top of page

 మనకు దిశా నిర్దేశాలు కావాలి



'Manaku Disa Nirdesalu Kavali' - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 24/02/2024

'మనకు దిశా నిర్దేశాలు కావాలి' తెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


మండే ఎండలతో గ్రీష్మం వచ్చేసింది  

రుతువులు మారడం  ప్రకృతి సహజం

సాగర తీరాలు నదీ తటాకాలు 

సేద తీరే జనాలతో నిండిపోతున్నాయి


ఏ ఋతువులైనా మురిపించే అందాలు 

మరీ మరీ చూడాలనిపించే దృశ్యాలు

ఎన్నెన్ని ఆటలు ఎన్నెన్ని ఆశలూ 

కలబోసుకున్న మధురానుభూతులు


ఎవరూలేని ఏకాంతంలో 

నీవునేనై నేను నీవై 

పరవసించిన రోజులు

కనులముందు కదలాడు జ్ఞాపకాలు

 గుర్తుకొస్తుంటాయి !

 

అంతులేనిసాగరంలో 

అలుపెరుగని అలలసవ్వడిలో 

తడిసిన మేని పులకింతలు  

చీకటి కమ్మిన ఆకాశంలో 

అలిసిన తారలు 


నెలరాజు కౌగిలిలో వొదిగిపోయిన రాత్రులు  

కాలమే తెలియక వున్నచోటులో 

కదలనీయక చల్లనిగాలి జోకొడుతుంది

కడలిని చిలికిన అలలు  


తెల్లని నురుగు పాదాలమీద పేరుకుంటూ 

గిలిగింతలు పెడుతోంది  

సముద్రం ఎప్పుడూ ఉరకలు వేస్తూనే ఉంటుంది   అలుపులేక తీరాన్ని ఢీకుంటూనే ఉంటుంది    

సాగరతీరాలు సంతోషాలకు నెలవులు 

సార్ధకం  చేసుకునేవారికి మధురమైన అనుభవాలు !


ఆకాశంలో చంద్రోదయం మొదలు తెల్లవారేవరకూ మారుతున్న  కళలను చూడాల్సిందే  

నిశబ్ద నీరవ నిశీధిలో కూడా అందం ఆకట్టుకుంటుంది  ఏకాంతంలో ఐనా  పరవశించి పోవచ్చు

కళా హృదయానికి  కాల మాన పరిస్థితులతో పనేముంది ఆస్వాదించే మనసుంటే చాలు

మనసున్న మనిషికి జగమంతా నందనవనమే  పలకరించే ప్రకృతి స్నేహితుడే అవుతుంది

పంచభూతాలు ప్రపంపంచమంతా ఆవరించి ఉంటాయి  ఒక దేశంఒక ప్రాంతానికే పరిమితం కాదు

ఆనందానికి హద్దులుండవు మనమే సృష్టించుకుందాం అన్వేషణకు పరిమితి లేదు సాగిపోదాం !


ఎవరో వస్తారని ఏదోచేస్తారని ఎదురుచూడటం సిగ్గుచేటు మనమే చేద్దాం అనుకుంటే సాహసం

సాధించ్చామా  విజయానికి తొలి సూచన లేదంటే  సాధించేదాకా ప్రయత్నం చేయి  అది పట్టుదల

జీవితకాలమూ ఎదో చేయాలని తపన మనిషికి అవసరం చేసింది చాలు అనుకోడం బలహీనత

ప్రయోగాలు ప్రయత్నాలు ధ్యేయం కావాలి వాటికి ముగింపు వుండకూడదు ఆ ఆలోచనచేయవద్దు

ఎంతసాధించినా కొంతమిగిలేవుంటుంది అందుకు వయసుఅడ్డంకికాదు జీవితకాలమూ పనిచేసే వారున్నారు

భారత సుప్రీం కోర్ట్ న్యాయవాది రోహింటన్ ఫాలీ నారిమన్ చివరి శ్వాస వరకూ సేవలు అందించారు


ప్లీజ్ రీడ్ వికీపీడియా .

ఎందరో మహానుభావులు 

వారే యువతకు స్ఫూర్తి కావాలి.

*****************

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)






25 views0 comments

Comments


bottom of page