top of page
Original.png

మనసా! తెలుసా!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ManasaTelusa, #మనసాతెలుసా


ree

Manasa Telusa - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 04/12/2025

మనసా! తెలుసా!  - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


ఏమిటీ  జీవితం? - ఎందుకీ  మనోవ్యథ?

వయసు పటుత్వంలో  నేను - నా కుటుంబం  అని  ప్రాకులాడేవు. 

నాభర్త- నా పిల్లలే   ప్రపంచమని  బ్రతికేవు. 

రెక్కలొచ్చిన  పిల్లలు  గూడుకై ఎగిరిపోయినారు. 

ఒట్టిపోయినవని  మనువాడినాడు  వదిలె.   

ఏరుదాటినాక  తెప్ప స్థితి  వలే  అయినావు నీవు.

నీకై  నీవు  బ్రతుకుతెరువు  తెలీని   అనామకురాలివి.

ఏదారీ కానరాని  నడిసంద్రం లోని  నావ బ్రతుకు  నీది. 

ఈత చేతకాదు - అద్దరి  కానరాదు. 

అగాథ బ్రతుకులో  కానరాని  వెలుగుకై  తాపత్రయమెందుకు?

కనువిప్పు  కలిగి  నీకై నీవు  బ్రతుకుదామనుకుంటే  తనువు, శక్తి సహకరించదాయె. 

అంగబలం - అర్థబలం  లేని  అనాథవి నీవు.    


ఎవరికోసం  ఈ అంథకార  బ్రతుకు?

ఎంతవరకీ   అలవికాని  బాధలు?


  

…..నీరజ హరి ప్రభల. 



ree

-నీరజ  హరి ప్రభల

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page