top of page

మనోదర్పణం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #Manodarpanam, #మనోదర్పణం

ree

Manodarpanam - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 26/10/2025

మనోదర్పణం - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


ఇంతులకు బాహ్య సౌందర్య సొబగులను కూర్చి మనోల్లాసమును చేకూర్చేది దర్పణం. 

అంతఃకరణ సౌందర్య సొగసులను చేర్చి చిత్త శుధ్ధిని చేకూర్చేది మనోదర్పణం.

ప్రాపంచిక భోగ విషయములపై మనస్సు ను ఆకర్షింపచేసి మనస్సుకు త్రృప్తిని కలిగించేది దర్పణం. 

ఆంతరంగిక విషయశోథన చేసి నిక్షిప్త సమీకరణ తో మనోనిర్మలతను ఇచ్చేది మనోదర్పణం. 

ఇహమునందు చేయు నిత్యకర్మలకు మనస్సును ప్రేరణచేసి మనోవైకల్యాన్ని ఇచ్చేది దర్పణం.

ఇహపర కర్మలను విశ్లేషణ చేసి మనస్సుకు స్వాంతన చేకూర్చేది మనోదర్పణం.

మన ముఖ హావ భావాలను ప్రస్ఫుటింప చేసి మనకు కర్మలను స్ఫురింప చేసే స్ఫూర్తి నిచ్చేది దర్పణం.

నిగూఢమైన మనోభావాలపై న్యాయవిశ్లేషణ చేసి మనకు సాక్షీభూతంగా నిలిచేది మనోదర్పణం.

చే జారి ముక్కలయినా అతకదు దర్పణం.

మనసు విరిగినా జత కలవదు మనోదర్పణం.

భోగత్వాన్నిచ్చేది దర్పణం - యోగత్వాన్నిచ్చేది మనోదర్పణం.

వేయేల ? ముంజేతి కంకణమునకు అద్దమేల?

నిర్మలమైన అంతఃకరణ కర్మలకు చిత్త శుధ్ధి ఏల ?


ree

-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page