మీకు మీ ఆరోగ్యం పట్ల అవగాహనవుందా?
- A . Annapurna
- 2 days ago
- 3 min read

Meeku Mee Arogyam Patla Avagahana Unda - New Telugu Article Written By A. Annapurna
Published in manatelugukathalu.com on 28/06/2025
మీకు మీ ఆరోగ్యం పట్ల అవగాహనవుందా? - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
అమెరికా వెళ్లే తల్లి తండ్రుల అనుభవాలు ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి. అమ్మాయి డెలివరీకి కొందరు, అబ్బాయి పిలిస్తే కొందరు వెడుతూ వుంటారు.
ఇండియాలో ఐతే ఇంటికి తీసుకువచ్చి బిడ్డపుట్టిన మూడోనెలకు పంపడం, ఆ ఖర్చు పుట్టింటివారు భరించడం ఒకప్పటి సాంప్రదాయం. ఇప్పుడు అమ్మాయి టిక్కెట్టుకొని అవసరం నాదికదా అని పిలుస్తుంది. అంతవరకూ బాగానే వుంది.
మనంకూడా ఎవరిదగ్గిరకు వెళ్లినా కొంత ఖర్చు చేయడం మర్యాదగా ఉంటుంది. మనపిల్లలు ఐనా వాళ్ళకే ''డబ్బులు వూరికెరావు''. కష్టపడితేనే వస్తాయి. అలా అయితేనే వెళ్ళండి. లేదంటే మానుకోండి.
ఈ మధ్య చిన్న ఆరోగ్య సమస్యవచ్చి హాస్పిటల్కి వెళ్లాను. డాక్టరుగారి కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చి, పక్కనే కూర్చున్న ఆవిడను ''మీ సమస్య ఏమిటి?” అని అడిగాను. ''మోకాళ్ళ నొప్పులు'' అన్నారు ఆవిడ.
''ఈ రోజుల్లో అందరికీ ఇదే సమస్య. మందులు వాడకూడదు. పై పూతగా జెల్ ఆయింట్మెంట్, హీటింగ్ పాడ్ తో కాపడం, వాకింగ్ చాలండి. అంతగా తగ్గకపోతే స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇస్తారు. '' అన్నాను నా స్వంత అనుభవంలో.
''నాకు అంత వయసు లేదండి, జస్ట్ ఫిఫ్టీ. అమ్మాయి డెలివెరీకి అమెరికా వెళ్లాను. అదిగో అక్కడ చాకిరీకి పట్టుకుంది నాకే జబ్బు'' అంటూ అందుకు కూతురు కారణం ఐనట్టు చెప్పింది ఆవిడ.
నాకు మతి పొఇంది. నేనేమో మొదటిసారి ఆవిడను కలిసాను. నేను ఎవరో తెలియదు కూతురుమీద నింద వేసి చెబుతుంటే బాధగా అనిపించింది.
''ఆలా అనకండి. మీకు ఈ వయసులో అమెరికా వెళ్లకపోయినా మోకాలి నొప్పి సమస్య వచ్చేది. కారణం మెనోపాజ్ స్టేజ్. చిన్నపాటి ఎక్సర్ సైజులు వాకింగ్ చేయడం ఇంటిపని చేసుకోడమూ వలన అదుపులో ఉంటాయి. అమ్మాయికి అయ్యో ఎదో చేయలేదు.. .. అనిపిస్తుంది నాకు.
“పిల్లలు ఇద్దరి డెలివెరీలకు వెళ్లెను. చేయగల హెల్ప్ చేసాను. మనవలు పదహారు ఏళ్ళకి వచ్చారు. ఇప్పటికీ చేస్తాను. ఒక్కనాడు శ్రమ అనుకోలేదు. వాళ్లకి దగ్గిరే వేరే ఫ్లాట్ లో ఉంటాము.” అనిచెబితే ఆవిడ తెల్లమొహం వేసింది.
ఆవిడేకాదు.. .. చాలామంది మహిళలు టీవీ సీరియళ్లకు సినిమాలు చూడటానికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యం గురించిన అవగాహన నేర్చుకోరు.
ప్రతి చానెల్, పత్రికలూ, వివరిస్తూనేవున్న.. పట్టించు కోవడంలేదు. సమస్య వచ్చినపుడు డాక్టర్ దగ్గిరకు వెళ్లడం వాళ్ళు దీర్ఘకాల వైద్యం చేసి చివరకు ఆపరేషన్ తప్పదు అనడం ఈ రోజుల్లో కామన్ ఐపోయిన్ది.
పోనీ టీవీ లో చూడద్దు పత్రికలూ చదవద్దు. మీ పరిచయస్తులు స్నేహితులు బంధువులు వుంటారుకదా వారితో చర్చించుకోండి. అందులో ఈ వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుస్తాయి. నాకేకాదు అందరికి ఉంటాయి. అని తెలియడం వలన పరిష్కారం పంచుకోండి.
ఒక ప్లానుతో నియంత్రణ సాధ్యమే అని తెలుసుకుంటారు. ఆహార నియమాలు మార్చుకోండి. ఆరోగ్య సూత్రాలు పాటించండి. పూర్తిగా తగ్గకపోయినా అదుపులో ఉంటాయి. ఇది నిజం. మన ఆరోగ్యం మన చేతిలో కొంత వుంది. మరీ తప్పదు ఆనుకుంటే డాక్టర్ ను కలవండి. మనం సహకరించకపోతే డాక్టర్ కూడా ఏమి చేయలేడు. ఆయన చెప్పేది తప్పకుండా పాటించాలి. ఆలోచిస్తారు కదూ!
*******************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)

Comentários