top of page

భారవి భారం'Bharavi Bharam' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 26/02/2024

'భారవి భారం' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంతభారవి అద్దంలో చూసుకుంటే, ఎంతో లావుగా, కనిపించడంతో, ఎలాగైనా ఒళ్ళు తగ్గాలనుకుంది. ఇంతలో టీవీలో డాక్టర్ బక్కేషు గారు, బరువు తగ్గటానికి కొన్ని సలహాలు ఇస్తారనటంతో, టీవీకి, కళ్ళు, అప్పగించింది. మాట్లాడుతున్న డాక్టర్ బక్కేష్, చాలా బక్కగా స్లిముగా వున్నాడు. 


 ఆయన తన స్లిమ్ కేర్ క్లినిక్కు వస్తె, ముప్పైరోజుల్లో ఎవరినైనా నాలాగా తగ్గించి చూపించే పూచీ నాదని చెప్పాడు. వెంటనే, క్లినిక్ అడ్రస్ నోట్ చేసుకుంది భారవి. 


 "చెప్పండి మీ ప్రాబ్లమ్"అన్నాడు డాక్టరు బక్కేష్ తన ఎదురుగా కూర్చున్న భారవితో. 


"ఏంటో డాక్టరుగారు! ఒకటే ఆయాసం. రెండు అడుగులు వేస్తే ఒకటే ఎగశ్వాస"

 

 "అవునా! ఎప్పటి నుండి ఇలా!" అన్నాడు డాక్టర్. 


 "ఒక పదిరోజుల నుండి. " 


"ఆహా! ఇంకా" భారవినీ చెప్పన్నట్లు డాక్టర్ చూడటంతో "నీరసంగా కూడా వుంటుంది. ఆ నీరసం తగ్గటానికి అన్నం ఎక్కువగా తింటున్నాను. చిరుతిండి మాత్రం నూడుల్సు, పానిపూరి తప్ప ఇంకేమీ తినను”. 

 

 'మాయమ్మే! అవిచాలు, నువ్వు, బలవటానికి, మేము, రిచ్ అవ్వటానికి అనుకున్నాడు' డాక్టర్ బక్కేష్, మనసులో. 


"ఇపుడు వళ్ళు తగ్గటానికి కేవలం ఆరు చపాతీలు తింటున్నా" 

అంది.


 "ఇంక మీరు అన్నిటిని, నిర్భయంగా తినవచ్చు. మా దగ్గరికి వచ్చారుగా! మీ భారంను మాపై వేయండి. భారవి నైస్ నేమ్. మీకు ఈ పేరు, ముందే పెట్టారా తర్వాత పెట్టారా! మీ పేరెంట్స్" చిరునవ్వుతో అడిగాడు డాక్టరు. 


"అబ్బే! పుట్టినపుడు సన్నగా వుండేదాన్ని. బా అక్షరంతో పేరు పెట్టాలంటే ఆ పేరు పెట్టారు అంది సిగ్గుపడుతూ, భారవి. 


'కానీ ఆ పేరుకు న్యాయం చేసారుగా!' అనుకున్నాడు మనసులో బక్కేష్. 

 

 "తినోచ్చా అన్నీ!" ఆశగా అడిగింది. 


"తప్పక తినొచ్చు" అన్న డాక్టర్తో "తింటే ఆయాసం, తినకపోతే, నీరసంగా ఉంది, నా పరిస్థితి డాక్టర్" అంది భారవి. 

"బరువు తగ్గాలి ముందు మీరు”.  

‘అయినా కొన్ని టెస్ట్స్ రాయాలి! లేకపోతే ఈ హాస్పిటల్ను నడపటం కష్ట’మనుకుని "మీకు కొన్ని టెస్ట్స్ రాస్తున్నాను, అవి చేయించుకుని రండని" చెప్పి పంపాడు డాక్టరు. 

 

 టెస్టుల్లో ఏమి లేకపోవటంతో డాక్టర్ భారవితో "మీకు ఎటువంటి జబ్బు లేదు. వయసు కన్నా మించి బరువున్నారు. అందువల్ల ముందు బరువు తగ్గాలి. లేకపోతే బీపీ, షుగర్, కీళ్లనొప్పులు వస్తాయి. అన్నం కప్ కన్నా ఎక్కువ తినకూడదు. టీవీ చూస్తూ తినకండి. మందులిస్తాను. ఒక నెల తర్వాత రండ”న్నాడు డాక్టర్. 


"ఆకలి వేయకుండా టానిక్ వుంటే ఇస్తారా" అంది భారవి. 


"ఇపుడు నే రాసిన మందులకి ఆకలి కూడా తగ్గుతుంది, ఏమి కంగారు పడకండి" అన్నాడు డాక్టర్. 

 

 ఇంటికి రాగానే "ఏమండీ! ఆ డాక్టర్ మీకేమి లేదు అన్నీ నార్మల్! ముందు బరువు తగ్గాలన్నాడు" అంది భారవి.


 "అది నేను ఏపుడో! చెప్పాగా" అన్నాడు, భారవి భర్త, విసుగేష్. 


ఈ పెరేంటి అనుకుంటున్నారా ఈయన అసలు పేరు విశేష్. కానీ! పుట్టిన దగ్గరనుండి విసుగు ఎక్కువగా వుండటం వల్ల విశేష్ కాస్తా విసుగేష్ అయింది. 

 

 "ఏమండి నేను ఇంట్లో తింటుటే చూసినట్లే చెప్పాడు. టీవీ చూస్తూ తినవద్దన్నాడు. ఒక కప్ రైస్ తీసుకోమన్నాడు" డాక్టర్. 


"నేను అదే కదా! చెప్తుంది. ఆ టీవీల్లో వచ్చే వంటలన్ని చేస్తూ.. ఆ దిక్కుమాలిన సీరియల్ నా చిన్నప్పటి నుండి వస్తున్న డబ్బారేకులు చూస్తూ తినటం. సాయంత్రము ఆరు ఇంటికి తింటం మొదలు పెడితే రాత్రి పదికి కానీ! ఆనోరు, టీవీ, రెండిటినీ, కట్టేయవుగా! ఎంత వదిలించావు ఆ డాక్టరుకు" అన్నాడు విసుగేష్ కోపంగా. 

 

 ఇంతలో "అమ్మా, ! ఎక్కడికి వెళ్ళావంటూ!" పిల్లాడు గణేష్ ఒక పెద్ద బొచ్చలో నూడుల్స్ తింటూ వచ్చాడు. "ఇంకా నాకు వద్దని" ఒక హాఫ్ బొచ్చ అమ్మకు ఇచ్చాడు, "పార వేయకూడదు తప్పు నాన్న" అంటూ! గబగబా, నూడుల్స్ తినేసింది. 


"నీ తిండి తగలేయ్యా! ఇది చెప్పలేదా! పిల్లలు వదిలేసినవి తినవద్దని డాక్టర్" అన్నాడు విసుగేష్ విసుగ్గా. 


 ఇంతలో, డాక్టర్, కాల్ చేసాడు, "హాల్లో, స్లిమ్ కేర్ నుండి డాక్టర్, బక్కేషును మాట్లాడుతున్నాను "


“ఏమండీ, డాక్టర్, గారే కాల్ చేస్తున్నారంది" భర్తతో. 


"హెల్లొ భారవిగారా!" 

"అవునండీ, " అన్న భారవితో. "మీకో గుడ్ న్యూసు, మీరు స్లిమ్ అవ్వటానికి, ఏమి చెల్లించనక్కరలేదు. మేమన్నీ ఫోన్ నంబర్సును లక్కి డీప్లో డ్రా తీస్తే, మీ నంబర్ వచ్చింది. రేపే వచ్చి జాయిన్ అవ్వండనీ" ఫోన్ పెట్టేసాడు. 


 "ఎపుడూ, ! నిన్ను కట్టుకోవటం వల్ల నాకు కలిసి రాలేదంటారుగా, చూడండి!, ఇపుడు, నాకు లక్కీ డీప్, తగిలి, బరువు తగ్గటానికి ఏమి! డబ్బులు కట్టక్కరలేదుటా!" అంది భారవి. "దీంట్లో, యేదో కిరికిరి, వుందన్న" విసుగేష్ తో  "మీకన్ని, అనుమానాలే, రేపే వెళ్ళి జాయినవుతా. "


 స్లిమ్ కేరుకు వెళ్లి, వాళ్ళు, చెప్పిన ఎక్సర్సైజులన్నీ, చేసింది. "మేడం, ఇది పూర్తిగా ఫ్రీ, మీ ఇంట్లో, ఫుడ్ తినకుండా, మేము ఇచ్చే డైట్ తినండని, చెప్పి, డైట్, ఇచ్చారు. ఇలా! నెలరోజులు, మేము చెప్పినట్లు, చేస్తే, మీరు స్లిమ్ అవుతారు. మిమ్మలని ఇంట్లో మా వాన్లో డ్రాప్ చేస్తామన్నారు. " ఆమాటకు ఎంతో, హ్యాపీగా ఫీలైంది భారవి. 


 "ఏమండీ!, చూసారా ఎంత మంచివాళ్లో, స్లిమ్ కేర్ వాళ్ళన్న" భార్యతో విసుగేష్, "వుండు తొందరపడకూ! ముందుంది ముసళ్ల పండగ" అన్నాడు. నెలయిన తర్వాత, భారవి, వెయిట్ చూసుకుంటే, పావుకేజి తగ్గింది. ముప్పైవేలు, కట్టమన్నారు, భారవినీ స్లిమ్ కేర్ వాళ్ళు. "అదేంటి, ఫ్రీగా అన్నారుగా" అంది, విస్తుపోతూ. 

"మేము, మీకు, ఎక్సర్సైజ్లు, చేయించినందుకు ఫీస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మీ డైటుకు, వానుకు మాత్రమే మాకు మీరు పే చేయాల్సింది. డైట్ కేర్, వాల్లైతే, దీనికి, వన్ లాక్ తీసుకుంటారు. "


 ఇంటికి వచ్చి భర్తతో చెపితే, "అపుడే నేను, దీంట్లో, ఎదో మతలబు, ఉందంటే, విన్నావా! ఇపుడు ఈ డబ్బు ఎక్కడనుండి తేవాలని కేకలేశాడు" విసుగేష్. ఆ రోజు అన్నం తినకుండా అలిగి పడుకుని ఒక నిర్ణయానికి వచ్చింది, భారవి. 


 మరుసటిరోజు లేస్తూనే.. "ఇవాల్టినుంచి, ఏమి తినను. పొద్దున నోము నోచుకుని సాయంత్రం అన్నం తింటాను. నాకు మార్కెట్ కెళ్ళి ఫ్రూట్స్ తెండి" అంది. 


"ప్రూట్స్ ఒక చిన్న ట్రక్ తీసుకురానా!" అన్న భర్తతో "మీకంతా! వేలాకోలమే, పొద్దున నుండి ఏమి తినననీ! జాలి, దయ లేదు మీకు నాపై" అంది భారవి. 

 

 "నేను కూడా నోము నోచుకుందామనుకుంటున్నాను" అన్నాడు విసుగేష్. "మగవాళ్ళకు వ్రతాలు ఏంటండీ! మీ పిచ్చి కాకపోతే" అంది.


 "నిన్న నోము టీవీలో చెప్పారు స్వామి సందేహానందా!"అన్నాడు విసుగేష్. "నేనంటే "పదహారు ఫలాల నోము పట్టా, మరి మీరు!" అంది భారవి. 

 

 "నేను ఫర్నిచర్ నోము పట్టా. ఈ వారం టీవీ మన వీధి చివరి ముష్టివాళ్లకు ఇద్దామనుకుంటున్నా. వచ్చే వారం సోఫా ఆ పైవారమని ఇంకేదో చెప్పేలోపు "ఆపండనీ " అరిచింది. "నీయమ్మ కడుపుమాడ తెలుగు సినిమాల్లో పెళ్లి సీన్లో అరిచినట్లు అరిచావేంటే!?" 

 

 ఏమండి ఒక్క టీవీ, సోఫా, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, తప్ప, ఇంకేవైనా, ఇవ్వండి. " "నీ మొహం మండా! ఇంకేమున్నాయి ఇవ్వటానికి, చెంబు, చాట, చీపురు తప్ప. అవి వాళ్ళు ఇచ్చినా! తీసుకోరు. నేను ఇవన్ని ఇవ్వకుండా వుండాలంటే.. నే చెప్పినట్లు చేయాలన్నాడు" విసుగేష్ 

 

 'అమ్మో! ఈయన చెప్పినట్లు చేయకపోతే అన్నంత పని చేస్తాడు. అసలే ఈయనకు విసుగుతో పాటు మొండితనము కూడ వుంది. వస్తువులన్నీ ఇచ్చినా! ఇస్తాడసలే. అవి నాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చారనుకుని "ఏమి చేయాలని" ఏడుపు ఫేసుతో అడిగింది. 

 

 "ముందు ఏడుపు ఫేస్ తీసి నవ్వు ఫేస్ పెట్టవే తల్లీ!" అన్న భర్తతో "మిమ్ముల్నయితే నేను ఎపుడు విసుగుతోనే చూస్తున్నా! ముందు, మీరు విసుగు ఫేస్ తీసి నవ్వు ఫేస్ పెట్టండన్నది" భారవి. 

 

 "పని మనిషిని మానేసి ఇంటిపని, అంట్లుతోమటం చేయి. అన్నం టీవీ చూస్తూ తినకు. ఇల్లు వూడవటం, బట్టలు వుతకటం, మెట్లు ఎక్కటం చేస్తే ఒళ్ళు రాదు. టీవీ లోని వంటలు చేయకు. అవన్నీ తింటే నిన్ను నువ్వు మోసుకోవాటనికి ఒక వీల్ చైర్ కొనుక్కోవాలి. అన్నం మిగిలిపోతే డస్ట్ బిన్లో పారేయి. అంతేగానీ నీ పొట్టలో వేయకు. పిల్లాడికి బాక్స్ ఇవ్వటానికి స్కూల్ కి నడిచి వెళ్లు. పొద్దునే నిమ్మకాయ నీళ్ళు తాగు, కూల్డ్రింక్స్ తాగకు. ఒళ్ళు తగ్గితే మన కాలనీ గుడిలో పెట్టే యోగాలో జాయినవ్వు. అపుడు చూద్దాం ఎందుకు తగ్గవో!" అన్నాడు విసుగేష్. 

 

 అపుడప్పుడు ముష్టివాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఒళ్ళు తగ్గకపోతే ఈ వస్తువులు వాళ్లకు ఇస్తానని బ్లాక్ మెయిల్ " చేస్తున్నాడు విసుగేష్. ఉక్రోషంతో తగ్గటానికి ట్రై చేయ సాగింది భారవి. ఒక నెల తర్వాత ఒక చెంచా మాత్రమే తగ్గింది. పర్లేదు తగ్గుతావంటూ! విసుగేష్ ప్రోత్సహంతో ఇంటిపనులు వాకింగ్, యోగ చేయటంవల్ల కాస్తా తగ్గింది భారవి. 

 

 గుడిలో విశ్వ సంపద నిర్వాహకులు, శ్రీ చంద్రశేఖరు రావు గారు యోగా కోర్సును మహిళలకు నిర్వహిస్తున్నారు. దానిలో జాయిన్ అయింది, భారవి. కల్యాణిగారు ఎంతో చక్కగా భారవికి యోగా నేర్పుతూ తనలో కాన్ఫిడెన్స్ ను నింపారు 


 "అమ్మగారు, మీరు సిక్కమాకండి, అయ్యగారు!, మాకు, మీఇంట్లో వున్న, పిజ్జు, టీవీ ఇత్తామన్నారు. మేము అడుక్కున్నవి, పిజ్జులో పెడితే బోలెడు, ఆదా అవుతది. అడుక్కుని, అలసిపోయి, ఇంటికిపోతే, టివి సూసుకుంటామన్నారు, " బిచ్చగాళ్లు. 


 వాళ్ల మాటలకు, రెచ్చిపోయి, ఇంటిపని, వాకింగ్, అండ్ యోగా చేస్తున్నది. రెండుకేజీలు తగ్గటంతో, ఇపుడు తన మీద తనకి కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా శ్రద్దగా యోగా కల్యాణి మేడం సాయంతో పట్టుదలగా చేయసాగింది భారవి. 

 

 అందుకే పెద్దాచిన్నా, ఆడామగా తేడా లేకుండా అందరం యోగా, వాకింగ్ చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుందాం. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.81 views4 comments

4 Comments@user-ud1vg2qu7b

• 2 hours ago

హాస్యం గా కథ బావుందండీ.

Like


@kalyanigattu6105

• 5 hours ago

Thank you for mentioning my name

Like

Tulasidevi Sanka

31 minutes ago

చాలా బాగుంది వసంత

Like


ఉదయ శంకర్

53 minutes ago

సరదాగాను, సందేశాత్మకంగాను ఉంది.

Like
bottom of page