కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి
'Mana Sampradayam' New Telugu Story
Written By Mukkamala Janakiram
రచన: ముక్కామల జానకిరామ్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
చైత్ర 4 వ తరగతి చదువుతుంది. నాన్నంటే అమితమైన ప్రేమ.నాన్న ఏ పని చెప్పినా చిటికెలో చేసేది.అది చూసి వాళ్ళ అమ్మ కూడా సంతోషపడేది. సాయంత్రం పనికి వెళ్ళిన నాన్న ఇంటికి రాగానే కూతురుతోనే గడిపేవాడు.
కానీ ఒక విషయంలో మాత్రం నాన్న మీద కోపంగా ఉండేది చైత్రకు. నాన్న అంటే కొంచెం భయం కూడా ఉండడంతో నాన్నతో విషయం చెప్పకపోయేది.
నాన్న పనికి వెళ్ళినప్పుడు 'నేనే కుర్చీలో కూర్చుంటాను నువ్వు నాన్నతో చెప్పు' అని అమ్మతో గొడవపడేది చైత్ర.
'నాన్న వయసులో పెద్దవాడు కదా తల్లీ ! కింద కూర్చొని భోజనం చేయాలంటే నాన్నకు కష్టంగా ఉంటుంది' అని అమ్మ చైత్రకు సర్దిచెప్పేది.
'నాన్న వింటే బాధ పడతారు ఇంకా ఎప్పుడూ అలా అనకు తల్లీ?' అని అమ్మ ఎంత సర్ది చెప్పినా చైత్ర మనసులో నేనే కుర్చీ మీద కూర్చొని తినాలని అనుకునేది.
చైత్ర వాళ్ళ తాతయ్య, చైత్రను చూడడానికి పండ్లు తీసుకొని వచ్చాడు. పనికి వెళ్లిన నాన్న సాయంత్రం ఇంటికి రాగానే తన తండ్రి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. రాత్రి భోజన సమయంలో చైత్రతో పాటు నాన్న కూడా కిందనే కూర్చొని భోజనం చేయడంతో చైత్ర ఆశ్చర్య పడింది.
'ఎప్పుడూ కుర్చీ పై కూర్చొని తినే నాన్న ఈ రోజు కింద కూర్చున్నాడు' అని మనసులో అనుకుంది. తాతయ్య వారం రోజులు ఉండి వెళ్ళాడు. ఆ వారం రోజులూ నాన్న కింద కూర్చొనే భోజనం చేశాడు.
'అమ్మా! అమ్మా! నాన్న కింద కూర్చొనే భోజనం చేశాడు ఏంటి' అని అడిగింది.
'అమ్మా చైత్రా! మన ఇంటిలో భోజనం చేయడానికి ఒకటే కుర్చీ ఉన్నది. అది నీకు తెలుసు కదా!. తాతయ్య వయసులో నాన్న కన్నా పెద్దవారు. కింద కూర్చోలేరు. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. మనకన్నా వయసులో పెద్దవారిని మనం గౌరవించాలి. అందుకే నాన్నగారు కింద కూర్చున్నారు ' అని అమ్మ చెప్పగానే తన తప్పు తెలుసుకున్న చైత్ర నాన్నపై ఉన్న కోపాన్ని విడిచిపెట్టింది.
ఇంటికి పెద్దలెవరు వచ్చినా తను లేచి వారికి కుర్చీ ఇచ్చి, వారిని గౌరవించేది. వారికి కావలసిన పనులు చేసి పెట్టి ప్రేమగా మాట్లాడేది. చైత్రలో వచ్చిన మార్పుకు తల్లి చాలా సంతోషించింది.
ముక్కామల జానకిరామ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: ముక్కామల జానకిరామ్ M. A., B. Ed., D. Ed
స్కూల్ అసిస్టెంట్- తెలుగు
నల్గొండ జిల్లా
తెలంగాణా
Siva Kumar • 8 hours ago Smart and short story, super sir
Burugu gopikrishna • 13 hours ago
సమాజాన్ని ప్రేరేపించే కథ సాహిత్యం రాస్తున్న జానకిరామ్ కు అభినందనలు
kummari Anusha • 13 hours ago
Wow super sir ️
Naresh Sepuri • 13 hours ago
Good
Sravan Kumar • 13 hours ago
Best story