top of page
Writer's pictureNeeraja Prabhala

మనిషి జీవిత సత్యం….


'Manishi Jeevitha Sathyam' New Telugu Article

Written By Neeraja Hari Prabhala

'మనిషి జీవిత సత్యం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)





మనిషి జీవిత సత్యం….

పుట్టిన ప్రతి మనిషి మనమే ఒక రాజు, ఒక రాణి. మన ఇల్లే మన సామ్రాజ్యం. ఏవిధంగా నైనా చెలామణి చేసుకునే మన మాటే రాజ శాసనం అని గర్వంగా విర్రవీగుతాడు. అది మానవ సహజం.

మన శరీరం పిండము, రక్తమాంసాలు, ఎముకలు, సప్తధాతువులతో ఏర్పడింది. ఇది పుడమి నుంచి ఏర్పడి మరలా అందులోకే మమేకమయ్యేది. "జాతస్య మరణం ధ్రృవ". పుట్టిన మనిషి గిట్టక మానడు. గిట్టిన మనిషి పుట్టక మానడు. ఇది చక్రభ్రమణం. ఈ కాల చక్ర భ్రమణాల మధ్య మనం నిరంతరం నలుగుతూ చస్తూ ఉంటాం, మరలా పుడుతూ ఉంటాం. కానీ కాలం, ప్రాయం, మనసు ఆగవు. వాటికి వేగమెక్కువ. మన శరీరం అశాశ్వతమైనది. దానికి చావు ఉంది. ఆత్మ చావదు. మనిషి చనిపోయిన తర్వాత వాళ్లు చేసిన పాపపుణ్యల కర్మానుసారం వాడి ఆత్మ వేరే పిండంలోకి వెళ్లి ఇంకో జన్మ ఎత్తుతుంది. ఎవరో ముముక్షవులకు, యోగులకు, మహాభక్తులకు జన్మ రాహిత్యం ఉంటుంది. ఉ….రామదాసు,పురంధరదాసు, కబీరుదాసు, త్యాగరాజస్వామి, అన్నమయ్య మొ… వారు.

మనిషికి ఉండే అరిషడ్వర్గాలు ( అనగా 6 )

1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు. వాటివైపే మన మనస్సు లాగుతూ ఉంటుంది.

స్పర్శ, శబ్ధ, రూప, రస ,గంధ(వాసన)లు అని మనిషి శరీరం ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలతో కలిసి మనస్సు అధీనంలో పని చేస్తుంటాయి. ఈ ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచంతో అనుబంధం కలిగి విషయాలను మనస్సుకు అందిస్తుంటాయి.

ఈ జీవితం ఒక నాటకం. ఇందులో మనం వివిధ రకాల పాత్రలను పోషిస్తున్నాము. మన పాత్ర అయిపోగానే మృత్యువు అనే ఆఖరి అంకంతో మనం కనుమరుగవుతాము. ఇది వాస్తవం.

సంసారమనే సాగరంలో 'మనస్సు' అనే చేప కోరికల అలల అలజడుల వలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ అలల తాకిడికి తట్టుకోలేక జీవి తను బ్రతికి ఉన్నంతకాలం అశాంతితో నలిగిపోతూ ఉంటాడు. కోరికలు అంతులేనివి. అవి అనంతం. అలాగే కష్టసుఖాలు కూడా వెలుగునీడలు లాంటివి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సుఖాలకు "ఆహా" అంటూ, కష్టాలకు "అయ్యో, అమ్మో" అంటాం. వాటిని ఎదుర్కొని తట్టుకునేంత మనో నిబ్బరం మనకు ఉండదు. మనం మానవులం కదా!

మనసులో ఉండే అనంతమైన కోరికలను అదుపుచేసుకోవాలి. మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకుని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే జ్యోతిని వెలిగించి 'మనస్సు' అనే సుమాన్ని భక్తి అనే దారంతో ముడివేసి మాలగా కూర్చి ఆ మాలను పరమాత్మ పాదాలకు "తండ్రీ! నీవే శరణు. నీవే దిక్కు " అని రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చాలు. అందుకు మనం అహంకారాన్ని, నేను, నాదీ అనే స్వార్ధాన్ని, సంసారం మీది మోహాన్ని విడనాడాలి. అది చెప్పటం తేలిక కానీ ఆచరణ అసాధ్యం.

చనిపోయేదాకా ఈ మాయాజగతిలో ఐహిక సుఖాలే సత్యం అని భ్రమసి కుడితిలో పడ్డ ఎలుక లాగా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దేహం ఒడలి ఇంద్రియాలు వశం తప్పాక అప్పుడు కాస్తన్నా వాడి వాడి పూర్వజన్మ కర్మానుసారం అప్పుడు దైవ చింతన కొందరికి అలవడుతుంది. కానీ అప్పుడు ఏం చేయలేడు కదా! నోరు పెగలదు, లేవటానికి శక్తి ఉండదు. శరీరం సహకరించదు. పైగా అనారోగ్యం, వార్ధక్య బాధలు చుట్టుముట్టి మనసు నిగ్రహం ఉండదు. అహర్నిశలు మృత్యుభయం వెంటాడుతుంది.

ఇంకొందరికి ఆ పరిస్థితులలో దైవ చింతన కూడా అలవడదు. ఇంకా ధనవ్యామోహం, భార్యాపిల్లలు అన్న మమకారం ఎక్కువ అవుతుంది. ఇంకొందరు తాము కష్టపడి సంపాదించిన ఆస్తిని వారసులు వశం చేసుకుని ఇంటినుంచి గెంటి వేస్తే అదో బాధ. వీటితో మనసు నిబ్బరం కోల్పోయి మతిభ్రమించడం కూడా ఉంటుంది. జీవితమంటే ఇలా చిత్ర విచిత్రాలు.

అందుకే 'తామరాకు మీద నీటి బొట్టు' లాగా ఉంటూ దేని మీద వ్యామోహం పెంచుకోకుండా నీ కర్మను నీవు చేయి. ఫలితాలను ఆశించవద్దు. అని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో మనకు బోధించాడు. ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు శ్రీకృష్ణుడు. (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)*

జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.

శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అనే గోవును అడ్డు పెట్టుకుని 'వేదం' అనే గోవు పొదుగు క్షీరాన్ని పితికి ' 'భగవద్గీత' ను జ్ఞానరూపంగా చేసి ఆ జ్ఞానామృతాన్ని మనందరికీ ప్రసాదించాడు.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏





139 views0 comments

Comments


bottom of page