top of page

నాదో బతుకు బండి


'Nado Bathuku Bandi' New Telugu Story

Written By Pitta Gopi

'నాదో బతుకు బండి' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

స్కూల్ లో మొదటి బహుమతిని అందుకుని ఆనందంగా వస్తూ తన ఇంటి దగ్గర జనం గుమిగూడి ఉండటం చూసి సూర్యం నెమ్మదిగా వస్తాడు.


వాకిట్లో తన తల్లిదండ్రులు నిర్జీవులుగా పడి ఉండటం చూసి బహుమతిని అటు విసిరేసి ‘అమ్మా.. నాన్న..’ అని పెద్దగా అరుస్తూ వెళ్ళి ప్రాణం లేని తన తల్లిదండ్రులు పై పడి ఏడుస్తూ..

“పెద్ద అయి మిమ్మల్ని బాగా చూసుకోవాలని, మీరు ఏ పని చేయకుండా ఇంటివద్ద ఉంచి నేనే సంపాదించి తెచ్చి మీరు నా పై పెట్టుకున్న అంచనాలకు మించి చేయాలనుకుంటే.. నాకు 15ఏళ్ళు నిండకుండానే వెళ్ళిపోతే ఎలా అండి.. లేవండి అమ్మ నాన్న..

ఎక్కడకి వెళ్ళినా చెప్పి వెళ్ళే మీరు చెప్పకుండా నన్ను విడిచి ఎందుకు వెళ్ళారు..” అని ఏడుస్తాడు.

ఎలాగైతేనేం.. ఆస్తులు లేకపోయినా తండ్రి సంపాదించిన డబ్బులు ఉంటే కర్మకాండలు పూర్తి చేస్తాడు.

"చదువుకోవాలంటే డబ్బులు ఉండాలి. అందుకోసం చదువు ఆపేసి తాను కష్టపడి సంపాదించటం మొదలుపెట్టాడు.

అలా వయసుకొచ్చి పనిలో తారసపడిన పిల్ల రమ ని పెళ్ళి చేసుకున్నాడు సూర్యం.

ఊరిలో తానకంటే కష్టపడిన వాడు ఎవడు లేనంతగా బాగా కష్టపడతాడు. బార్య కూడా తోడు ఉండటంతో వారి జీవితం సాదారణం స్థాయి కి వచ్చింది.

"ఇన్నాళ్లు కష్టపడ్డాం. పెళ్ళి తర్వాత కాస్తా తోడు దొరకటం వల్ల నాపైన బరువు తగ్గింది. పిల్లలు పుడితే వాళ్ళని పెద్దచేస్తే వాళ్ళే మనల్ని చూసుకుంటారని సూర్యం మనసులో అనుకున్నాడు.

కొన్నేళ్లుకు ఇద్దరు కొడుకులు పుట్టారు.

పెద్దవాడికి తండ్రి పేరు రమణ అని పెట్టి తండ్రి పై తనకున్న ప్రేమని చాటుకున్నాడు.

చిన్నవాడికి శేషు అని నామకరణం. అల్లారు ముద్దుగా వాళ్ళని పెంచారు. ఏం కావాలంటే అది తెచ్చి ఇచ్చేవారు. ఎందుకంటే కొడుకులే ఆ తల్లిదండ్రుల ప్రపంచం కనుక.

కానీ.. వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ సూర్యం కష్టాలు రెట్టింపు అవుతు వచ్చాయి.

దీంతో.. పగలు పని చేసి ఇంటికొచ్చాక, రాత్రి సమయంలో దగ్గర లో రైల్వే స్టేషన్లో రకరకాలు తినుబండారాలు అమ్ముతూ.. రైల్లో తిరుగుతూ ఎక్కడెక్కడో ఉంటు.. ఉదయానికి ఇంటికొచ్చి మరలా భార్యతో పనికి వెళ్ళటం.. ఇదే సూర్యం దినచర్య.

తాను ఇంటికొచ్చే సరికి పిల్లలు నిద్ర లేచేవారే కాదు. అలా వాళ్ళ ముఖం చూడకుండా ఎన్నో రోజులు.. ముఖం చూసినా.. వారితో గడిపే సమయమే ఉండేది కాదు కానీ..

కుటుంబానికి ఏ లోటు రానిచ్చేవాడు కాదు.

అలా పిల్లలు చదువు వయసు కి, తర్వాత యుక్త వయసు కి వచ్చారు.

సూర్యం కష్టం మాత్రం ఇంకా తగ్గలేదు.

ఎప్పటిలానే సూర్యం దినచర్య.

సూర్యం కష్టం రమ కు తప్ప కొడుకులకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు తమలా కష్టపడకుండా బతకాలని ఆ పిచ్చి తల్లిదండ్రులు ఆశ. ‘ఇంత కష్టపడి పెంచుతున్నాం మమ్మల్ని చూసుకోరా..’ అని ఆశ.

ప్రతి మనిషికి మంచి చెడు అనే కాలం ఉంటుంది కదా.. ఇంతకాలం కష్టపడిన ఆ తండ్రికి ఎట్టకేలకు పెద్ద కొడుకు రూపంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం లభించింది. రమణ ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యత నెత్తిన పెట్టుకోవటంతో తన తండ్రికి తాను చేయాల్సినవి తనకు తన కొడుకైన రమణ అలా చేయటంతో ఆనందం పడ్డాడు సూర్యం. అలా రెండెళ్ళైన కాలేదు.. చిన్నవాడు ఒక ప్రవేటు ఉద్యోగం తో సెటిల్ అయి మరింత ఆనందాన్ని తెచ్చాడు.

అలా ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడ్డారని నిర్దరించుకుని మొదట పెద్దవాడికి, కొన్నేళ్ల కు చిన్నవాడికి పెళ్ళిళ్ళు చేశాడు. కాలం అందరికీ ఒకేలా ఉండదు, అలాగే ఎప్పుడూ.. ఒకేలా ఉండదు కదా..

భార్యలు వచ్చాక ఇద్దరు కొడుకులకు తల్లిదండ్రులు పై ప్రేమ తగ్గుతు వచ్చింది. తల్లిదండ్రులను దూరం పెట్టి వారి బతుకు వారు చూసుకోవటం మొదలుపెట్టారు.

దీంతో సూర్యం కథ మొదటికొచ్చింది.

కథ మొదటికొచ్చింది కానీ.. సూర్యం వయసు అలా ఉండిపోదు కదా.. వయసు పైబడింది. భర్త కష్టం తెలిసి రమ కొడుకుల వద్దకు వెళ్ళి విషయం చెప్పింది.

"ప్రభుత్వ ఉద్యోగం అయితే మాత్రం కష్టపడకుండా వస్తుందా.. జీతం నాకు నా కుటుంబానికే చాలటం లేదు ఇంకా మీకెలా చూసుకోగల”నన్నాడు పెద్దోడు.

"ఎంత కష్టపడి మమ్మల్ని చూస్తే మాత్రం మాకోసం ఆస్తులు ఏమైనా సంపాదించాడా.. ప్రవేటు ఉద్యోగం.. జీతం నా కుటుంబం కే సరిపోవటం లేద”న్నాడు చిన్నోడు.

ఈ విషయం సూర్యం కి తెలియటంతో..

"వాళ్ళనెందుకు అడిగావు అసలు తప్పు నాది కష్టం తెలియకుండా వాళ్ళని పెంచాను బావుంది కానీ.. మన కష్టం తెలియకుండా పెంచటం నాదే తప్పు.

నేను నా జీవితాన్ని నా కొడుకుల కోసం త్యాగం చేసి వారితో ఆనందంగా గడిపిన రోజులను కోల్పోయాను. పోనీలే మనకు చూసుకుంటే మనుమలు తో అయినా ఆడుకోవచ్చు అనే మన ఆశలకు వాళ్ళు నిప్పు పెట్టారు. కనీసం ఆ నిప్పు మనం పోయాక పెట్టినా చాలు.. అని కన్నీటిని తుడుచుకుని, వృద్ధురాలైన బార్యని ఓదార్చి స్టేషన్లో తినుబండారాలు అమ్మేందుకు పయనం అవుతాడు సూర్యం.

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.
114 views3 comments
bottom of page