వింత
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Vintha, #వింత, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Vintha - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 27/02/2026
వింత - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"నమస్కారం గురుజీ! తదుపరి రాశి.. మకరరాశి గురించి చెప్పండి"
"ఏమిటే చెప్పేది! నేను నీ మొగుడుగారిని.. గురుజీని కాదు. రాత్రైతే చాలు ఊరకే కలవరింతలు.."
అంటూ తట్టి లేపాడు భర్త రాజా.
"ఏమిటండీ నా నిద్రంతా పాడుచేసారు" అంటూ నిద్రలేచిన పెళ్ళాం రోజా అంది.
"నీ నిద్రలో కలవరింతలు కాదు గానీ...పక్కన ఉన్న నాకు రోజూ శివరాత్రే.."
"ఏం కలవరించానండి...మీరు క్షేమంగా ఉండాలని మీ పేరే కలవరించి ఉంటాను..అంతేగా"
"నీ మొహం..! ఎంత సేపు గురుజీ గురుజీ అంటావేంటి? ఎవరాయన? ఏమిటో ఈ వింత కలవరింతలు?"
"అదా..నేను ఈ మధ్య టీవీ లో ఒక షో ఒప్పుకున్నానుగా..అందులో గురువుగారు..."
"మరీ కలవరించాలా?"
"ఒక రెండు సంవత్సరాల నుంచి నన్ను ఆ షోలోనే ఉంచారు..ఏం చెయ్యను?"
"అదా సంగతి!"
"యాంకర్ గా నా పని అదే కదా...నమస్కారం, తదుపరి రాశి, ఏ దానాలు ఇవ్వాలి..కాస్త విరామం అంటూ యాడ్స్ లిస్టు గుక్క తిప్పుకోకుండా చదివెయ్యాలి. ఇదే కొన్ని సంవత్సరాలనుంచి జరుగుతోంది. మీరు దుబాయ్ నుంచి ఈ మధ్యే వచ్చారుగా.. మీకు తెలియదు లెండి"
ఏ సినిమా షోకో యాంకరింగ్ చేస్తే, కనీసం సినిమా ఛాన్స్ అయినా వచ్చేదేమో...ఇప్పుడు చూడు గురుజీ గురుజీ అని అక్కడే ఉన్నావు. పోనీ జాతకం చెప్పడం ఏమైనా వచ్చిందా అంటే..?అబ్బే శూన్యం..రాసుల పేర్లు కూడా సరిగ్గా పలకడం ఇంకా రాదు. రోజుకొక కొత్త చీర కట్టుకోవడం, నగ పెట్టుకోవడం, అవీ వాళ్ళు ఇచ్చినవే..! గురుజీ..గురుజీ ఇది చెప్పండి అది చెప్పండి అని అనడం తప్పితే నీకు ఏమైనా వచ్చిందా?"
"ఏం చెయ్యమంటారండీ..నాకు ఇదే ఇచ్చారు మరి. మీరు పంపే డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోవు. మార్కెట్లోకి రోజుకొక కొత్త మోడల్ శారీస్ వస్తున్నాయి..మరి ఎలా కొనాలి చెప్పండి..అందుకే ఒప్పుకున్నా మరి"
"సంతోషించాములే.."
"మీకు కనిపించినవాటికంటే మా కష్టాలు వేరే ఉన్నాయి లెండి.."
"ఏమిటో..?"
"అరగంట సీరియల్ కోసం, రోజంతా షూట్ చేస్తారు..నాకా తెలుగుపలకడం సరిగ్గా రాదు..దానికీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంతో ప్రాక్టీసు చేస్తే గానీ పలకవు నాకు ఆ తెలుగు మాటలు. రెండు సంవత్సరాలలో ఇప్పుడు రాసుల పేర్లు చెప్పడం కొంచం వచ్చింది...వాటికీ ఎంత ప్రాక్టీసు చేసానో ఆ దేవునికే తెలియాలి"
"వేరే జాబ్ చూసుకోవచ్చుగా మరి? అదే ఎందుకు?"
"ఏం చేస్తాను లెండి..మనకున్న అందానికి ఇది రావడమే గొప్పని అందరూ అంటూ ఉంటె.. నిజమే కదా అని అందులోనే ఉండిపోయా. కాకపోతే మధ్యలో ఒక సారి ఒక షోకి యాంకర్ ఛాన్స్ వచ్చింది"
"ఏం ప్రోగ్రాం అది? ఏమైంది మరి?"
"అదా..కొత్తగా పెట్టిన ఛానల్ కోసం..'ఆరోగ్యం చూసుకోండి' ప్రోగ్రాం కోసం"
"హెల్త్ ప్రోగ్రాం.. చేస్తే బాగున్నుబాగుణ్ణు కదా..."
"అక్కడ కష్టాలు అక్కడ ఉన్నాయి లెండి..అందుకే మానేసాను"
"చెప్పు! చెప్పు! ఆసక్తిగా ఉంది"
"ఆ ప్రోగ్రాంలో అంతా... అవి తిను, ఇవి తినకూడదు, అలా చెయ్యి, ఇలా ఉండకూడదని చెప్పే ప్రోగ్రాం. అందులో గురుజీ చాలా స్ట్రిక్ట్. ఐస్ క్రీం తినకూడదు, స్వీట్స్ తినకూడదు, ఆసనాలు వెయ్యాలి, అవితినకూడదు, ఇవే తినాలి అని అందరికీ చెప్పేలాగే నాకూ షరతులు పెట్టారు. జ్యూస్ కూడా వెరైటీ జ్యూస్ లు..ఆకులతో కలిపి తాగమని రోజు ఉదయం ఇచ్చేవారు. అలా తాగితేనే నన్ను యాంకర్ గా ఉంచుతానని అన్నారు. రోజూ షో ముందు ఒక పది ఆసనాలు కూడా వెయ్యాలంట...వొళ్ళు హూనం అయ్యేది"
"ఆసనాలు మంచివే కదా.."
"మంచివే కానీ, నాకు కష్టమే..బద్ధకం ఎక్కువ కదా...ఏం చెయ్యను?"
"అవును లే..మంచివేవీ మనకి నచ్చవ్"
"పైగా ఆయన యాంకర్ కూడా ఆరోగ్యంగా ఉండి...వెయిట్ రోజు చూసి ఒక్క వంద గ్రాములు పెరిగినా, తీసేస్తామని బెదిరించేవారు. అసలే నాకు స్వీట్స్ అంటే ప్రాణం..నోరు కట్టుకుని ఒక ఆరు నెలలు చేసాను..వంద గ్రాములు పెరగడం కాదు కదా..పది కిలోలు తగ్గిపోయాను. ఇంత బక్కగా, వింతగా ఉంటె.. నువ్వు మా షోకు పనికిరావని పంపించేసారు. అప్పుడే ఇక్కడ జాయిన్ అయ్యాను"
"పది కిలోలు తగ్గిపోయావా? నీ పరిస్థితి చాలా వింతగా ఉందే"
"మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అయి, ట్రీట్మెంట్ తీసుకుని, కిలోలు కిలోలు జ్యూస్ లు తాగితే కానీ మళ్ళీ మాములు మనిషిని కాలేదు..నాకు మాత్రం ఆ ప్రోగ్రాం వర్కౌట్ కాలేదు"
"అవునా..? నువ్వు దక్కావు..అదే చాలు. ఇక ఈ షోలు అవి మానెయ్..నిన్ను చూసి చూసి జనాలకు కూడా బోర్ కొడుతుందిగా" అన్నాడు రాజా.
సమాప్తం.
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ





Comments