top of page

ఉగాది 2023 కథలు, నవలల పోటీ ఫలితాలు

'Ugadi 2023 Telugu Story And Novel Competition Results

By Admin - manatelugukathalu.com

ఉగాది 2023 కథలు, నవలల పోటీ ఫలితాలు


విషయ సూచిక

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2 . ఉగాది 2023 కథల పోటీల ఫలితాలు

3. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీల ఫలితాలు

4. ఉగాది 2023 జోక్స్ పోటీల ఫలితాలు

5. విజయదశమి 2023 కథల పోటీలు

6. గమనిక

7. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2023 ఫలితాలు


1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )


వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.

రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు.

వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.

*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


2 . ఉగాది 2023 కథల పోటీల ఫలితాలు


ఎప్పటిలాగే ఊహించినదానికంటే ఎక్కువ కథలు పోటీకి వచ్చాయి.

దాదాపు అన్ని కథలు చక్కగా ఉన్నాయి.

కానీ పోటీ అన్నాక విజేతలను ప్రకటించాలి కాబట్టి న్యాయ నిర్ణేతల తీర్పును శిరసావహించి ఫలితాలు ప్రకటిస్తున్నాము.

పోటీల ప్రకటనలో చెప్పినట్లు బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడ్డాయి.

ముందుగా ఒక ప్రథమ బహుమతితో పాటు ఐదు విశిష్ట(ప్రత్యేక బహుమతులు) అందజేస్తామని ప్రకటించాము. కానీ చక్కటి పోటీ ఉండటంతో పది విశిష్ట(ప్రత్యేక బహుమతులు) అందజేస్తున్నాం.

ప్రథమ బహుమతి పొందిన కథ

(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)


విశిష్ట(ప్రత్యేక బహుమతులు) పొందిన కథలు

3. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీల ఫలితాలు


ముందుగా పోటీకి తగ్గ రచనలు పంపి పోటీని రసవత్తరం చేసిన రచయితలకు, చదివి ఆదరించిన పాఠకులకు మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం.ఒకటి రెండు రచనల్లో కథనంలో కొన్ని లోపాలు వున్నా, మిగిలిన నవలలన్నీ చాలా చక్కగా ఉన్నాయి.

ముఖ్యంగా మూడు నవలలు అన్నిట్లో పోటాపోటీగా ఉన్నందువల్ల ప్రథమ బహుమతికి మూడు నవలలు ఎంపిక చేసాము. బహుమతి మొత్తం ఆయా రచయితలకు సమంగా పంచడం జరుగుతుంది.

ప్రథమ బహుమతికి ఎంపికైన నవలలు:

(నవల పేరు పైన క్లిక్ చేయడం ద్వారా నవల మొదటి భాగాన్ని చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)

ఈ క్రింది ఆరు నవలలకు విశిష్ట(ప్రత్యేక) బహుమతిని అందిస్తున్నాం.


ఈ క్రింది రెండు నవలలకు కన్సొలేషన్ బహుమతిని అందజేస్తున్నాం.



4. ఉగాది 2023 జోక్స్ పోటీల ఫలితాలు:


పోటీ కాలంలో అత్యధికంగా జోక్స్ పంపి విజేతగా నిలిచిన వారు: ఓట్ర ప్రకాష్ రావు

బహుమతి మొత్తము Rs: 1000/- వీరికి పంపడం జరుగుతుంది.


5. విజయదశమి 2023 కథల పోటీలు:


సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022, విజయదశమి 2022, ఉగాది 2023 కథల పోటీలు మరియు ఉగాది 2023 నవలల పోటీలువిజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము


ఇప్పుడు విజయదశమి 2023 కథల పోటీని ప్రకటిస్తున్నాము.


పోటీల కోసం ప్రత్యేకంగా కథలు పంపాల్సిన అవసరం లేదు.


ఉగాది 2023 కథల పోటీల గడువు 20 /03 /2023 తో ముగుస్తుంది.


ప్రచురణ 05 /04 /2023 నాటికి పూర్తవుతుంది.


కాబట్టి 06 /04 /2023 నుండి 15 /10 /2023 వరకు ప్రచురితమయ్యే కథల నుండి విజయదశమి 2023 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది.


ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.


విజయదశమి 2023 కథల పోటీ బహుమతుల వివరాలు :


ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-


ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-


మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.


నిబంధనలు :


*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.


*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.


*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.


*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.


మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.


*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.


* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.


*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 15/10/2023

*ఫలితాలు 15/11/2023 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.


6. గమనిక:


కొత్త రచయితల సమాచారం కోసం...


కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.


మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.


అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.


అక్టోబర్ 2022 నుండి 05 /04 /2023 వరకు ప్రచురితమై, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి ఉగాది 2023 బహుమతులు ఎంపిక చెయ్యబడ్డాయి.


అలాగే 06 /04 /2023 నుండి అక్టోబర్ 2023 వరకు ప్రచురింపబడి, వీక్లీ ప్రైజ్ కి ఎంపికైన కథలనుండి విజయదశమి 2023 బహుమతులు ఎంపిక చేయబడతాయి.


ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.


కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.


మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.


మీ రచనలు మెయిల్ ద్వారా మాకు పంపవలసిన చిరునామా: story@manatelugukathalu.com

(చివరన gmail .com లాంటివి లేవు.)


మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు. గ్రూప్ లో చేరదలచినవారు 63099 58851 కి వాట్సాప్ చెయ్యండి.


7. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2023 ఫలితాలు


అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2023 వరకు పొడిగిస్తున్నాము.


రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.


బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.


విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.


మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.


వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.


మార్చ్ 2023 ఫలితాలు


(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)


మాకు సహకరిస్తున్న రచయితలకు, పాఠకులకు మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




366 views0 comments
bottom of page