top of page

కుంపట్లో కాపురం

'Kumpatlo Kapuram' - New Telugu Story Written By Pitta Gopi

'కుంపట్లో కాపురం' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

చదువుకున్న వాళ్ళే క్రమశిక్షణ - నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తుంటే చదువుకోలేని వారికి అసలు క్రమశిక్షణ అంటూ ఉంటుందా.. అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు.


అలాగే, చదువుకున్నోళ్ళే క్రమశిక్షణ రహితంగా ఉంటారు కానీ ఏ చదువు సంద్యలు లేనోళ్ళే పద్దతిగా ఉంటారనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు.


అలాంటి వారిలో అక్షరం ముక్క కూడా రాకపోయినా నీతి నిజాయితి కి పేరు గాంచి కష్టపడే తత్వం, మొక్కవోని దైర్యానికి పేరుగాంచిన ప్రభ ఒకడు.


తండ్రి ఆస్తి ఉంది కానీ తల్లిదండ్రులు లేరు. వ్యవసాయమే అతనికి ఇష్టం. పని చేయటంలో ఉండే గౌరవం ఇంకెక్కడ ఉండదని నమ్మే వ్యక్తి. చిన్నప్పటి నుండి తనకు తానే కష్టపడి వస్తు బతికాడు.


పెళ్లి వయస్సు వచ్చిందని పినతండ్రి సూరి ఆలోచించి చదువులేని ప్రభకి చదువుకున్న అమ్మాయి ని పెళ్ళి చేస్తే వీళ్ళు ఆనందంగా ఉంటారని బావించి చదువుకున్న ఓ పిల్ల సుజాతని చూసి ఘనంగా పెళ్ళి చేశాడు. ఎంతైన పినతండ్రి కదా.. అన్నయ్య కొడుకు కు ఆ మాత్రం చేయకపోతే ఎలా అందుకే పెళ్ళి చేసి ఆనందపడ్డాడు సూరి.


ప్రభ, సుజాత ని ఎంతో చక్కగా చూసుకుంటాడు. ఎంత కష్టపడి వచ్చిన కూడా ఆ కష్టం పని వరకే ఇంట్లో సుజాత తో ఎంతో అన్యోన్యంగా ఉంటాడు.


తనకు ఏమి కావాలంటే అవి తెచ్చి పెడతాడు. దురలవాట్లు కూడా లేనివాడు కదా.. ఇలా చక్కగా వారి కాపురం సాగుతుంది. కొంతకాలం తర్వాత సుజాత భర్త కష్టం చూసింది. చదువుకుంది. తెలివైన అమ్మాయి కదా ఎలాగైనా భర్త కష్టం లో పాలుపంచుకోవాలని అనుకుంది.


కానీ అందుకు ససేమిరా అన్నాడు ప్రభ


"నేను ఎంత కష్టపడినా.. నువ్వు కష్టపడకూడదు అయినా నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను కదా " అన్నాడు.


దీంతో సూజత మరోలా ఆలోచించింది.


‘తాను ఉద్యోగం చేసి భర్త సంపాదన పెంచి వ్యవసాయ పనులు చేసేందుకు కొందరు పనివాళ్ళు ని పెట్టుకుంటే భర్త కష్టాన్ని తగ్గించవచ్చు. అలాగే మరి కొందరికి పని కల్పించినట్లు అవుతుంది ఇదే మంచి ఆలోచన’ అని అనుకుని ప్రభు కి విషయం చెప్పింది.


"ఏవండోయ్! నేను చదువుకున్నాను కదా.. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తానండి" అని అడుగుతుంది.


తాను ఎలాగూ చదువుకోలేదు. అందుకే సుజాత కు ప్రోత్సాహం అందించాలని ఒప్పుకున్నాడు.


అలా సుజాత ఉద్యోగ ప్రయత్నం కోసం పట్టణానికి వెళ్ళింది.

ప్రభ కష్టపడి తనకు అవసరమైన డబ్బులు పంపుతు ఉండేవాడు. అలా సుజాత తనకు ఇష్టమైన IAS ని సాదించింది.


కొన్ని రోజులు అయ్యాక ప్రభ సూజత ఆచూకీ కోసం ప్రయత్నించగా ఆమె ias సంపాదించి ఉద్యోగ ప్రయత్నం లో ఉన్నప్పుడు వేరొకరిని లవ్ చేసి ఇప్పుడు అతనితోనే ఉంటుందని.


దీంతో ప్రభ షాక్ అయిపోయాడు.


నా కష్టాలు తీర్చటానికి ఉద్యోగం సంపాదిస్తా అని చెప్పి నా కష్టం తో ఉద్యోగం పొంది నన్నే మోసం చేసిందని.


ఆమె ను చాలాకష్టంతో కలిసి నిలదీశాడు. ఇద్దరి మద్య వాదనలు ఎక్కువ సమయం జరిగింది.


ప్రభ బతిమాలాడు. తమ ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేశాడు అయినా సుజాత కరగలేదు సరికదా.. ప్రభ మీద వేదింపులు కింద కేసు పెట్టింంది.


దీంతో ప్రభ రెండు నెలలు జైల్లో గడపల్సి వచ్చింది.


తాను జైలుకు వెళ్ళాననే బాద కంటే చక్కగా సాగుతున్న తమ కాపురానికి ఉద్యోగం అడ్డు వచ్చింది.. తాను ఉద్యగానికి మద్దతు ఇవ్వటమే ఈ పరిస్థితి కి కారణమని బాదపడ్డాడు.


జైలు నుండి విడుదలై ఆధారాలతో సుజాత తన బార్య అని, మోసం చేసి ఉద్యోగం వచ్చాక వేరే వ్యక్తి తో వెళ్ళిపోయిందని న్యాయం పోరాటం చేశాడు.


అందుకు పినతండ్రి తో సహా అందరు మద్దతు తెలపటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకుని విచారణ జరిపాయి.


చదువు రాని ప్రభ బార్య ను కష్టపెట్టకుండా చూసుకోవటమే కాక బార్యని ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యం తో ఉద్యోగం కోసం చదివిస్తే మోసం చేసినందుకు ఉద్యోగం తీసివేసి పదేళ్లు జైలు శిక్ష, అలాగే.. అనవసరంగా భర్త మీద కేసు వేసి జైలుపాలు చేసి అతని సమయాన్ని వ్రుథా చేసినందుకు పదేళ్లు, తప్పుడు కేసు పెట్టి న్యాయస్థానంను తప్పుదోవ పట్టించినందుకు 20 ఏళ్ళు జైలుశిక్ష విదించింది న్యాయస్థానం.


అనవసరంగా మంచి భర్త ని, మంచి ఉద్యోగాన్ని, చక్కని కాపురాన్ని వదిలి తప్పు చేసినందుకు జైలు శిక్ష అనంతరం ఆమె కు 65ఏళ్ళు. ఈ వయసు లో ఆమె ప్రేమికుడు కానీ భర్త కానీ.. స్వీకరించలేదు.


అంతెందుకు ఏ మగాడు కూడా ఆ వయసు లో ఆమె ను భార్య గా స్వీకరించలేదు.


అప్పుడు IAS ఉద్యోగం పొందిన సుజాత కి జ్ణానోదయం అయింది, తనను ఏ కష్టం రానియకుండా చూసుకున్న ప్రభ ని మోసం చేశానని..


ఆడది బయటకు వెళ్తే అనుమానించే చదువుకున్న సమాజాన్ని లెక్కచేయకుండా, చదువుకోని ప్రభ.. నమ్మకంతో తన మాటకు విలువ ఇచ్చి చదివించిన వ్యక్తి ని మోసం చేశానని చిలకపచ్చని తమ కాపురాన్ని


కణకణ మండే నిప్పుల కుంపట్లో వేసుకుని తానే నాశనం అయిపోయానని ఆలోచిస్తు.. గమ్యం తెలియని దారి గుండా పోతోంది సుజాత.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం






55 views1 comment
bottom of page