top of page

మరు మల్లెల రాణి-- మకుటం లేని మహరాణి

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #MarumallelaRaniMakutamleniMaharani, #మరుమల్లెలరాణిమకుటంలేనిమహరాణి


Marumallela Rani Makutamleni Maharani- New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 06/06/2025

మరుమల్లెల రాణి-- మకుటం లేని మహరాణి - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


స్వఛ్ఛమైన  తెల్లని  నీ రూపం  - మంచి మనసుకు ప్రతిరూపం .


కన్నె మనసు కు దర్పణం  - మగువ మనసు కు శ్రృంగారం.


స్హ్నేహానికి  చిరునామా - చిరునవ్వు కు నజరానా.


అందమైన  మల్లెల  గుబాళింపు - సొగసైన  కన్నె మదిని దోచె.


మధురమైన  ఊహా జగతి లో-  కలల  రాకుమారుడి ని చూపె.


మల్లె తీగ వంటి  మగువకు  మనసెరిగిన  తోడు  జత


కలిస్తే  జీవితమంతా  చల్లని పందిరియే.


మ్రృగేష్ణ, మల్లియ,ప్రయ,శూన్య,ముద్గరము,.హసంతి, సుభగ, చంద్రిక, మల్లిక   వంటి పేర్లు ఎన్ని  ఉన్నా  నీ సౌకుమార్య  సుగంధ  పరిమళము  అనంతము.


శెంటు- అత్తరు - పర్ఫ్యూమ్  వంటి  సుగంథ  ద్రవ్యాలలో  వాడినా వాడిపోని  విరిసిన  మరుమల్లియవు.


నాగుపాము లాంటి  వాలుజడ లో  అందముగా కూర్చబడి  ప్రియుని  మదిని దోచి , మానస వీణ ను సుతారంగా  మీటి , ప్రణయ రాగాలు పలికించి, సరాగాల పూదోట లో  విహరించి , శ్రృంగార సామ్రాజ్యంలో  విహరింప చేసే  నాగమల్లి వి - సిరి మల్లివి.


దొంతర,కాడ,శంకు, బొడ్డు, కొండ‌,కంచె,నాగ మల్లి యని  రకములు  ఎన్ని ఉన్నా  సుదతి సోయగాలకు సుమనోహర  పుష్పానివి.


దోబూచులాడే  పున్నమి చంద్రుని  కాంతి లో,  మల్లె పందిరి నీడన, జవరాలు  సరసన  ఉంటే ,తనువు-మనసు  ఏకమై  ప్రణయ గీతిని ఆలపించే రతీ-మన్మథుల మానస చోరీ - ప్రణయ చకోరి.


ఇంతుల  పూబంతుల నడుమ  మరుమల్లెల రాణి- మకుటం లేని మహరాణివి.


-నీరజ  హరి ప్రభల


Comments


bottom of page