top of page

మన భవితవ్యం

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మనభవితవ్యం, #నేటిన్యాయము

గాయత్రి గారి కవితలు పార్ట్ 31

Mana Bhavithavyam - Gayathri Gari Kavithalu Part 31 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 01/07/2025

మన భవితవ్యం - గాయత్రి గారి కవితలు పార్ట్ 31 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


మన భవితవ్యం

(కవిత)

**********************************

పదాల పదనిసలు

ఇవ్వబడిన పదములు:( వేదనం, రోదనం, లేదనం, కాదనం,శోధనం, వాదనం,ఇంధనం,చందనం,సాధనం, వందనం.)

********


వృక్షజాతులేవి? వాటి కోసం

మదిలో తెలియని ఆవేదనం.

పక్షులు, పశువులు చేస్తున్నాయి 

నిరంతరం బిగ్గరగా రోదనం.


మనుజుల్లో ప్రకృతి కాంతపై

కొంతైనా ప్రేమ భావన లేదనం.

మనికి నిల్పే కార్యములు

చేయరన్న సత్యాన్ని కాదనం.


పుడమి తల్లిని ఏ రీతిగా

రక్షించాలని జ్ఞానుల శోధనం.

చెడు దారిలో నడిచే వారితో

ఎందుకులే వ్యర్థమౌ వాదనం.


జీవరాశికి కావాలి సతతం

పచ్చదనమనే ఇంధనం.

భవితవ్యమును నిల్పే 

వారికి అభినందన చందనం.


ప్రకృతి మాతను పూజింజి

దీక్షతో చేద్దాము సాధనం.

సుకృతమైన కార్యాలు చేసే

పుణ్యాత్ములకు భక్తితో వందనం.//


************************************














నేటి న్యాయము.

(కవిత )


************************************


గుడ్డిదై న్యాయమ్ము కూలబడిపోయింది.

చెడ్డదై చట్టమ్ము చెలరేగి పోతోంది.


కోట్లు మ్రింగినవారు గొప్పవారవుతారు.

పాట్లుపడు జనులెల్ల బాధలనుభవిస్తారు.


పేదల బ్రతుకులందు భీతి పొడసూపగా

ఆదరము చూపించు నాత్మీయు లెక్కడో?


సమసమాజంబేది? సంఘమున కనరాదు.

కుమతులే వర్థిల్ల కుంటిదైపోయింది.


నిజమునే గుర్తెరిగి నిగ్గు తీయుచు ప్రభుత

ప్రజల కెల్లప్పుడు సుపాలనం బొసగాలి.


ధర్మ నిలయంబులో తలయెత్తి త్రాసుతో

ధర్మదేవత యెపుడు దైవమై నిలవాలి



కట్టుబాట్లను నిల్పి క్రమశిక్షణను నేర్పి

చట్టమంటే జాతి స్థైర్యమును పెంచునది


నీతిమంతుల కెపుడు నెయ్యంబు చట్టమని

జాతినే నడిపించు శక్తి కలిగించాలి.


న్యాయ దేవత నేడు నవ్యపథమున సాగు

ధ్యేయంబుతోనిల్చి దిశలు వెలిగించాలి.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




bottom of page