడు.
****
రంగయ్య ని పోలీసులు అరెస్టు చేసారంటే పరుగు పరుగు న వెళ్ళిందీ నాగరత్నం.
"నీ మొగుడు కి మొన్న బిల్డర్ రాజారావు గారి భార్య నెక్లెస్ దొంగతనం లో సంబంధం ఉందని
మా ఆరోపణ. "
"అయ్ బాబోయ్, ఆడు అలాంటోడు కాదండి. పెళ్ళం దగ్గర పది రూపాయలు తీసుకోవడానికి పాతిక సార్లు ఆలోచిస్తాడు. ఆడిని ఒగ్గెయ్యాండి బాబూ "
"పెళ్ళానికి ఇవ్వడానికి కాబోలు నెక్లెస్ కొట్టేసాడు. " అని నవ్వాడు భాను తోడేలు లా!
నాగరత్నం భానుమూర్తి కాళ్ళ మీద పడింది.
"నీ స్ధానం కాళ్ళ దగ్గర కాదే నా గుండెల దగ్గర " అనుకున్నాడు భాను మనసులో!
" సర్లే లే "
"నే చెప్పినట్టు ఇంటే వాడిని వదిలేస్తాను. లేదంటే FIR రాస్తే నీ మొగుడు జైలు, కోర్టు అంతే "
"సెప్పండి ఏం సెయ్యాలో "
"రాత్రి ఏడు గంటలికి జీపు వస్తుంది. అందులో ఎక్కి నేను చెప్పిన ఎడ్రస్ కి రా "
రంగయ్య కి ఏం జరిగిందో అర్ధం కావడం లేదు. తను నాటు సారా తాగుతుంటే పోలీసులు రావడం గుర్తు. ఆ తరువాత చూస్తే జైలు లో ఉన్నాడు.
******
నాగరత్నం వెళ్ళి పోయింది. రాత్రి జీపు వచ్చింది. నాగరత్నం అక్కడికి వెళ్ళింది. శాడిస్టు చేతి లో మల్లెలు నలిగినట్లు ఆమె జీవితం నలిగిపోయింది. రంగయ్య స్టేషన్ నుండి బయటికి వచ్చాడు.
*****
పదిరోజుల తర్వాత
నాగరత్నం గుడిసె దగ్గరికి వచ్చాడు భానుమూర్తి.
"మళ్ళీ ఎందు కొచ్చావు ? "
" నీది మామూలు అందమా ? ఒక సారి రుచి చూసి వదలడానికి " అంటూ భుజం మీద చెయ్యి వేసాడు.
చెయ్యిని పక్కకి తోసింది.
"జర రిలాక్సవుతా " అని మంచం మీద కూర్చుంటూ అక్కడ కనబడిన కవర్ చదివాడు. దాని మీద గరుడా డయాగ్నిస్టిక్ సర్వీస్ అని ఉంది. కవరు లోపల రిపోర్ట్ చూసాడు.
పేషంట్ పేరు : నాగరత్నం
భర్త పేరు : రంగయ్య
Result :HIV positive
" ఆ ! " నిర్ఘాంత పోయాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గుండె దగ్గర సన్నని నెప్పి..
"నీకు ఎయిడ్స్ ! నిన్ను కలిసినందుకు నాకు.. మై గాడ్.. ఇప్పుడు ఏం చెయ్యాలి. డిపార్ట్ మెంట్ లో తెలిస్తే పరువు, ఉద్యోగం రెండూ పోతాయి. " అందర్నీ భయపెట్టిన భానుమూర్తి భయపడుతున్నాడు. వణికి పోతున్నాడు. మనిషి ఊగి పోతూ వెళ్ళి పోయాడు.
*****
రంగయ్య, నాగరత్నం శ్రీకాకుళంవెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
హైదరాబాద్ MGBS బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు.
గరుడా డయాగ్నిస్టిక్ సర్వీసేస్ లాబ్ లో పనిచేసే శ్రీకర్ నుండి ఫోన్ వచ్చింది. నాగరత్నం సెల్ గ్రీన్ బటన్ నొక్కింది.
"అక్కా చెప్పి నట్టు చేసావా "
" అవును తమ్ముడూ, ఆ కాగితం వాడికి కనబడేలా మంచం మీద పెట్టా . దెబ్బ తో షాక్ కొట్టి వెళ్ళి పోయాడు " అంది నాగరత్నం.
"ఇక జన్మ లో ఎవరి జోలికి పోడు "
"మంచిది తమ్ముడూ, నువ్వు చేసిన ఉపకారం మర్చిపోను. "
" దాందేముంది. వాడు వెళ్ళ గానే కాగితం చింపేసావా ?" అడిగాడు శ్రీకర్.
"అవును "
నాగరత్నం, రంగయ్య బస్సు ఎక్కి కూర్చున్నారు.
" నాకు కాదు నువ్వు thanks చెప్పాల్సింది ఇంకొకరికి " అన్నాడు శ్రీకర్.
"ఎవరు ?"
" భానుమూర్తి భార్య మాలతికి ! ఆవిడ ప్లాన్ ఇది. పాత డేట్ తో రిపోర్ట్ ఇమ్మని, తన భర్త ప్రవర్తన తో విసిగి పోయి చెప్పింది "
ఆ రోజు గుర్తుకు వచ్చింది నాగరత్నానికి.
రంగయ్య విడుదలయ్యాక నాలుగు రోజులకి గుడి లో భానుమూర్తి భార్య కనబడింది. ఆమె తో జరిగిందంతా చెప్పింది నాగరత్నం.
మాలతి ముఖం నాగరత్నం కళ్ళ ముందు మెరిసింది. జరిగిన వన్నీ తలుచుకొంటే, నాగరత్నం కంటి నుండి ఒక బిందువు జారి చీర మీద పడింది. బస్సు బయలుదేరింది. నెమ్మది గా మేడి పండు లాంటి నగరం దూరమవుతోంది!
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
బాగుంద. ఎదురు చూసిన ముగింపులో కొస మెరుపు మాలతి