కుమార సంభవం
- Veereswara Rao Moola

- Oct 27
- 4 min read
#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #KumaraSambhavam, #కుమారసంభవం, #TeluguMoralStories, #తెలుగునీతికథలు, #కొసమెరుపు

Kumara Sambhavam - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 27/10/2025
కుమార సంభవం - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
పరిమళ చెప్పిన కధ :
నేను మధ్య తరగతి కి చెందిన అమ్మాయిని. నాన్న గారు కోర్టు లో గుమాస్తా. నాకో చెల్లి, తమ్ముడు ఉన్నారు. నేను పెద్ద అమ్మాయిని కావడం తో నాకు పెళ్ళి చెయ్యాలని తొందర లో ఉన్నారు. నేను బి. ఇడి పూర్తి చేసి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంట్లో పరిస్థితులు తెలుసు కాబట్టి పెద్దగా పెళ్ళి గురించి కలలు కనలేదు.
మదన్ మా దూరపు బంధువుల అబ్బాయి. నా వయసే! నన్ను ప్రేమించు అని నా వెంట పడేవాడు. నచ్చక పక్కన పెట్టాను. ఒక రోజు రోడ్ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే చెంప మీద ఒకటి ఇచ్చాను.
"చూడు.. ఏదో నాటికి నిన్ను అనుభవించి నా కోరిక తీర్చుకుంటా" అని ఆవేశం గా పలికాడు. తరువాత నాకు కనబడ లేదు.
****'*'
రెండేళ్ళ తరువాత నాకు ప్రభాకర్ తో వివాహమయ్యింది. ఆయన బ్యాంక్ మేనేజర్. పెళ్ళి తరువాత
హైదరాబాద్ వచ్చేసాను. ప్రభాకర్ తో నా జీవితం సాఫీ గా సాగుతోంది. చిరు అలకలే కాని పెద్ద గొడవలు లేవు.
కాని మా జీవితం లో పెద్ద లోటు 'పిల్లలు లేక పోవడమే' అని గ్రహించాను. ఐదేళ్ళ కాపురం లో రెండు గర్భ స్రావాలు.
కృత్రిమ గర్భధారణ కు ప్రయత్నం చేద్దామన్నాడు ప్రభా(ఆయన్ని అలా పిలుస్తాను. ).
శ్యామలా సంతాన సాఫల్య కేంద్రం లో డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, బుతు స్రావం సరిగా ఉంది కాబట్టి ఓవరీస్ రెస్పాన్స్ బాగుంటుందని చెప్పారు.
ప్రభాకర్ చెప్పిన కధ :
చిన్న పిల్లల బోసి నవ్వులు ఎవరికి ఇష్టం ఉండవు? ఆ లిపి లేని భాష కు ఎన్ని భాష్యాలైనా రాయచ్చు. స్పెర్మ్ శాంపిల్ ఇచ్చాక పది రోజుల తర్వాత పరిమళ కు కృత్రిమ గర్భ ధారణ జరిగింది.
తొమ్మిది నెలల తర్వాత పరిమళ పండంటి బిడ్డను కన్నది.
మా ఆనందానికి అవధులు లేవు.
పరిమళ చెప్పిన కధ :
నేను పిల్లాడికి పాలిచ్చి, పక్కకి వాలాను. మోబైల్ మ్రోగింది.
ఏదో అపరిచిత నెంబర్. కట్ చేసాను. మళ్ళీ వచ్చింది.
ఎవరా అని గ్రీన్ బటన్ నొక్కాను.
" పరిమళా బాగున్నావా?"
ఎక్కడో విన్న గొంతు. ఎక్కడ? ఎక్కడ?
"మదన్?"
"ఫర్వాలేదే? గొంతు గుర్తు పట్టావు. ఏం చేస్తున్నావు? చంటి పిల్లాడితో ఆడుకుంటున్నావా?"
" నీకెందుకు? ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు?"
" కోపం వద్దు. ఇప్పుడు నువ్వు నా కొడుకు అని మురిసిపోతున్నావు కదా. వాడు నీ కొడుకు కాడు. " అన్నాడు మదన్.
" పిచ్చి వాగుడు కట్టి పెట్టు"
"వస్తున్నా అక్కడికే వస్తున్నా. శ్యామలా సంతాన సాఫల్య కేంద్రం లో మీ వారి స్పెర్మ్ శాంపిల్ బదులు నా శాంపిల్ వెళ్ళింది. అంటే నీ కడుపులో పెరిగి, పుట్టిన బిడ్డ లో నా
అంశ ఉంది."
లైన్ కట్టయ్యింది. నాకు చెమటలు పట్టాయి. తల తిరిగినట్లయ్యింది. శాంపిల్స్ మారిపోతాయా? ఈ విషయం తెలిస్తే ప్రభాకర్ ఏలా రియాక్ట్ అవుతాడు? చిన్న చిన్న చేతులు, లేత కాళ్ళు ఉన్న ఆ బాబు నా బాబు కాడా?
పిల్లాడిని చూడాలంటే భయం వేస్తోంది! 'నీ కడుపు లో నుంచి వచ్చాను కదా అమ్మా' అని లేత పెదవులతో అడుగుతున్నట్టు ఉంది.
సరిగా అన్నం తినడం లేదు నేను. బాలింతరాలు బలమైన ఆహారం తినాలి. అని అమ్మ గొడవ. మదన్ ఫోన్ చెవి లో గింగిరాలు కొడుతోంది
నెల తర్వాత కరోనా పోలిన వైరస్ మళ్ళీ విజృంభించింది. ప్రభుత్వం అందరికీ డిఎన్ఎ పరీక్ష తప్పనిసరి చేసింది.
డిఎన్ఎ పరీక్ష లో తన కొడుకు కాదని తెలిస్తే ప్రభాకర్ ఏం చేస్తాడు? తనను అనుమానిస్తాడా? చాప కింద నీరు లా నా జీవితం లో మదన్ ఉన్నాడని ఊహించలేదు.
ఆలోచించే కొలదీ తల వేడెక్కి పోతోంది. అలాగే పడుకుండి పోయాను.
*********
కళ్ళు తెరిచే సరికి ఎదురు గా డాక్టర్, ప్రభా ఉన్నారు.
" సమస్య ఏం లేదు. ఏదో మానసిక ఆందోళన తో బాధ పడుతున్నారు. " అన్నాడు డాక్టర్
"ఎందుకు పరిమళా, నీ కిష్టమైన కొడుకు పుట్టాక కూడా ఆనందం గా ఉండకుండా?" ఆందోళన గా ప్రభా అన్నాడు.
ఏదైతే అది అయ్యిందని జరిగినదంతా మదన్ సంభాషణ తో సహ ప్రభా కి చెప్పాను.
అంతా విని ప్రశాంతం గా ప్రభా ఒక్క మాట అన్నాడు.
"నాకు తెలుసు"
తెలుసా!
ఆశ్చర్య పోయాను!
******
ప్రభాకర్ చెప్పిన కధ :
రాత్రి 11 గంటల సమయం. బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకుని పడుకునే సమయం లో పరిమళ ఫోన్ మ్రోగింది. ఏదో అపరిచిత నెంబర్. స్పామ్ అని పట్టించుకోలేదు. అరగంట తర్వాత మళ్ళి వచ్చింది. ఈ సారి ఫోన్ ఎత్తి హలో అన్నాను.
వెంటనే లైన్ కట్టయ్యింది.
ఆ నెంబర్ చాలా సార్లు పరిమళ ఫోన్ లో ఉండడం చూసి ఆశ్చర్య పోయాను.
నా స్నేహితుడు, ఎస్సై గిరిధర్ కీ ఇచ్చి ట్రాక్ చెయ్యమన్నాను.
అది మదన్ అనే వ్యక్తి ది అని తెలిసింది. కాల్ రిజిస్టర్ చూస్తే అందులో ఒక నెంబరు ఎక్కువ సార్లు ఉపయోగించబడింది. ఆ నెంబర్ ని ట్రాక్ చేస్తే అది శ్యామలా సంతాన సాఫల్య కేంద్రానికి చెందిన లాబ్ టెక్నిషియన్ రంగరాజుది. !
రంగరాజు కి మదన్ కి ఏమిటి సంబంధమా అని విచారిస్తే 50 వేల రూపాయలు ఇస్తే స్పెర్మ్ శాంపిల్ మార్చడానికి రంగరాజు ఒప్పుకొని మదన్ కి భరోసా ఇచ్చాడు.
గిరిధర్ రంగం లోకి దిగి, ఒరిజినల్ ప్రభాకర్ శాంపిల్ పెట్టక పోతే, కేరీర్ క్లోజయ్యి, జైలు శిక్ష అనుభవిస్తావు అని బెదిరించాడు. రంగరాజు భయపడి అలాగే చేస్తానన్నాడు.
రంగరాజు కి రెండు శాంపిల్స్ దొరికాయి. రెండింటి మీదా ప్రభాకర్ పేరు ఉంది. ఏది అసలు, ఏది నకిలీ అని మీమాంస లో పడ్డాడు. ఆ రెండింటినీ నిషేధించి మళ్ళీ స్పెర్మ్ శాంపిల్ ఇచ్చాడు ప్రభాకర్.
"నీ మీద మా కన్ను ఉంటుంది. అనుమానం వచ్చిందా జైలు ఊచలే గతి, జాగ్రత్త "
అని రంగరాజు ని హెచ్చరించాడు గిరిధర్!
వారం రోజుల తరువాత ప్రభుత్వం నిర్వహించిన డిఎన్ ఎ పరీక్ష లో నాది, బాబుది సరిపోయాయి.
పరిమళ మనస్సు తేలిక పడింది. నెల బాబుని గట్టిగా హత్తుకుంది.
*******
రచయిత చెప్పిన కధ
ప్రభాకర్, గిరిధర్ లను కలిసాక రంగరాజు బుద్దిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు.
మదన్ ఇంకా భ్రాంతి లో ఉన్నాడు.
మళ్లీ పరిమళ కు ఫోన్ చేద్దామని అనుకుని సింగపూర్ నుండి వచ్చాక ఆ విషయం చూద్దాం అని బెంగుళూర్ లో సింగపూర్ వెళ్ళే విమానం ఎక్కాడు.
విమానం లో సాంకేతిక లోపం తలెత్తడం తో టేకాఫయిన కొద్ది సేపటికే కూలిపోయింది. విమానం లో మంటలు చెలరేగాయి.
మదన్ ఆ మంటల్లో మసయిపోయాడు. !
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.




Comments