top of page

మా ఇంటి కొన దర్వాజ


'Ma Inti Kona Darwajaa' New Telugu Story


Written By Lakshmi Madan


రచన: లక్ష్మి మదన్


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మా ఇంటి కొన దర్వాజ ఎంతో రాజసంగా ఉండేది. మహా రాణి లా ఠీవిగా అంత ఎత్తున నిలిచి ఉండేది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళే వాళ్లంతా తనని దాటుకునే కదా వెళ్ళాలి. అందరూ తన అనుమతితో ఇంట్లోకి వెళుతున్నారని తలిచేది.. అయినా అది నిజమే కదా!


ఇంటి వారిని మొత్తం తనే చూసుకునేది. ఇంట్లో అంతరంగిక విషయాలు బయటకు పొక్క కుండా ఒక హద్దులా ఉండేది. ఇక వీధిన వెళ్లే వాళ్లందరినీ గమనిస్తూ ఉండేది. వెళ్ళిన వాళ్ళు మళ్లీ ఇంటికి చేరుకున్నారా లేదా అని తపన. అందరి బాధ్యత తనదే అన్నట్లు చూసేది. వెళ్లే వాళ్ళు ఒక సారి మా దర్వాజను పలకరించి నట్లు చూసి వెళ్లే వాళ్ళు. మా వీధిలో బండ్లు, సైకిళ్ళు, ఎప్పుడో ఒక సారి స్కూటర్ లు వెళ్ళేవి.. ఎక్కువగా నడిచి వెళ్లే వారే. నడచి వెళ్లే వాళ్ళంటే బెంగ లేదు..వాహనాల పై పోయే వారంటేనే భయం. ఏం విపరీత పోకడలు పోతారో అని.


మా అరుగుల మీద తీరిక వేళలో అమ్మలక్కలు కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు. వారి ముచ్చట్లు అన్నీ విని తెగ మురిసి పోయేది. కష్టాలు చెప్పుకుంటే కన్నీరు కార్చేది. వాడ కట్టులో ఆడ పిల్లలు పెళ్లి చేసుకుని అత్త వారింటికి పోతుంటే ఎంత దుఖ పడేదని. పిల్లలు ఆడుకుంటే పడతారని ఒకటే ఆరాటం ...అన్నీ తనకే కావాలి మరి.


పాపం ! ఎండొచ్చినా వానొచ్చినా అట్లే నిలబడాలి. అయినా బాధ లేదు..ఇది నా బాధ్యత అనుకునేది. ఎప్పుడో పెళ్లిళ్లు లేదా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు రంగులు వేస్తే..ఇక దాని ఆనందం చెప్పలేము. పట్టు బట్టలు పెట్టినట్లు పొంగి పోయి "శత మానం భవ" అని దీవెనలు ఇచ్చేది. పచ్చని మామిడాకు తోరణం.. బంతి పూల దండలతో అలంకరిస్తే అబ్బ.. వాడ కట్టుకే నిండుదనం వచ్చేది పెళ్లి కూతురిలా!


ఇక నేను బయటకి పోతుంటే ...జాగ్రత్త అని చెప్పినట్లే తోచేది. ఇంటికి రావడం ఆలస్య మైతే కోపంగా చూసేది...పాపం ఎంత సేపు ఎదురు చూసేదో.....మా నాన్న రాగానే నిశ్చింత గా ఉండేది...ఎందుకంటే అందరి కన్నా ఆలస్యంగా వచ్చి తలుపులు మూసే వారు....ఇక రాత్రి కొంచెం విశ్రాంతి...అయినా మధ్య మధ్యలో చూస్తూనే ఉండేది.. దొంగలో..కుక్కలో గోడ దూకుతారని!


అలా అందరినీ కంటికి రెప్పలా చూసే మా కొన దర్వాజ ఇప్పుడు నిస్తేజంగా ఉంది...మేము ఎవ్వరము అక్కడ లేమని...ఒంటరిగా వదిలి వచ్చాము మేమంతా! మేము ఎలా ఉన్నామో అని తపన. ఇక వాడ కట్టులో నడిచే జనం లేరు..అందరికీ కార్లు..బైక్ లు..ఇక మా దర్వాజ తో ఎవరు ముచ్చట పెడతారు... అది జాగ్రత్త లు చెప్తే ఎవరు వింటారు. మున్సిపాలిటీ వాళ్ళు వేసిన రోడ్డు తో అరుగులు కూరుకు పోయి..ఇప్పుడు అరుగులే లేవు. ముచ్చట పెట్టే నారీ మణులు లేనే లేరు...


ఈ సారి మా ఊరు పోతే పలకరించి దాని కన్నీళ్లు తుడిచి వస్తాను...మాలో ఒకటిగా ఉండి పోయిన మా ఇంటి కొన దర్వాజా! నిన్ను మరచి పోలేదు మేము.

***

లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1626797305046396931?s=20


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు

https://www.manatelugukathalu.com/profile/lakshmimadan/profile


25 views0 comments
bottom of page