మబ్బు తెరలలో
- Yasoda Gottiparthi

- 2 hours ago
- 3 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #MabbuTheralalo, #మబ్బుతెరలలో, #TeluguStories, #తెలుగుకథలు

Mabbu Theralalo - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 19/01/2026
మబ్బు తెరలలో - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
రోడ్డుమీద ఎప్పుడూ వాహనాల రద్దీ. ఫుట్పాత్ మీద అటు ప్రక్క, ఇటు ప్రక్క నడుస్తూ తమకు అవసరమైనప్పుడు మాత్రమే జీబ్రా క్రాస్ లో రోడ్డు దాటుతూ ఎవరి గమ్యాలకు వాళ్ళు చేరుకుంటున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు తెలుసుకున్నా, పోయిన ప్రాణాలు తిరిగి రావడం లేదు. తెలిసినా వాటిని పరిష్కరించే వరకు మరెన్నో ప్రాణాలు గాల్లో కలుస్తూ అనుమానం రాకుండా ప్రజల్లోనే తిరుగుతూ పెద్ద తలకాయల్లా చెలామణి అవుతున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం తండోపతండాలుగా జనాలు, గెలిపించిన ప్రేమతో ప్రజలు; గెలిచానని గంపేడంత గర్వంతో పెద్ద మోటార్ వాహనంలో పైన నిలబడి అందరికీ తన చేతులతో నమస్కారాలు చెబుతూ ముందుకు సాగుతున్నందుకు ఒక్కొక్కరు జయజయధ్వానాలు పలుకుతున్నారు.
మనం వేసిన ఓట్లే ఈయన్ని గెలిపించాయి. పల్లెటూరి నుండి వస్తున్న ఒక జంట: "మన కొడుకులు ఈ పట్టణంలో ఉద్యోగాలు చేస్తున్నారు కదా! మనం ఈసారి రెండు నెలలు ఈడనే ఉండిపోదామే!" అన్నాడు భర్త.
“ముఖ్యమంత్రి గారు మనకు పింఛన్ ఇస్తున్నాడు. వాళ్ల మీద ఆధారపడము. ఆ పైసలు వాళ్ళ చేతుల్లో పోస్తే చేతకాని సమయంలో మనకు అవసరం ఉంటాయి.
పేదలకు డబుల్ బెడ్రూం కూడా ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వంతో మన గుడిసె బతుకులకు బదులు తల దాచుకోడానికి ఇల్లు లేక పిల్లలను హాస్టల్లో పెట్టి చదివించాము. ఇప్పుడైనా వాళ్ళ జీవితాలు ఒక కొలిక్కి వస్తే తల్లిదండ్రులుగా మనం సంతోషిస్తాము. మన రెక్కలు బాగున్నప్పుడే, శక్తి ఒంట్లో ఉన్నప్పుడే కొడుకు పెళ్లి చేస్తే మనవళ్లతో సంబరంగా కాలం గడపవచ్చు" అని రోడ్డు ఫుట్పాత్ మీద నడుస్తూ మరో కాలనీ మారేసరికి తమ కొడుకు ఉండే వీధి చివర కనిపించసాగింది.
‘అమ్మయ్య! ఇంటి దగ్గరికి వస్తున్నాము. ఈ వయసులో పిల్లల దగ్గరనే ఉండడం ఎంత అదృష్టమో!’
సంతోషంగా తమకు ఇచ్చిన అడ్రస్ కాగితం విప్పి ఇంటి నంబర్ చూసుకొని తలుపుల వైపు చూసేసరికి తాళం కప్ప కనపడింది. అడ్రస్ ను మళ్ళీ ఒకసారి చూసుకొని "వస్తున్నామని చెప్పినా ఎక్కడికి పోయాడు వీడు? మేము వచ్చేవరకు లేకపోతే ఈ పట్నంలో ఎక్కడికి పోతాము? అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా” అంటూ వెనక దొడ్డి వైపు మార్గానికి తలుపులు ఉన్నాయేమో? అంటూ చుట్టూ కలియదిరిగినా, తలుపులు లోపలి నుండే వేసి ఉన్నాయి. ఒక మూలన మనిషి మూలుగు వినిపించగానే వెళ్లి చూడగా, వయసు మళ్ళిన మనిషి లేవలేక పడి "దాహం, దాహం" అంటుండగా పిలిచినా పలికే స్థితిలో లేక దీనంగా చూస్తున్నాడు. కొన్ని నీళ్లు తాగించి కాస్త కుదుట పడగానే, "ఎందుకిలా పడి ఉన్నావు? నీ ఇల్లు ఎక్కడ చెప్పు?" అని అడగగా
"నాయనా! నా కొడుకు, కోడలు నన్నే తరిమేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కొడుకుతో కలిసి ఉంటే, ఈ మధ్యనే నా బిడ్డ, అన్న చూసిన అబ్బాయిని చేసుకోకుండా, ఒకతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిసింది. అందుకే నా కొడుకు చెల్లె చేసిన పనికి నన్ను తరిమి వేస్తున్నాననీ, అక్కడే ఉండమని నన్ను ఇక్కడే వదిలేసి వెళ్లి ఒక రోజు అయింది."
"నా బిడ్డ కోసం ఈడనే ఉన్నా."
"వెళ్లిపోయిన బిడ్డ కోసం ఏడుస్తే వస్తుందా? మీ కొడుకు దగ్గర దింపుతా”మని వెంటబెట్టుకొని తీసుకుపోయి, “జన్మనిచ్చిన కన్న తండ్రికి పట్టెడన్నం పెట్టి చూసుకోలేకపోతే మనిషి జన్మకు సార్థకం లేదు. మీ చెల్లెలు నా కొడుకుతో వెళ్ళింది. ఈ సంగతి మాక్కూడా తెలియదు. మేము కూడా నమ్మలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది: ప్రతి కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతూనే ఉన్నాయి. అలా అని బంధాలను దూరం చేసుకోవాలని వదులుకుంటామా? తప్పు ఒకరు చేస్తే మరొకరికి శిక్షనా? ఈరోజు మేము అక్కడికి వెళ్ళకపోయినట్లయితే ఆయన ఉండకపోయేవాడు."
తాను చేసిన పనికి తల దించుకుని క్షమించమని ప్రాధేయపడ్డాడు వెంకయ్య కొడుకు.
వెంకయ్య కొడుకు, "నేను మా నాయనను ఏమీ అనలేదు. చెల్లెలు మీద కోపంతో ‘నాయన, బిడ్డను శ్రద్ధగా చూసుకొని ఒక అయ్య చేతుల్లో పెట్టలేదు’ అనగానే కోపంతో వెళ్లిపోయాడు. అంతే.” అన్నాడు.
కాసేపట్లో గోడకు ఉన్న టీవీలోంచి వార్తల్లో,
“ఉదయం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరిగే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. టూ వీలర్‌పై వెళుతున్న సౌమ్య, సుధీర్ అనే జంట రోడ్డు ప్రమాదం కారణంగా గాయాలై హాస్పిటల్‌లో ఉన్నారు.” అనే వార్త వచ్చింది.
చూస్తున్న వారందరూ కుప్పకూలిపోయారు. పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే వెళ్లి: "నాయనా! ఏందిరా మేమంతా కానివాళ్ళమయ్యామా? నీతోనే మా బ్రతుకు అనుకున్నాము. ఆ దేవుని దయ వల్ల మళ్ళీ నిన్ను చూడగలిగాము" అని అంటుండగానే, సుధీర్: "నేను ఏ తప్పు చేయలేదు. ఏ అమ్మాయిని ప్రేమించలేదు. నేను పనిచేసే ఆఫీసులో నా పై ఆఫీసర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ కారణంగా నా పేరు కూడా చెప్పాడు. నన్ను అనుమానించి కొన్ని రోజులు జైలు పంపించారు. సౌమ్య నా ఫ్రెండ్. ఆమె లాయర్. బెయిల్ మీద నన్ను విడిపించి తీసుకు వస్తుంటే యాక్సిడెంట్ చేయించారు. తరువాత ఏం జరిగింది నాకు తెలియదు. అంతే. మిమ్మల్ని చూస్తున్నాం." అన్నాడు.
చెప్పిందంతా విని, తొందరపాటుతో అపార్థం చేసుకున్నందుకు క్షమించమని వెంకయ్య కొడుకుతో సహా బ్రతిమిలాడి, సౌమ్యను ఇచ్చి పెళ్లి చేశారు.
శుభం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments